అందుకే టీడీపీ నేతలపై కేసులు ఎత్తివేత | Cases on TDP Leaders Withdrawn For Political Gain | Sakshi
Sakshi News home page

అందుకే టీడీపీ నేతలపై కేసులు ఎత్తివేత

Published Wed, Mar 27 2019 1:47 PM | Last Updated on Wed, Mar 27 2019 2:00 PM

Cases on TDP Leaders Withdrawn For Political Gain - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ నేతలపై నమోదైన క్రిమినల్‌ కేసులను ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేసింది. నేతలపై ఉన్న కేసులను నిబంధనలకు విరుద్ధంగా మూకుమ్మడిగా చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. ఆ సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రెడ్డ్పె్పరెడ్డి, ఉపాధ్యక్షులు ఏవీ కృష్ణారెడ్డి, డాక్టర్‌ రావు చెలికాని, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తదితర బృంద సభ్యులు ఢిల్లీలోని సీఈసీతో సమావేశమయ్యారు. ఏపీలో నేతలపై కేసులను ఎత్తేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సీఈసీకి అందజేశారు.  

 ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఫిర్యాదుతో దేశవ్యాప్త చర్చ  
నిబంధనలను తోసిరాజని చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలపై ఉన్న కేసులను ఎత్తివేస్తూ పెద్ద ఎత్తున జీవోలు జారీ చేసిన విషయం ఈ సందర్భంగా మరోసారి దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా జీవనానికి భంగం కలిగించడం తదితర అనేక సెక్షన్లపై గతంలో తెలుగుదేశం నాయకులపై నమోదైన కేసులను చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది.  అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, శాసనమండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కింజరపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేస్తూ వచ్చారు.  

చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిన కేసుల వివరాలు 

  • మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరికొంతమందిపై ఇబ్రహీంపట్నం, విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పీఎస్‌లలో నమోదైన 5 కేసులను ఎత్తివేస్తూ 2015 జూన్‌ 4న జీవో నంబర్‌ 647 జారీ చేసింది. ఆయా పోలీస్‌స్టేషన్లలో 400/2013, 178/2014, 959/2012, 403/2013, 93/2005 క్రైమ్‌ నంబర్లతో కేసులు నమోదు అయ్యాయి. 
  • మంత్రి కొల్లు రవీంద్రపై రాబర్ట్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్‌ 78/2012, 40/2014, ఇనకుదురు పోలీస్‌స్టేషన్‌లో 54/2012 కేసులను ఎత్తివేస్తూ 2017 మే 3న జీవోలు 361, 362, 363 జారీ చేశారు.  
  • అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట 1 పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్‌ నంబర్‌ 81/2009, 105/2009, 107/2009 కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్‌ 9న జీవో 664 జారీ చేసింది.  
  • ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న క్రైమ్‌ నంబర్‌ 42/2009 కేసును ఉపసంహరించుకుంటూ కోర్టుకు నివేధించాలని 2017 మార్చి 10న జీవో 192ను ప్రభుత్వం జారీ చేసింది. మరో కేసు క్రైమ్‌ నంబర్‌ 42/2009 విచారణ నుంచి తప్పిస్తూ 2016 సెప్టెంబర్‌ 14న 681జీవో ఇచ్చింది.  
  • శాసనమండలి డెప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరో 33మందిపై రావులపాలెం పీఎస్‌లో నమోదైన 159/2011 కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 ఫిబ్రవరి 27న జీవో జారీ అయింది.  
  • మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ఆరుగురిపై కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రై  మ్‌ నంబర్‌ 68/2013 కేసు విచారణ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం 2015 జూన్‌ 23న జీవో 704 జారీ చేసింది. 
  • మంత్రి గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు క్రైమ్‌ నంబర్‌ 15/2009లో విచారణ నుంచి తప్పిస్తూ 2016 మార్చి 4న జీవో 143 జారీ చేసింది.  
  • ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్‌రెడ్డి మరో 20 మందిపై వైఎస్సార్‌సీపీలో ఉండగా  ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన అభియోగంపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం ఆయన టీడీపీలో చేరిన తరువాత ఆయనపై ఉన్న క్రైం నంబర్‌ 152/2014ను ఉపసంహరించుకుంటూ 2017 మే 9న జీవో 379తో ఎత్తివేసింది. 
  • మంత్రి నక్కా ఆనందబాబు మరో నలుగురిపై వేమూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్‌ నంబర్‌ 82/2013 కేసును ఎత్తివేస్తూ 2017 ఫిబ్రవరి 7న జీవో 97 జారీ చేశారు. 
  • ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ మరో 15మందిపై విచారణలో ఉన్న క్రైమ్‌ నంబర్‌ 122/2009 కేసు నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్‌ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది. 
  • టీడీపీ ఎమ్మెల్యే ఎ.ఆనందరావు మరో ఏడుగురిపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అభియోగంపై క్రైం నంబర్‌ 37/2012 కేసును ఎత్తేస్తూ 2017 మార్చి 28న 261జీవో జారీ చేసింది. 
  • తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ వివేకానంద మరో 21 మందిపై నమోదైన క్రైం నంబర్‌ 65/2011 కేసులో విచారణ నుంచి తప్పిస్తూ 2016 ఏప్రిల్‌ 21న జీవో 278 జారీ చేసింది.  
  • చిత్తూరు జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌భాషా మరికొంతమందిపై మదనపల్లి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 59/2009 కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం 2017 మే 9న జీవో   380 జారీ చేసింది. 
  • అనంతపురం జిల్లాలో నమోదైన క్రైం నంబర్‌ 34, 35, 36/2007 కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ అప్పటి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యర్రబెల్లి దయాకర్‌రెడ్డి, రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్టు గోవిందరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, హరీశ్వర్‌రెడ్డి, బాబు రమేష్, పడాల అరుణ, లలితకుమారి, అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరావు, వై.వి.బి.రాజేంద్రప్రసాద్, మసాల పద్మజ, చిన్నరాజప్పతో పాటు మరో నలుగురికి ఉపశమనం కలిగిస్తూ ప్రభుత్వం 2016 డిసెంబర్‌ 29న జీవో 907 జారీ చేసింది.  
  • మూలపాడు పంచాయతీ ఎన్నికల్లో ఆందోళనకు దిగి రెండు గంటల పాటు పోలింగ్‌ నిలిచిపోయేలా వ్యవహరించి, ఉద్రిక్తతకు కారణమైన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై 2013లో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతోపాటు  విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్‌స్టేషన్‌లలో 178/2014, 959/2012, 403/2013, 93/2005 క్రైం నంబర్లతో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తూ 2015 జూన్‌ 4న జీవో 647 జారీ చేసింది.  
  • స్పీకర్‌ కోడెల తన అనుచరులతో నరసరావుపేటలో 2009లో ధర్నా చేయడంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులను నెట్టడం, రాళ్లు రువ్వడం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. 353 నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌పై కేసు నమోదు చేయడంతో అప్పట్లో అరెస్టు అయిన కోడెల గుంటూరు సబ్‌జైలులో కొద్ది రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఆ కేసులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేసింది.  
  • ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణతో పాటు మరో 15 మందిపై నరసరావుపేట–1టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్‌ 122/2009 కేసును ఎత్తివేస్తూ గత ఏడాది సెప్టెంబర్‌ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది.  
  • మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌భాషా, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఇలా.. మూకుమ్మడిగా కేసులు ఎత్తివేయడంపై విచారణకు ఆదేశించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌సంస్థ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.   

ఫిర్యాదులోని ముఖ్యాంశాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నిలకలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులతో సహా ఎన్నికల సమయానికి నమోదైన కేసులు వేటిని ఉపసంహరించకూడదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ స్పష్టంగా పేర్కొందని తెలిపారు. చట్ట ప్రకారమే ఆ కేసులకు ముగింపు పలకాల్సి ఉంటుందని, 2009లోనే కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం 21 మంది ప్రజాప్రతినిధులపై అనేక కేసులను ఉపసంహరించడం నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్‌ కేసులను పెద్దఎత్తున ఉపసంహరించడానికి సంబంధించిన విషయాన్ని తమ సంస్థ 2017 మే 15న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement