Center for Good Governance
-
ఈ–పాస్‌లో మార్పులు.. త్వరలో బిల్లుల చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: గత(2019–20) వార్షిక సంవత్సరం చివరి రోజుల్లో లాక్డౌన్ కారణంగా రద్దయిన బిల్లులకు మోక్షం కల్పించేందుకు సంక్షేమ శాఖలు ఉపక్రమించాయి. సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ వాటిని తిరిగి ఖజానా శాఖకు సమర్పించేలా చర్యలు చేపట్టాయి. ఈమేరకు ఈ–పాస్ వెబ్సైట్లో మార్పులు చేసేందుకు సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)కు సూచనలు చేశాయి. 2019–20 వార్షిక సంవత్సరం చివరి పది రోజులు లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.దీంతో కీలకమైన పథకాలకు చెందిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా వార్షిక సంవత్సరం ముగియడంతో మునుపటి ఏడాది బిల్లులు చెల్లింపులకు సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ఖజానా విభాగం అధికారులు తిరిగి పంపిస్తున్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ముంట్, కళ్యాణలక్ష్మి పథకాలకు చెందిన దాదాపు రూ.350 కోట్ల విలువైన బిల్లులు వెనక్కు వచ్చాయి. వార్షిక సంవత్సరం ముగియడంతో వాటిని క్లియర్ చేసే వీలుండకపోవడంతో వాటిని ఖజానా విభాగం వెనక్కు పంపింది. ఈ బిల్లులను కొత్త వార్షిక సంవత్సరం ప్రకారం రూపకల్పన చేసి పంపాలని నిర్ణయించి... ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. సాంకేతిక సమస్యలకు చెక్... సంక్షేమ శాఖలకు చెందిన బిల్లుల రూపకల్పన అంతా ఈ–పాస్ వెబ్సైట్ ద్వారానే నిర్వహిస్తారు. పలు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ–పాస్ ద్వారానే వస్తాయి. వీటిని ఆన్లైన్ ద్వారానే పరిశీలించి, ఆమోదించి నిధుల విడుదల కోసం ఖజానా శాఖకు పంపిస్తారు. ఈ క్రమంలో 2019–20 వార్షిక సంవత్సరం చివర్లో లాక్డౌన్ కారణంగా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆ ఏడాది చివరి పది రోజుల పాటు అత్యవసర సేవలు మినహా మిగతావేవీ ముందుకు కదలలేదు. ఫలితంగా ఆ సంవత్సరానికి సంబంధించిన పలు బిల్లులు క్లియర్ కాకపోవడంతో వాటిని వెనక్కు పంపాల్సివచ్చింది. ప్రస్తుతం అవన్నీ జిల్లా సంక్షేమాధికారి యూజర్ అకౌంట్లో ఉన్నాయి. వీటిలో 2020–21 సంవత్సరం తేదీల ప్రకారం సరిదిద్దాలి. ఇందుకు ఈపాస్ వెబ్సైట్లో మార్పులు చేయాలి. ఇందులో భాగంగా సంక్షేమ శాఖ అధికారులు సీజీజీతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయించారు. సవరణలు, మార్పులు చేసేం దుకు ఉపక్రమించారు. కళ్యాణలక్ష్మి పథకం బిల్లుల్లో సవరణలు పూర్తి చేసిన అధికారులు... ప్రస్తుతం ఫీజు రీయిం బర్స్మెంట్ పథకం బిల్లుల్లో మార్పులు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లా సంక్షేమాధికారి లాగిన్ ద్వారా బిల్లులను ఖజానా శాఖకు సమర్పిస్తారు. అక్కడ వాటిని ఆమోదించి టోకెన్లు జనరేట్ చేస్తారు. 2020–21 వార్షిక సంవత్సరం తొలి త్రైమాసికం నిధులు విడుదలైన వెంటనే వీటిని క్లియర్ చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
ఇక.. ఈ–ఎస్సార్!
సాక్షి, హైదరాబాద్: సర్వీస్ రికార్డు... సంక్షిప్తంగా ఎస్సార్ అంటూ పిలిచే దీనికి పోలీసు విభాగంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఐపీఎస్‌లు కాని పోలీసు అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి ఇది అత్యంత కీలకం. పరిపాలన విభాగం నిర్లక్ష్యంతో ఇందులో ఏర్పడే లోపాల కారణంగా కొందరైతే పదోన్నతుల్నీ కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఈ–ఎస్సార్ విధానానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ కమిషనరేట్ సహా రాష్ట్రంలో 45 శాతం ఆన్లైన్ చేయడం పూర్తయింది. త్వరలో పూర్తిస్థాయి డేటాబేస్ రూపొందించి టీఎస్ కాప్ యాప్ ద్వారా ప్రతి అధికారి, సిబ్బందికి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పేరుతో ఈ–ఎస్సార్‌ను అమలు చేస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలతో ఆఘమేఘాల మీద పోలీసు ఉన్నతాధికారులు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారుల పదోన్నతులు పరిపాలనా విభాగంలోని లోపాలను బట్టబయలు చేశాయి. అక్కడి క్లర్కులు చేస్తున్న అనేక పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు డీఎస్పీ పదోన్నతుల కోసం అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వచ్చింది. మాన్యువల్ ఎస్సార్‌లో తలెత్తిన సమస్యల్ని సరిచేయించుకోవడం కోసం ఆయా అధికారులు డీజీపీ కార్యాలయం చుట్టూ కొన్ని వారాల పాటు ప్రదక్షిణలు చేశారు. మాన్యువల్‌తో ఇబ్బందులు.. సర్వీస్ రికార్డుల్ని మాన్యువల్‌గా నిర్వహిస్తుండటంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ అధికారి/సిబ్బందిపై వచ్చిన నెగెటివ్ అంశాలను వేగవంతంగా రికార్డులో పొందుపరుస్తున్న పరిపాలన విభాగం పాజిటివ్ అంశాలను చేర్చట్లేదనే విమర్శలున్నాయి. పోలీస్ విభాగంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని, చిన్న తప్పుల్ని సైతం తీవ్రంగా పరిగ ణిస్తారు. బాధ్యులకు మెమోలు, చార్జ్‌మెమోలు, సాన్‌షూయ్, పోస్ట్‌పోన్ మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ వంటి శిక్షలు వేస్తుంటారు. వాటి ఉత్తర్వుల్ని పరి పాలనా విభాగాలకు పంపి సర్వీసు రికార్డుల్లోకి ఎక్కేలా చర్యలు తీసుకుం టారు. కొన్నిశిక్షల్ని ఉపసంహరించినప్పుడు, కాలపరిమితి తీరిన తరు వాత ఆ వివరాలను సర్వీసు రికార్డుల్లో నమోదయ్యేలా చూస్తారు. అని వార్య కారణాల నేపథ్యంలో ప్రతికూల అంశాలను రికార్డుల్లో ఎక్కిం చినంత అనుకూలాంశాలు పొందుపర్చ ట్లేదనే ఆరోపణ ఉంది. పదోన్నతి కోల్పోయిన వారెందరో.. గతంలో జరిగిన ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలో తనకంటే జూనియర్ల పేరు ఉండి, తన పేరు లేకపోవడాన్ని గమనించిన ఓ ఇన్స్పెక్టర్ ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఈయనకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమో ఇవ్వకుండానే ఆనవాయితీకి విరుద్ధంగా సాన్‌షూయ్ ఇచ్చారు. ఇది సర్వీసు రికార్డుల్లోకి ఎక్కింది. జరిగిన పొరపాటులో తన ప్రమేయం లేదని మొరపెట్టుకోగా... దాన్ని ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీటిని సంబంధిత క్లర్కు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్‌గా సర్వీసు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో రెండు శిక్షలు ఉన్నాయంటూ సదరు ఇన్స్పెక్టర్ పేరును అధికారులు సీనియారిటీ జాబితాలో చేర్చలేదు. మరో ఇన్స్పెక్టర్కు ఎదురైన ఇబ్బంది మరీ ఘోరంగా ఉంది. ఈయనకు గతంలో సాన్‌షూయ్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ రెండూ సర్వీసు రికార్డుల్లోకి ఎక్కాయి. నిబంధనల ప్రకారం సాన్‌షూయ్ వచ్చిన ఏడాది వరకు, పోస్ట్పోన్మెంట్ వచ్చిన రెండేళ్ల వరకు ఆ అధికారికి పదోన్నతులు తదితరాలు వర్తించవు. ఒకే తేదీన ఈ రెంటినీ పొందిన సదరు ఇన్స్పెక్టర్ వాస్తవానికి రెండేళ్లలోనే రెంటి కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. దీనికి విరుద్ధంగా మూడేళ్ల వరకు అర్హుడు కాదంటూ పరిపాలనా విభాగం సీనియారిటీ జాబితాలో పేరు చేర్చకపోవడంతో పదోన్నతి, సీనియారిటీ కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులు కోకొల్లలుగా ఉంటారు. 45 శాతం పూర్తి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఎస్సార్‌ను ఆన్లైన్ చేస్తూ ఈ–ఎస్సార్ ప్రవేశపెడుతోంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 45 శాతం ఈ ప్రాజెక్టు పూర్తయింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇచ్చినా త్వరలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి/సిబ్బందికి సంబంధించిన సర్వీసు రికార్డులు అన్ని వేళల్లోనూ టీఎస్ కాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఏవైనా లోపాలు ఉన్నట్లు గమనిస్తే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు. ఆ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారమవుతుంది. అలా కానిపక్షంలో వీటిని పర్యవేక్షించే ఉన్నతాధికారులకు పరిపాలన విభాగం సిబ్బంది ఆ దరఖాస్తు ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉంది? ఎందుకు ఉంచాల్సి వచ్చింది? తదితర వివరాలు ఎప్పటికప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ‘భద్రత’పథకం కింద ఇచ్చే రుణాలు, ఇతర సౌకర్యాలు తదితరాలను కూడా ఆన్లైన్ ద్వారానే యాప్‌లోకి తీసుకువచ్చి పారదర్శకంగా చేయాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించింది. -
అందుకే టీడీపీ నేతలపై కేసులు ఎత్తివేత
సాక్షి, అమరావతి: రాజకీయ నేతలపై నమోదైన క్రిమినల్ కేసులను ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేసింది. నేతలపై ఉన్న కేసులను నిబంధనలకు విరుద్ధంగా మూకుమ్మడిగా చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. ఆ సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రెడ్డ్పె్పరెడ్డి, ఉపాధ్యక్షులు ఏవీ కృష్ణారెడ్డి, డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తదితర బృంద సభ్యులు ఢిల్లీలోని సీఈసీతో సమావేశమయ్యారు. ఏపీలో నేతలపై కేసులను ఎత్తేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సీఈసీకి అందజేశారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో దేశవ్యాప్త చర్చ నిబంధనలను తోసిరాజని చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలపై ఉన్న కేసులను ఎత్తివేస్తూ పెద్ద ఎత్తున జీవోలు జారీ చేసిన విషయం ఈ సందర్భంగా మరోసారి దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా జీవనానికి భంగం కలిగించడం తదితర అనేక సెక్షన్లపై గతంలో తెలుగుదేశం నాయకులపై నమోదైన కేసులను చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కింజరపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేస్తూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిన కేసుల వివరాలు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరికొంతమందిపై ఇబ్రహీంపట్నం, విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పీఎస్‌లలో నమోదైన 5 కేసులను ఎత్తివేస్తూ 2015 జూన్ 4న జీవో నంబర్ 647 జారీ చేసింది. ఆయా పోలీస్స్టేషన్లలో 400/2013, 178/2014, 959/2012, 403/2013, 93/2005 క్రైమ్ నంబర్లతో కేసులు నమోదు అయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్రపై రాబర్ట్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 78/2012, 40/2014, ఇనకుదురు పోలీస్‌స్టేషన్‌లో 54/2012 కేసులను ఎత్తివేస్తూ 2017 మే 3న జీవోలు 361, 362, 363 జారీ చేశారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట 1 పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 81/2009, 105/2009, 107/2009 కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 9న జీవో 664 జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న క్రైమ్ నంబర్ 42/2009 కేసును ఉపసంహరించుకుంటూ కోర్టుకు నివేధించాలని 2017 మార్చి 10న జీవో 192ను ప్రభుత్వం జారీ చేసింది. మరో కేసు క్రైమ్ నంబర్ 42/2009 విచారణ నుంచి తప్పిస్తూ 2016 సెప్టెంబర్ 14న 681జీవో ఇచ్చింది. శాసనమండలి డెప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరో 33మందిపై రావులపాలెం పీఎస్‌లో నమోదైన 159/2011 కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 ఫిబ్రవరి 27న జీవో జారీ అయింది. మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ఆరుగురిపై కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రై మ్ నంబర్ 68/2013 కేసు విచారణ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం 2015 జూన్ 23న జీవో 704 జారీ చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు క్రైమ్ నంబర్ 15/2009లో విచారణ నుంచి తప్పిస్తూ 2016 మార్చి 4న జీవో 143 జారీ చేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్‌రెడ్డి మరో 20 మందిపై వైఎస్సార్సీపీలో ఉండగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన అభియోగంపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం ఆయన టీడీపీలో చేరిన తరువాత ఆయనపై ఉన్న క్రైం నంబర్ 152/2014ను ఉపసంహరించుకుంటూ 2017 మే 9న జీవో 379తో ఎత్తివేసింది. మంత్రి నక్కా ఆనందబాబు మరో నలుగురిపై వేమూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 82/2013 కేసును ఎత్తివేస్తూ 2017 ఫిబ్రవరి 7న జీవో 97 జారీ చేశారు. ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ మరో 15మందిపై విచారణలో ఉన్న క్రైమ్ నంబర్ 122/2009 కేసు నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే ఎ.ఆనందరావు మరో ఏడుగురిపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అభియోగంపై క్రైం నంబర్ 37/2012 కేసును ఎత్తేస్తూ 2017 మార్చి 28న 261జీవో జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వివేకానంద మరో 21 మందిపై నమోదైన క్రైం నంబర్ 65/2011 కేసులో విచారణ నుంచి తప్పిస్తూ 2016 ఏప్రిల్ 21న జీవో 278 జారీ చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్భాషా మరికొంతమందిపై మదనపల్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 59/2009 కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం 2017 మే 9న జీవో 380 జారీ చేసింది. అనంతపురం జిల్లాలో నమోదైన క్రైం నంబర్ 34, 35, 36/2007 కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ అప్పటి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యర్రబెల్లి దయాకర్‌రెడ్డి, రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్టు గోవిందరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, హరీశ్వర్‌రెడ్డి, బాబు రమేష్, పడాల అరుణ, లలితకుమారి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరావు, వై.వి.బి.రాజేంద్రప్రసాద్, మసాల పద్మజ, చిన్నరాజప్పతో పాటు మరో నలుగురికి ఉపశమనం కలిగిస్తూ ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న జీవో 907 జారీ చేసింది. మూలపాడు పంచాయతీ ఎన్నికల్లో ఆందోళనకు దిగి రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయేలా వ్యవహరించి, ఉద్రిక్తతకు కారణమైన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై 2013లో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతోపాటు విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్స్టేషన్లలో 178/2014, 959/2012, 403/2013, 93/2005 క్రైం నంబర్లతో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తూ 2015 జూన్ 4న జీవో 647 జారీ చేసింది. స్పీకర్ కోడెల తన అనుచరులతో నరసరావుపేటలో 2009లో ధర్నా చేయడంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులను నెట్టడం, రాళ్లు రువ్వడం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. 353 నాన్‌బెయిలబుల్ సెక్షన్‌పై కేసు నమోదు చేయడంతో అప్పట్లో అరెస్టు అయిన కోడెల గుంటూరు సబ్‌జైలులో కొద్ది రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఆ కేసులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేసింది. ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణతో పాటు మరో 15 మందిపై నరసరావుపేట–1టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 122/2009 కేసును ఎత్తివేస్తూ గత ఏడాది సెప్టెంబర్ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్భాషా, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఇలా.. మూకుమ్మడిగా కేసులు ఎత్తివేయడంపై విచారణకు ఆదేశించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్సంస్థ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఫిర్యాదులోని ముఖ్యాంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నిలకలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులతో సహా ఎన్నికల సమయానికి నమోదైన కేసులు వేటిని ఉపసంహరించకూడదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్పష్టంగా పేర్కొందని తెలిపారు. చట్ట ప్రకారమే ఆ కేసులకు ముగింపు పలకాల్సి ఉంటుందని, 2009లోనే కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం 21 మంది ప్రజాప్రతినిధులపై అనేక కేసులను ఉపసంహరించడం నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను పెద్దఎత్తున ఉపసంహరించడానికి సంబంధించిన విషయాన్ని తమ సంస్థ 2017 మే 15న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. -
ఆధార్ లేకున్నా ఫీజు రీయింబర్స్మెంట్
- దరఖాస్తు చేసుకునేందుకు 31వ తేదీ వరకు అవకాశం - యూఐడీ లేకున్నా ఈఐడీ నంబర్ ఉంటే చాలు - బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, డీడబ్ల్యూ, మైనార్టీ విద్యార్థులకు ఊరట కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేసేలా సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) నిర్ణయం తీసుకుంది. 2013-14 విద్యా సంవత్సరం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డీడబ్ల్యూ, ఈబీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు పొందాలంటే ఆధార్‌కార్డు కలిగి ఉండాలని నిబంధన ఉండింది. ఈ నిబంధన వల్ల గతేడాది జిల్లాలో దాదాపు 15 వేల మంది ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఫీజు, ఉపకారానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి ఆధార్ నమోదు చేసుకున్నారు. అయితే వారికి ఆధార్ నమోదు చేసుకున్నట్లు ఈఐడీ నంబర్లు ఇచ్చారే తప్ప, యూఐడీ నంబర్లు రాలేదు. నెలల తరబడి మీ సేవా కేంద్రాల చుట్టు, పోస్టాఫీసుల చుట్టు తిరిగినా, త్వరలో ఆధార్‌కార్డులు వస్తాయనే సమాధానం తప్ప ఫలితం కనిపించలేదు. దీం తో ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ మంజూరు కాలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫీజును చెల్లించాల్సి వస్తుందేమోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలోనే జిల్లాలోని పలు కళాశాలల యాజమాన్యాలు సంబంధిత విద్యార్థులను ఫీజును చెల్లించాలని, లేని పక్షంలో పరీక్ష హాల్‌టికెట్లు ఇవ్వబోమని కూడా బెదిరించినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఫీజుకు ఆధార్‌తో వున్న లింకును తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈఐడీ నంబర్ ఉంటే మీ సేవా కేంద్రాల్లో ఫీజు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డు రాని విద్యార్థులు ఫీజు, ఉపకార వేతనం పొందేందుకు వారి ఈఐడీ (28 అంకెలు) నంబర్‌ను ఈ పాస్ వెబ్సైట్ జ్ట్టిఞ://్ఛఞ్చటట. ఛిజజ.జౌఠి.జీ అనే అడ్రస్‌కు ఆన్లైన్లో మీ సేవా కేం ద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.