- దరఖాస్తు చేసుకునేందుకు 31వ తేదీ వరకు అవకాశం
- యూఐడీ లేకున్నా ఈఐడీ నంబర్ ఉంటే చాలు
- బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, ఈబీసీ, డీడబ్ల్యూ, మైనార్టీ విద్యార్థులకు ఊరట
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేసేలా సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) నిర్ణయం తీసుకుంది. 2013-14 విద్యా సంవత్సరం వరకు బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ, డీడబ్ల్యూ, ఈబీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు పొందాలంటే ఆధార్‌కార్డు కలిగి ఉండాలని నిబంధన ఉండింది. ఈ నిబంధన వల్ల గతేడాది జిల్లాలో దాదాపు 15 వేల మంది ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఫీజు, ఉపకారానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి ఆధార్ నమోదు చేసుకున్నారు. అయితే వారికి ఆధార్ నమోదు చేసుకున్నట్లు ఈఐడీ నంబర్లు ఇచ్చారే తప్ప, యూఐడీ నంబర్లు రాలేదు. నెలల తరబడి మీ సేవా కేంద్రాల చుట్టు, పోస్టాఫీసుల చుట్టు తిరిగినా, త్వరలో ఆధార్‌కార్డులు వస్తాయనే సమాధానం తప్ప ఫలితం కనిపించలేదు. దీం తో ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ మంజూరు కాలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫీజును చెల్లించాల్సి వస్తుందేమోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆ సమయంలోనే జిల్లాలోని పలు కళాశాలల యాజమాన్యాలు సంబంధిత విద్యార్థులను ఫీజును చెల్లించాలని, లేని పక్షంలో పరీక్ష హాల్‌టికెట్లు ఇవ్వబోమని కూడా బెదిరించినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఫీజుకు ఆధార్‌తో వున్న లింకును తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈఐడీ నంబర్ ఉంటే మీ సేవా కేంద్రాల్లో ఫీజు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది.
ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డు రాని విద్యార్థులు ఫీజు, ఉపకార వేతనం పొందేందుకు వారి ఈఐడీ (28 అంకెలు) నంబర్‌ను ఈ పాస్ వెబ్‌సైట్ జ్ట్టిఞ://్ఛఞ్చటట. ఛిజజ.జౌఠి.జీ అనే అడ్రస్‌కు ఆన్‌లైన్‌లో మీ సేవా కేం ద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఆధార్ లేకున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్
Published Tue, May 20 2014 12:48 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement