అన్యాయూలపై ఉద్యమించాలి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తూ తెలంగాణకు జరిగే అన్యాయాలపై ఉద్యమించాలని టిజేఏసీ చైర్మన్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం స్థానిక ఆవంతిహోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో టీవీ వీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. కా ర్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ 2004 సంవత్సరంలో అప్పటి పరిస్థితుల్లో చారి త్రక అవసరంగా టీవీవీ ఏర్పడిందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ తెలంగాణ విధ్వంసకర విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేసిందన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని ఒక భావజాలవ్యాప్తి సంస్థగా ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా టీవీవీ ఏర్పడిందన్నారు. ఒక మార్గదర్శిలా తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిందన్నారు. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఉద్యమంలో మమేకం చేసేందుకు టీవీవీ చేసి కృషి ఆమోఘమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ వేదిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
జిల్లాలో నెలకొన్న ససమ్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమేగాక, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సూచించారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషిం చిన వేదిక ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్తుందని, తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తిప్పర్తి యా దయ్య, నాయకులు లక్ష్మి, సతీష్‌రెడ్డి, టి.జి.శ్రీనివాసులు, రవీందర్‌గౌడ్, కృష్ణాబగాడే, డాక్టర్ సురేష్‌చంద్రహరి, విజయలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.