
'ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్ పెడతామనడం సిగ్గుచేటు'
నిజామాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏసీబీని ఎదుర్కోవాలంటే చట్టబద్ధంగానే ముందుకెళ్లాలని ప్రొఫెసర్ కోదందరాం సూచించారు. పట్టణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీస్ స్టేషన్ పెడతామని ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం సహా మంత్రులు చట్టబద్ధంగా నడుచుకోవాలి, కానీ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు చెడగొట్టేలా మాట్లాడరాదని ఈ సందర్భంగా కోదండరాం హితవు పలికారు.