చేనేత ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో శైలజా రామయ్యర్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్క నేతన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడనే మాట విన్పించొద్దనేదే మా విధానం’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్న బాగుంటే, ఆత్మగౌరవంతో, సంతృప్తిగా ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని పేర్కొన్నారు. చేనేత కళాకారుల సంక్షేమానికి మరెన్నో కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు.
వీటిపై ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. జా తీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో చేనేత వస్త్రాల ప్రదర్శనశాలను కేటీఆర్ ప్రారంభించారు. చేనేత ఉ త్పత్తుల ప్రాధాన్యం గుర్తించడం, ప్రోత్సహించడం, మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర తదితర ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకు ని ఆన్‌లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మల్టీప్లెక్స్, మాల్స్‌లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని, టెస్కో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా చేనేత, జౌళి శాఖకు రూ.1,200 కోట్ల కేటాయించామని, అందులో రూ.400 కోట్లను చేనేత రంగానికే వెచ్చిస్తున్నట్లు వివరించారు. ప్రతి పైసా చేనేత కళాకారులకే అందేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు, వాటికి అనుబంధంగా 22,875 మంది కలిపి మొత్తం 40 వేల చేనేత కళాకారులు ఉన్నారని తెలిపారు.
పద్మశాలి ఇంట్లో కేసీఆర్ చదువు..
సీఎం కేసీఆర్ పుట్టిన చింతమడక గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో ఆయన ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్బాకకు రోజూ నడిచి వెళ్లేవారని కేటీఆర్ చెప్పారు. దీంతో కేసీఆర్‌ను దుబ్బాకలోని ఓ పద్మశాలి సోదరుడి ఇంట్లో ఉంచి చదివించారని గుర్తుచేశారు. కేసీఆర్ పద్మశాలీల కష్టసు ఖా లు దగ్గరగా ఉండి తెలుసుకున్నారని కేటీఆర్ పేర్కొ న్నారు. చేనేత కార్మికుడి ఇంట్లో పురుషుడు మగ్గం నేస్తే, మహిళలు బీడీలు చుట్టేవారని, దీని కారణంగా చేనేత, బీడీ కార్మికుల కష్టసుఖాల పట్ల కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు నేతన్న ల వేతనం పెంచాలనే ఉద్దేశంతో చేనేత మిత్ర పేరు తో పథకాన్ని ప్రవేశపెట్టి 50% సబ్సిడీపై నూలు, రసాయనాలు, అద్దకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పా రు. ఈ పథకంలో 18,683 మంది చేనేతకారు లు నమోదు చేసుకున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. చేనేతకారుల సామాజిక భద్రత కోసం నేతన్నలకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించామని, ఇందులో 19,125 మంది చేనేత కార్మికులు చేరారని, ప్రభు త్వం రూ.60 కోట్లు కేటాయించిందన్నారు. కళాకారు ల కుటుంబానికి ప్రతీ నెలా రూ.6 వేల నుంచి రూ.8 వేల ఆదాయం వచ్చేలా ఈ 2 పథకాలు అమలు చేసు ్తన్నామన్నారు. 12 వేల మంది నేతన్నలకు సంబంధిం చిన రూ.40 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రుణాలు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామన్నారు.
ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు
చేనేత వస్త్రాలకు మార్కెట్ భద్రత కల్పించేందుకు టెస్కో షోరూంల ద్వారా కొనుగోలు చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పోచంపల్లిలో మైక్రోసాఫ్ట్ సహకారంతో డిజైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించేందుకు సినీ, టీవీ కళాకారుల సేవలను వినియోగిస్తున్నామని, ఈ క్రమంలో నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామని పేర్కొన్నారు.
రూ.10.2 కోట్లతో 2,600 మంది కళాకారుల కోసం ఇప్పటికే రాష్ట్రంలో 8 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా 18 క్లస్టర్లు మంజూరు చేయాలని కేం ద్రాన్ని కోరామన్నారు. రూ.15 కోట్లతో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణ, రూ.14 కోట్లతో గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాçపూజీ పేరుతో 30 మంది కళాకారులకు చేనేత పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ శైలజా రామయ్యర్, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment