వెబ్‌సైట్‌లో తెలంగాణ పోరాట క్రమం!
ముఖ్య సమాచారాన్ని అందుబాటులోకి తెస్తాం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సిలబస్‌తోపాటు ముఖ్యమైన సమాచారాన్ని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు గ్రూప్-1 సిలబస్ సబ్‌కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాట క్రమం, ఆవిర్భావంపై ప్రామాణిక పుస్తకాలు లేనందున విద్యార్థుల్లో ఆందోళనలున్నాయన్న విషయాన్ని ఆయన దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లగా స్పందించారు.
ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారి రచనలు, ఉద్యమంపై వచ్చిన రచనలు అందుబాటులోకి తేవాలనుకున్నట్లు చె ప్పారు. మరిన్ని అంశాలు ఆయన మాట ల్లోనే.. ‘‘ముఖ్యంగా గ్రూప్-1 మెయిన్స్‌లో ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం’ పేరుతో ఆరో పేపరు ప్రవేశపెట్టాం. అందులో ‘ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషనల్ ఫేజ్, టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ’ విభాగాలు ఉన్నా యి.
ఇందులో మూడో విభాగమైన ‘టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ’ విషయంలో అభ్యర్థులకు మరింత సమాచారం అందించాలని భావి స్తున్నాం. ఇందుకోసం గ్లిర్‌గానీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదికలు, 610 జీవో ముఖ్యాం శాలు వంటి ప్రధానమైన సంఘటనల సమాచారం సైతం అందించాలనేది ఒక ఆలోచన. అలాగే శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయం మినహా మిగతా విభాగాల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ పేపర్ మొదటి రెండు విభాగాల్లో పేర్కొన్న నిర్దేశిత సిలబస్‌కు సరితూగే ప్రామాణిక పుస్తకాలు ఎన్నో ఉన్నా యి. అభ్యర్థులు ప్రధాన, సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధమ వ్వాలి. కొన్నేళ్లలో జరిగిన ముఖ్యఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షలు కాబట్టి ప్రతీ పేపర్‌లోనూ తెలంగాణ దృక్పథాన్ని ప్రతిబిం బించే అంశాలను పొం దుపర్చడం జరిగింది.
ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్న సమస్యలు, పరిస్థితుల వంటివి సిలబస్‌లో పేర్కొన్నాం. గ్రూప్-1 రెండో పేపర్‌నే తీసుకుంటే మూడో విభాగంలోని ఫ్లోరోసిస్ సమస్య, ఈప్రాంతం నుంచి వలసలు, రైతులు, చేనేత సమస్యలు ఇందుకు ఉదాహరణలు. తెలంగాణలో విధులు నిర్వర్తించే అభ్యర్థులకు ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితులపై అవగాహన ఉంటేనే విధుల్లో సమర్థత ఉంటుంది. తద్వారా అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు గల కారణాలు కూడా తెలియాలి. ఈ ఉద్దేశాలతోనే సిలబస్‌లో ఈ ప్రాంత పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.’’