చంద్రబాబు టూర్ షెడ్యూల్లో మార్పులు | Chandrababu naidu tour schedule changes at Tirupati | Sakshi

చంద్రబాబు టూర్ షెడ్యూల్లో మార్పులు

Published Mon, Aug 29 2016 5:29 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM

చంద్రబాబు టూర్ షెడ్యూల్లో మార్పులు - Sakshi

చంద్రబాబు టూర్ షెడ్యూల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్లో మార్పులు చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్లో మార్పులు చేశారు. తిరుపతిలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా, తిరుపతి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తంబళ్లపల్లి నుంచి విజయవాడకు పయనమైనట్టు తెలుస్తోంది. విజయవాడలో మూడున్నర గంటలకు జరగాల్సిన దుర్గాఘాట్ కార్యక్రమం వాయిదా పడింది. తిరుపతి పర్యటనను చంద్రబాబు అర్ధంతరంగా రద్దు చేసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఓటుకు కోట్టు కేసులో కోర్టు తీర్పుపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసు విషయంలో పునర్విచారణపై నోరు మెదపని టీడీపీ నేతలు... అధినేత చంద్రబాబు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయనిపుణులతో సమావేశమయ్యే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement