handloom workers
-
త్యాగమనే మాటే కేసీఆర్‌కు నప్పదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనలో అసలైన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా అవమానించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్యాగమనే పదం కొండా లక్ష్మణ్‌కే చెల్లుతుందని, కేసీఆర్ త్యాగాలు చేశానంటూ చెప్పుకోవడం ఏమా త్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌కు నీడనిచ్చిన వ్యక్తి కొండా లక్ష్మణ్. ఆయన సొంత ఇల్లు (జలదృశ్యం)ను కేసీఆర్‌కు ఇస్తే.. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరించారు. ఉద్యమం పేరుతో రాజకీయ రాజీనామాలు చేశారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అనే మార్గంలో భారీగా లబ్ధి పొందాడు. ఉద్యమం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌కు ఎలాంటి ఆస్తులు లేవు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం టీవీ చానళ్లు, పత్రికలు, బిల్డింగులు, ఫాంహౌజ్‌లు, ఇతర ఆస్తులు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనే చేనేత టెక్నాలజీ చదువు కోసం.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎనాడూ చేనేతల అభివృద్ధి కోసం ఆలోచించలేదు. రాష్ట్ర విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటగిరికో, ఒడిశా రాష్ట్రానికో పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ అంశం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు వినతిపత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేశారు. వెంటనే దీనిని అందుబాటులోకి వచ్చేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నా.. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తాం. చేనేతల సంక్షేమం కోసం.. చేనేత ఉత్పత్తులంటే గత ప్రభుత్వంలో సినీతారల తళుకుబెళుకులే ఉండేవి. ఒక్క చేనేత కార్మికుడికి కూడా ప్రయోజనం కలగలేదు. గతంలో బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు పనికలి్పస్తామంటూ ఆర్భాటం చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. మా ప్రభుత్వం తక్షణమే రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసింది. బతుకమ్మ చీరల కంటే మెరుగైన నాణ్యతతో కూడిన చీరెలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తాం. ఏడాదికి దాదాపు 1.30కోట్ల ఈ చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇస్తాం. చేనేత రుణాల భారం రూ.30కోట్లను తప్పకుండా మాఫీ చేస్తాం. ప్రజా ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య వచ్చినా పెద్దన్నలా ముందుండి పరిష్కరిస్తా..’’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాది మాటలతో మభ్య పెట్టే ప్రభుత్వం కాదు: మంత్రి తుమ్మల రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేది కాదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత కార్మీకుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు సమర్థవంతంగా అందేలా చూసేందుకు ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్న శైలజా రామయ్యర్‌కు ఆ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించామని తెలిపారు. చేనేత కార్మీకులు ఎలాంటి సమస్యలున్నా ఆమెకు నేరుగా వివరించాలన్నారు. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ పేరుతెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు ఐఐహెచ్‌టీకి పెడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.అనంతరం ఐఐహెచ్‌టీలో వివిధ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందించారు. -
నేతన్నలకు కేటీఆర్ హ్యాండ్లూమ్ డే విషెస్
సాక్షి,హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం(ఆగస్టు7) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని తెలిపారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్యరాష్ట్రంలో చేనేత రంగానికి ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లు కాగా బీఆర్ఎస్ పాలనలో చేనేత రంగానికి ఏడాదికి రూ.1200 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. -
సీఎం జగన్‌తో చేనేత కార్మికులు ఏమన్నారంటే?
సాక్షి, గుంటూరు జిల్లా: మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం.. చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము పొందిన లబ్ధిని వివరిస్తూ సీఎంతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి చంద్రబాబు అన్యాయం చేశారని, జగనన్న మళ్లీ మీరే రావాలి.. మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నామని.. మీరే మా నమ్మకమన్నారు. సీఎం జగన్ స్పందిస్తూ.. మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నా.. నాకు చేయూత వస్తోంది. నా సొంత మగ్గంతో నా సొంతింటిలోనే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను. నాకు మగ్గం డబ్బులు కూడా వచ్చాయి -చేనేత మహిళ సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. నాకు మగ్గం షెడ్డులో ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు -గుండు కమల, మంగళగిరి సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.. యావత్ చేనేత కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. రేపు జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి.. సహకార సంఘాలు, కార్మికులు, పవర్ లూమ్స్ విషయంలో గానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేతల పిల్లలు ఈరోజు టోఫెల్ అంటే.. 4 లక్షల మంది జగన్ లు తయారవుతారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ ప్రజానీకానికి తెలిస్తే 2030 వరకు ఉన్న విజన్ ను గుర్తించాలి. చేనేత బ్యాంక్ ను ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను -పి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు నేతన్న నేస్తం వస్తోంది.. నాకు రాజీవ్ గృహకల్పలో ఇళ్లు వచ్చింది నాన్నగారి టైమ్ లో. 2009 నుంచి అక్కడే ఉంటున్నాం ఆ చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకుని. నేతన్న నేస్తం వస్తోంది, పింఛన్ కూడా వస్తోంది బాగానే ఉంది మాకు.. కవుతరపు రాఘవమ్మ, చేనేత మహిళ. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా.. నమస్తే జగనన్న మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకు ఉదయాన్నే ఇంటివద్దనే పిలిచి పెన్షన్లు ఇవ్వడం చాలా బాగుంది. ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్లాలి? ఏంటి? అని గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత కూడా సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటీర్లు ఇంటికే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటివద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని తీర్చే ఈ వాలంటీర్ల వ్యవస్థ మాకు నచ్చింది. చాలామంది చదువుకోవడానికి అమ్మఒడి, విద్యాదీవెన ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీనాలీ చేసుకునే ప్రతిఒక్కరు కూడా తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షలు ఇవ్వడం వల్ల చాలామంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతోంది. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. ఆయన చెప్పిన నవరత్నాలన్నీ కూడా అమలు పరిచిన సీఎం కాబట్టి మళ్లీ జగనన్నే రావాలి, మనమందరం కూడా జగనన్నకే ఓటు వేయాలి. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు గానీ చేసింది లేదు. జగనన్న వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. మా పిల్లలకు అమ్మఒడి వస్తోంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు అన్నవాళ్లు ఎవరూ లేరు. రాలేదు అని చెబుతున్నారంటే వాళ్లు కావాలని చెబుతున్నట్టే. కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాలు వచ్చాయి. -విజయలక్ష్మి, మంగళగిరి.. అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం.. ప్రాణదాత, విద్యాదాత రాజశేఖర్ రెడ్డి గారైతే మరో విద్యాదాత మా జగనన్న. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రూ.81 కోట్ల గ్రాంట్ కూడా వస్తే ట్రెజరీలో ఉంటే ఆ డబ్బులను చేనేతలకు ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు. తమరు వచ్చిన తర్వాత దేశంలోనే చేనేతలకు ప్రప్రథమంగా రూ.24 వేలను నేతన్న నేస్తంగా ప్రకటించారు. రూ.3 వేల పెన్షన్ లెక్క ఇస్తూ సుమారు రూ.1000 కోట్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఆప్కోకు కూడా రూ.108 కోట్ల బకాయిలను చెల్లించి చేనేత కార్మికుల జీవితాలు బాగు చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం.. -శ్రీనివాసరావు, మంగళగిరి జగనన్న మళ్లీ మీరే రావాలి నాకు ఇద్దరు ఆడపిల్లలకు జగనన్న. పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన వస్తోంది. నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్లకు ఇంటి స్థలం వస్తోందని వాలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పి మరీ నాకు ఇంటి స్థలం ఇప్పించారు. కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి అన్యాయం చేశారు. చంద్రబాబు ఇలా చేయడం కరెక్ట్ కాదు. జగనన్న మళ్లీ మీరే రావాలి, మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరే మా నమ్మకం -హేమలత, మంగళగిరి సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం జగన్ మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆర్నెళ్లు చూస్తాడు, దాని తర్వాత అవసరమైతే మళ్లీ కొత్త స్థలాలు కొని ఇచ్చైనాసరే వీళ్లందరికీ కూడా అక్కడే ఇచ్చే కార్యక్రమం చేస్తాను కచ్చితంగా చేస్తామని చెబుతున్నాను. మనమందరం ఆలోచించుకోవాలి.. నేను యూట్యూబ్‌లో చూశాను. లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేం చెప్పినవాళ్లకే పథకాలు, ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పడం నేను విన్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే సీఎం కావాలా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా? అని మనమందరం ఆలోచించుకోవాలి. -మేరీ పాల్ పద్మావతి దేవి, హరిజన క్రైస్తవ, వెనుకబడిన తరగతుల సేవాసంఘం అధ్యక్షురాలు ఇదీ చదవండి: బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్ -
‘నేత’ రాత మారేదెలా?
సాక్షి, యాదాద్రి: ఆరేళ్లుగా చేనేత సహకార సంఘాల ఎన్నికల ఊసే లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఎన్నికలు జరగని కారణంగా టెస్కో ఉనికిలో లేకుండాపోయింది. 2018లో సహకార సంఘాల పదవీకాలం ముగిసింది. అయితే గత ప్రభుత్వం కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయకుండా పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించింది. రాష్ట్ర స్థాయి పాలకవర్గం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో చేనేత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారింది. గత ప్రభుత్వం టెస్కోకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్,పవర్లూమ్ కార్పొరేషన్లు కేవలం చైర్మన్ల నియామకం వరకే పరిమితమయ్యాయి. జియో ట్యాగింగ్, త్రిఫ్ట్ ఫండ్, చేనేత బీమా, నేతన్నకు చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం అమలు చేసినా అవి అందరికీ అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 375 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా 375 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 45మంది కార్మికులు ఉన్నారు. అయితే 2018లో ఓటర్ ఫొటో గుర్తింపు కార్యక్రమం చేపట్టగా, జియో ట్యాగింగ్ విధానం అమల్లోకి తెచ్చి, కేవలం 9వేలమందిని లెక్క చూపిస్తున్నారు. మిగతా కార్మీకులు జియో ట్యాగింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. సహకార సంఘాలకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా, పదవీకాలం 2018 ఫిబ్రవరి 9తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించి, ప్రతి ఆరునెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. టెస్కో పాలకవర్గం ఎప్పుడు? ఉమ్మడి ఏపీలో చేనేత వృత్తిదారుల కోసం ఆప్కో ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా మారింది. అయితే ప్రస్తుతం టెస్కోకు పాలకవర్గం లేదు. సహకార సంఘాల ఎన్నికలు జరిగితే ప్రతి జిల్లా నుంచి ఒక డైరెక్టర్‌ను ఎన్నుకొని వారిలో నుంచి రాష్ట్రస్థాయి చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు ప్రతి జిల్లా డైరెక్టర్ పాలకవర్గ సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం పాలకవర్గాలు లేవు. ఐఏఎస్ అధికారుల చేతిలో పాలన కొనసాగడంతో వృత్తిదారుల సమస్యలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎన్నికలు నిర్వహించాలని చేనేత వృత్తిదారులు కోరుతున్నారు. మూతపడిన సిరిపురం సొసైటీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట మండలం సిరిపురం చేనేత సహకార సంఘంలో 1000 మంది సభ్యులు ఉన్నారు. సుమారు 40 ఏళ్లుగా వృత్తిదారులకు పని కల్పిస్తోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనలో సొసైటీ రూ.40 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. జియో ట్యాగింగ్ పేరుతో 150 మందినే పనిదారులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి – అప్పం రామేశ్వరం, సిరిపురం సొసైటీ మాజీ చైర్మన్ చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కొండాలక్ష్మణ్ బాపూజీ సహకార స్ఫూర్తితో ఏర్పడిన సహకార సంఘాల వల్ల చేనేత కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. పాలకవర్గం లేకపోవడంతో చేనేత సమస్యలను మాట్లాడేవారు లేకుండా పోయారు. వస్త్రాల తయారీకి ఆర్డర్ ఇవ్వాలి ప్రభుత్వం వినియోగిస్తున్న వ్రస్తాల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల మాదిరిగా మాకూ ఇవ్వాలి. చేనేత సొసైటీలకు ఇస్తున్నట్టుగానే డీసీసీబీ రుణాలు ఇవ్వాలి. పవర్లూమ్లకు వ్రస్తాలను తయారు చేసే ఆర్డర్లు ఇవ్వాలి. వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలి. – గాడిపల్లి శ్రవణ్ కుమార్, మాజీ చైర్మన్, శ్రీతారకరామ పవర్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్, ప్రొడక్షన్, అండ్ సేల్స్ సొసైటీ, రఘునాథపురం -
నేతన్నకు నగదు పరపతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం నగదు పరపతి కూడా సమకూరుస్తోంది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలు, మార్కెటింగ్‌కు అనేక రూపాల్లో ఊతమిస్తోంది. చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వరుసగా ఐదు విడతల్లో నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించిన సంగతి తెలిసిందే. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఐదు విడతల్లో రూ.1.20 లక్షలు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు సాయం వంటి మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లను వెచ్చించింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇవి కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందిస్తోంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం ప్రాథమిక చేనేతకారుల సహకార సంఘా(పీహెచ్డబ్ల్యూపీఎస్)లకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో 681 చేనేత సొసైటీలకు రూ.209.29 కోట్లు నగదు పరపతి (రుణాలు) అందించింది. -
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
తుర్కయాంజాల్: రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్‌పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. నేత కార్మికులకు వరాలు... చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్లూమ్స్ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులవృత్తులకు జీవం... నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్‌తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్‌కు భూమిపూజ ఉప్పల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్‌కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి కారిడార్ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. -
కళల కలనేత.. చేనేత
సాక్షి, అమరావతి: చేనేత రంగం పూర్వవైభవం సంతరించుకుంటోంది. స్వదేశీ నినాదం ఊపందుకోవడంతో దేశవ్యాప్తంగా చేనేతకు క్రేజ్ పెరుగుతోంది. ప్రతి భారతీయుడు కొనుగోలు చేసే దుప్పట్లు, టవల్స్, కర్టెన్లు, గలీబులు, చీరలు, ప్యాంట్లు, షర్టులు వంటి వస్త్రాల్లో కనీసం 15 నుంచి 20 శాతం చేనేత కార్మికులు తయారు చేసినవి వాడగలిగితే.. ఆ రంగానికి ఊతమిచ్చినట్టేననే బలమైన నినాదం ప్రజల్లోకి వెళ్లింది. మన ప్రాచీన సాంస్కృతిక సంపద, వారసత్వం నిరంతరం జీవించగలిగేలా చేనేత రంగానికి ఊతమిచ్చే చర్యలు ఇటీవల దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నాయి. అన్నిటికన్నా మిన్నగా ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాకుండా చేనేత రంగానికి ఊతమిచ్చే అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా దేశవ్యాప్తంగా తెలుగు చేనేత కార్మికులు మార్కెట్లో పోటీ పడుతున్నారు. చేనేత పేరు పలకగానే.. పట్టుపావడా కుచ్చిళ్లు కాళ్లకు అడ్డం పడుతున్నా పరుగులు ఆపని పకపక నవ్వుల పాపాయి గుర్తు రాకుండా ఎలా ఉంటుంది. ఐలారం.. చీరాల పేరాల సుతిమెత్తని చీరల్లో అమ్మ మడతపెట్టి తెచ్చిన పుట్టింటి జ్ఞాపకాలు ఎలా మరిచిపోగలం. చేనేత మాటెత్తగానే.. వెంకటగిరి జరీ వెలుగులు.. మంగళగిరి ఫ్యాన్సీ జిలుగులు.. ఉప్పాడ.. ధర్మవరం పట్టుచీరలు, పావడాలు.. పొందూరు ఖద్దరు.. పెడన కలంకారీ అద్దకాలు.. గూడవల్లి చావిట్లో మగ్గం చప్పుళ్లు.. రాజోలు, అంబాజీపేట వాకిళ్లలో గంగాళాల్లో నానబోసిన రంగురంగుల దారాల కండెలు.. ఇంటిముందు రంగులద్దిన తడి నూలు ఆరబోతలు.. పడుగు–పేకల కలబోతతో నాజూకు కలనేత కళ్లముందు ఇట్టే కదలాడుతాయి. ఏపీలో అద్భుత నేత ► ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో చేనేత కేంద్రాలు అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ఒక్కో చోట ఒక్కోతరహా అద్భుతమైన నేతతో ఆకట్టుకుంటున్నాయి. ► పెడన, మచిలీపట్నంలలో సహజసిద్ధంగా తయారు చేసిన రంగులతో కాంతులీనే అద్దకం వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. స్థానికంగా ఉండే చెట్లు, పువ్వుల నుంచి రంగుల సారం, బంక మన్ను, నదులలోని ఇసుక నుంచి రసాయనాలు తయారు చేసి వాటిని వస్త్రాలకు బ్లాక్ ప్రింట్స్‌తో అద్దకం చేసే మన కళాకారులు అనేక అవార్డులను సైతం దక్కించుకున్నారు. ► వెంకటగిరి జరీ, మంగళగిరి ఫ్యాన్సీ, పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, పెడన కలంకారీ అద్దకాలు, పొందూరు ఖద్దరు వంటి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలోని చేనేత కళాకారుల సొంతం. ► శ్రీకాళహస్తిలో హ్యాండ్ ప్రింట్స్ (చేత్తో గీసే డిజైన్లు) ప్రత్యేకం. వారి కళా నైపుణ్యానికి జాతీయ అవార్డులు సైతం దక్కాయి. ► ఉప్పాడ జాందాని జరీ చీరలు, ధర్మవరం కాటన్, పట్టు చీరలకు ప్రత్యేకం. బ్లాక్–ప్రింట్స్(కలంకారీ) చేనేతలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఘనమైనది. ఒక్కో చోట.. ఒక్కో రకం భారతదేశంలో దాదాపు 150 చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్థారించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మైసూరు, ఒడిశా,బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, సూరత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లోని అనేక చేనేత కేంద్రాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన నేత ప్రత్యేకం. ఇక్కత్, జాందాని, పట్టు, జరీ చీరలు టై–డై కలంకారీ, పుల్కారి, ఢకై, బాలుచరి సిల్క్, మూగా సిల్క్, పటోల డిజైన్, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్ సిల్క్, టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎరిముడి సిల్క్, కాశ్మీర్ పష్మినా, శాహ్తూష్ పల్చని ఉన్ని వంటి ఉత్పత్తులకు నిరంతరం డిమాండ్ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల గిరిజన జాతులు రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బిహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లతోపాటు ఆయా రాష్ట్రాల సంప్రదాయ దుస్తులకు చేనేత ఊతమిస్తోంది. నిత్య నూతన డిజైన్లతో.. నిత్య నూతనమైన డిజైన్లతో చేనేత సంప్రదాయం కొత్త పుంతలు తొక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను బట్టి.. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా చేనేత కళాకారులు నైపుణ్యాలను పెంచుకుంటూ పోటీ మార్కెట్లో నిలదొక్కుకుంటున్నారు. భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్రే ఉంది. పురాతన కాలం నుంచీ భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవి. సుమారు 2 వేళ్ల ఏళ్ల క్రితం ‘హంస’ డిజైన్లతో కూడిన భారతీయ వస్త్రాలు ఈజిప్టులోని కైరో నగరంలో లభ్యమయ్యాయి. అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనత కూడా భారతీయులదే. 1905 ఆగస్టు 7న కోల్‌కతాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభం కాగా.. విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన స్వాతంత్య్ర ఉద్యమకారులు చేనేత తదితర స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు. దేశంలో కుటీర పరిశ్రమగా భాసిల్లుతున్న చేనేత రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 70 లక్షల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న చేనేత ఉత్పత్తుల్లో 90 శాతం మన దేశానికి చెందినవే కావడం విశేషం. -
చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. దేశంలో ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7న) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7 నుంచి ‘నేతన్న బీమా’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నేతన్నల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో తొలిసారని సీఎం తెలిపారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందడం సంతోషకరమని చెప్పారు. దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే అర్హులైన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం.. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడిన పద్మశాలీ తదితర కుటుంబాలకు అన్ని వేళలా బాసటగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. చదవండి: ‘చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలి’ -
ఎర్ర 'తివాచీ' పరిచేవారేరి?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సహజసిద్ధ రంగులతో.. అబ్బురపరిచే చిత్రాలతో రాజుల కాలం నుంచి ఆకట్టుకుంటూ వస్తున్న ‘తంగెళ్లమూడి తివాచీ’ రంగు క్రమంగా వెలిసిపోతోంది. కోటకు కొత్త అందం తేవాలన్నా.. ఇంటికి కళ రావాలన్నా ఏలూరు తివాచీ పరచాల్సిందే అనే స్థాయిలో వెలుగొందిన పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. దేశవిదేశీయుల మనసు చూరగొన్న పరిశ్రమ.. ఇప్పుడు తనకు ‘ఎర్ర తివాచీ’ పరిచేవారి కోసం ఎదురుచూస్తోంది. పర్షియా నుంచి వలస.. సహజసిద్ధ రంగులతో తయారయ్యే సంప్రదాయ తివాచీలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి ప్రసిద్ధి. గొర్రెల నుంచి సేకరించిన ఊలు, సహజసిద్ధ రంగులు, జూట్, పత్తితో 300 ఏళ్లకు పై నుంచి ఇక్కడ తివాచీలు తయారు చేస్తున్నారు. 18వ శతాబ్ధంలో పర్షియా నుంచి మచిలీపట్నం ఓడరేవుకు తివాచీలు తయారు చేసే ముస్లింలు కొందరు వలస వచ్చారు. వారు కాలక్రమేణ తంగెళ్లమూడిలో స్థిరపడ్డారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా తంగేడు వనంలా ఉండేది. తంగేడు పూల నుంచి తీసిన రంగులను తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పత్తి, జూట్ కూడా అందుబాటులో ఉండటంతో వారు ఇక్కడే స్థిరపడిపోయారు. 50 ఏళ్లకు పైగా మన్నిక.. ఎన్ని అడుగుల తివాచీకి ఆర్డర్ ఇచ్చినా.. ఇక్కడ అద్భుతంగా తయారు చేసి ఇస్తారు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏలూరులో మాత్రమే చేనేత మగ్గాలపై తివాచీలు తయారు చేస్తారు. ఇవి 50 ఏళ్లకుపైగా మన్నిక ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటికి మంచి డిమాండ్ ఉండేది. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేసేవారు. యంత్రాలు రావడంతో 2002 నుంచి ఇక్కడి పరిశ్రమకు గడ్డుకాలం మొదలైంది. తక్కువ ధరకు ప్లాస్టిక్ కార్పెట్లు వస్తుండటంతో అందరూ వాటివైపు మళ్లారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఏలూరు తివాచీల గురించి తెలుసుకున్నవారు ఆర్డర్లు ఇస్తుండటంతో కొంతకాలం కిందట మంచి డిమాండ్ వచ్చిందని తయారీదారులు చెప్పారు. అంతలోనే కరోనా విజృంభించడంతో పరిశ్రమ కుదేలైందని వాపోయారు. తివాచీ నేత పనిలో నిమగ్నమైన కార్మికులు కరోనాతో దెబ్బ గతంలో 100 మందికి పైగా చేనేత కార్మికులు, 50 మంది ఎక్స్‌పోర్టర్లు, 20 మంది మాస్టర్ వీవర్లతో ఈ పరిశ్రమ కళకళలాడేది. ప్రభుత్వ సహాయ సహకారాలు అందడానికి వీలుగా ఏలూరు కార్పెట్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖ నేతృత్వంలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించడంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కొని వెళ్లిపోయారు. నైపుణ్యమున్న చేనేత కార్మికులు తగ్గిపోయారు. 10 మంది కార్మికులతోనే తక్కువ ఆర్డర్లతో నెట్టుకువస్తున్నారు. 6 గంటల పనికి రూ.300 ఇస్తున్నా కార్మికులు దొరకట్లేదని తయారీదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ హితం.. ఈ తివాచీలు పర్యావరణ హితమైనవని తయారీదారులు చెబుతున్నారు. ఊలు, కాటన్, జూట్‌తో పాటు సహజసిద్ధ రంగులు ఉపయోగిస్తామని తెలిపారు. 50 ఏళ్లకు పైగా మన్నిక ఉండే వీటిని మూడు నెలలకొకసారి శుభ్రం చేస్తే కొత్తగా కనిపిస్తాయని వివరిస్తున్నారు. సాధారణ కార్పెట్ కంటే వీటి ధర కాస్త అధికం. ఇందులోనే 50 శాతం కూలి ఖర్చులు, 30 నుంచి 40 శాతం మెటీరియల్ ఖర్చు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ తివాచీల్లో హానికర రసాయనాలు వినియోగిస్తారని.. ఇవి భూమిలో, సముద్రంలో కలవకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి మన్నిక రెండేళ్లే ఉంటుంది. కానీ ధర తక్కువ కావడంతో అందరూ ప్లాస్టిక్ వైపు వెళుతున్నారని చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే పని సిద్ధమైన తివాచీని ఫినిషింగ్ చేస్తుంటాను. ఫినిషింగ్ ఎంత బాగా చేస్తే అంత మన్నిక ఉంటుంది. 40 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. గతంలో చాలా సందడిగా ఉన్న మా పరిశ్రమ నేడు వెలవెలబోతుంటే చూడటం కష్టంగా ఉంది. – సత్యనారాయణ, ఫినిషింగ్ కార్మికుడు మాది ఐదోతరం కార్పెట్ తయారీ పరిశ్రమలో నేను ఐదో తరానికి చెందినవాడిని. పనినైపుణ్యంతో అనేక అవార్డులు తీసుకున్నా. ఇప్పుడు ఆ వెలుగులు పోయాయి. ప్లాస్టిక్ కార్పెట్ వచ్చాక మా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో మార్కెట్ కొంత మేర బాగానే ఉన్నప్పటికీ.. కార్మికులు దొరకట్లేదు. నైపుణ్య కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆన్లైన్ మార్కెటింగ్ విక్రయాలకు అవకాశం కల్పిస్తే ఈ రంగం కోలుకుంటుంది. – అబ్దుల్ నయీం, తయారీదారు -
ఇదిగో ‘నేస్తం’.. నేనున్నా
సాక్షి, అమరావతి: చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం, ఆప్కో ద్వారా రూ.1,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కులు, చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాలు, పిల్లల యూనిఫామ్స్ కోసం కానివ్వండి.. ఇలా దాదాపుగా రూ.1,600 కోట్లను నేతన్నలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. 1,06,400 మంది నేతన్నలకు పెన్షన్లు పెంచి ఇస్తున్న సొమ్ము కాకుండా, నేతన్నలకు ఇచ్చిన ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు, చేయూత, ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన.. వసతి దీవెన ఇవన్నీ లెక్కలో వేసుకోకుండా.. కేవలం నేతన్న నేస్తం, ఆప్కోల ద్వారా వారికి జరుగుతున్న మేలు దాదాపుగా రూ.1,600 కోట్లు ఉంటుందని వెల్లడించారు. గత సర్కారు ఐదేళ్లలో చేనేతల కోసం కేవలం రూ.259 కోట్లు మాత్రమే వ్యయం చేసిందన్నారు. కరోనా విపత్తు వేళప్రభుత్వానికున్న ఇబ్బందులు కన్నా చేనేతల కష్టమే ఎక్కువని భావించానని, మూడేళ్ల పాలన పూర్తి కాకముందే వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో విడత నేతన్న నేస్తంతో కలిపి చేనేతలకు ఇప్పటివరకు రూ.600 కోట్లు సాయం అందించామని, ఐదేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారానే రూ.1,000 కోట్లు అందచేయనున్నట్లు వివరించారు. చేనేతలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూశానని, అధికారంలోకి రాగానే వారి బాగోగుల కోసం ఆలోచిస్తూ ప్రతి అడుగులోనూ మంచి చేయడానికి ఆరాటపడుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఇలాంటి కార్యక్రమాన్ని దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదని, మీ బిడ్డ ప్రభుత్వమే అమలు చేస్తోందని గర్వంగా చెబుతున్నానన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నెల రోజుల్లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేసి నేతన్న నేస్తం అందిస్తామని ప్రకటించారు. ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ వరుసగా మూడో ఏడాది సాయం కింద 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని చేనేత కార్మికులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలు ఇవీ.. నేనెప్పటికీ మరిచిపోలేను.. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దాదాపు 80 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.192 కోట్లకుపైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. చేనేతల అవస్ధలు నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశా. ప్రతి జిల్లాలోనూ తమ సమస్యలు నాకు చెప్పుకున్నారు. వారి గోడును నేనెప్పటికీ మరిచిపోలేను. నా పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల్లో ఏదైతే చెప్పామో... అవన్నీ కూడా ఎన్నికలు పూర్తి కాగానే అమలు చేయడం ప్రారంభించాం. మూడేళ్ల పాలన పూర్తి కాకముందే... అందులో ఒక మంచి కార్యక్రమం.. నేతన్న నేస్తం. ఈ రోజు వరుసగా మూడో సంవత్సరం పథకాన్ని అమలు చేస్తున్నాం. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన, ఆ మగ్గం మీద బతుకుతున్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాం. మూడేళ్ల పాలన పూర్తి కాకముందే.. 2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నాం. ఈ సొమ్ము మన నేతన్నలు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నా. మీ ఇబ్బందులే ఎక్కువని... కరోనా సమయంలో ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. ప్రభుత్వానికి ఉన్న సమస్యల కన్నా చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులే ఎక్కువని భావించాం. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో వరుసగా మూడో ఏడాది 80 వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1,000 కోట్లు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నాం. నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. వివక్షకు తావులేకుండా ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదు. మన రాష్ట్రంలో మీ బిడ్డగా దీన్ని అమలు చేస్తున్నా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా రూ.24 వేలు చొప్పున మూడు దఫాలుగా నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు ఈ ఒక్క పథకం ద్వారానే ఇచ్చాం. సొంత మగ్గం ఉండి, ఆ మగ్గమే ఆధారంగా బతుకున్న వారికి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఈ ఒక్క స్కీం ద్వారానే అవినీతి, వివక్షకు తావులేకుండా, బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోకుండా.. అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపిస్తున్నాం. నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది. మేలు చేసే ప్రభుత్వమిది.. ఇంత పారదర్శకంగా చేసినప్పటికీ కూడా పొరపాటున ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సొంత మగ్గం ఉన్నవారు, దానిమీదే బతుకున్నవాళుŠల్ వలంటీర్లు ద్వారా కానీ, గ్రామ సచివాలయానికి నేరుగా వెళ్లి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. నెలరోజుల పాటు గడువు ఇస్తాం. పరిశీలన చేసి అర్హత ఉంటే వారికి కూడా వచ్చేటట్లుగా చేస్తాం. మీ బిడ్డ ప్రభుత్వం ఇది.. ఎవరికైనా సరే ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. అనర్హులకు రాకూడదు, అర్హత ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అని ఆరాటపడే ప్రభుత్వం ఇది. నిర్దిష్ట గడువులోగా తనిఖీలు పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం.. ఈ సందర్భంగా మరో రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇవాళ్టితో కలిపి దాదాపుగా రూ.600 కోట్లను నేతన్నలకు నేరుగా సహాయం అందించాం. అంతేకాకుండా చేనేత సహకార సంఘాలు, ఆప్కోకు గత సర్కారు బకాయిపడ్డ రూ.103 కోట్లను కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే చెల్లించాం. నాడు ఐదేళ్లలో కేవలం రూ.259 కోట్లే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేనేత రంగం మీద, నేతన్నల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.259 కోట్లు మాత్రమే. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తోందంటే.. ఇది మీ బిడ్డ ప్రభుత్వం, మీ బాగోగుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఇది అని చెప్పడానికి దీన్ని గుర్తు చేస్తున్నా. ఆప్కో ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ చేనేత రంగంలో నేతన్నల ఇబ్బందులను దూరం చేసేందుకు ఆప్కో ద్వారా ఇ– మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చాం. దీని ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ప్లిఫ్‌కార్ట్, అమెజాన్‌లో ఆప్కో ఉత్పత్తులు కనిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలా ప్రతి అడుగులోనూ మంచి చేయడానికి ఆరాటపడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా మంచిచేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నా. –ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య, చేనేత శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, వాణిజ్య (హేండ్లూమ్, టెక్స్టైల్స్) శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, హేండ్లూమ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ పి.అర్జునరావు, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ జే.విజయలక్ష్మి, తోగాటివీర కార్పొరేషన్ ఛైర్మన్ గెడ్డం సునీత, కుర్నిశాలి కార్పొరేషన్ ఛైర్మన్ బుట్టా శారదమ్మ, లేపాక్షి ఛైర్మన్ బి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తోబుట్టువులా తోడున్నారు.. పాదయాత్రలో మా కష్టాలను చూసి నేతన్న నేస్తం పథకంతో ఆదుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా సాయం చేసి మా జీవితాలను నిలబెట్టారు. మేం నేసిన చీరలు అమ్ముకోవడానికి దుకాణాలు కూడా లేని సమయంలో ఈ సాయం మాకు ఎంతో ఆసరాగా నిలిచింది. ప్రతి ఏడాది మీ తోబుట్టువులకు డబ్బులు జమ చేస్తున్నారు. సొంత అన్నదమ్ములు కూడా ఇంతలా ఆదరించరు. విద్యా దీవెనతో మా పిల్లలు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. చేయూత పథకం ద్వారా వస్తున్న మొత్తాలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి మహిళా నెలకు ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోందంటే మీ చలవేనన్నా. – జి.జానకి, మంగళగిరి, గుంటూరు జిల్లా -
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు
-
చేనేతల ఇబ్బందులు ముఖ్యమని భావించాం: సీఎం జగన్
-
ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 'వైఎస్సార్ నేతన్న నేస్తం' అమలు చేసింది. ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని, 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. ‘‘వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నాం. మూడో విడత కింద రూ.192.08 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆప్కో ద్వారా ఈ-మార్కెటింగ్ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చిన రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది. -
నేడు నేతన్న నేస్తం మూడో విడత ఆర్థిక సాయం
-
నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వ చేయూత
-
‘చేయూత’ లాక్ తీశాం..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు నగదు లభ్యత పెంచడం ద్వారా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 26,500 మంది చేనేత కార్మికులకు రూ.93 కోట్ల మేర నగదు తక్షణమే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ కార్యాలయంలో శనివారం చేనేత విభాగంపై కేటీఆర్ సమీక్షించారు. ‘చేయూత’పథకం లాక్ఇన్ పీరియడ్ నిబంధనలు సడలించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేయూత పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం జమ చేస్తే, ప్రభుత్వ వాటాగా 16 శాతం చెల్లిస్తుంది. పవర్లూమ్ కార్మికులు మాత్రం 8 శాతం వాటా జమ చేస్తే ప్రభుత్వం కూడా 8 శాతం జమ చేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని చేనేత కార్మికులు తమ వంతు వాటాగా రూ.31 కోట్లు జమ చేయగా, ప్రభుత్వం రూ.62 కోట్లు జమ చేసింది. అయితే ఈ పథకంలో చేరిన మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత సభ్యులు తమ అవసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ లాక్ఇన్ పీరియడ్‌ను సడలించాలని నిర్ణయించాం. దీంతో ఈ పథకంలో భాగస్వాములైన నేత కార్మికులకు నిర్దేశించిన గడువు కంటే ముందే ఎప్పుడైనా రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల మేర నగదు అందుబాటులోకి వస్తుంది’అని కేటీఆర్ వివరించారు. సొసైటీల పరిధిలోని పొదుపు పథకంలో గతంలో సభ్యులుగా ఉన్న 2,337 మంది కార్మికులకు రూ.1.18 కోట్లు చెల్లిస్తామని కేటీఆర్ ప్రకటించారు. -
గడువుకన్నా ముందే నేతన్నకు చేయూత డబ్బులు
-
మూగబోయిన మగ్గంపై కన్నీళ్ల నేత
సాంచాల చప్పుళ్లతో కళకళలాడే నేతన్నల ఇళ్లలో మూగ రోదనలు వినిపిస్తున్నాయి. రంగు రంగుల పట్టుచీరలు నేసే ఆ మగ్గాలు.. పూట గడవక కన్నీళ్లను నేస్తున్నాయి. ధగధగ మెరిసే పట్టు చీరలను చూసి మురిసిపోయే ఆ కళ్లు.. వంటగదిలో నిండుకున్న కుండలను చూసి కన్నీళ్లు పెడుతున్నాయి. రాట్నాలు ఒడికే చేతులు.. అన్నార్థుల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేతన్నల దుస్థితి. యాదాద్రి, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో లాక్‌డౌన్‌తో పనుల్లేక ఇక్కట్లు పడుతున్న వేలాది మంది నేతన్నల బతుకు చిత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి యాదాద్రి/గద్వాల/సిరిసిల్ల/సిద్దిపేట: కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మగ్గం చప్పుళ్లు ఆగిపోయాయి. పూటగడవని నేతన్న అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకపూట తిండికోసం, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం చేనేత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా నేతన్నల జీవితాలు తారుమారయ్యాయి. చేనేతకు అవసరమైన ముడి పట్టు, కాటన్, నూలు రవాణా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా చేనేత వృత్తిపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ చేతిలో పనిలేక, డబ్బుల్లేక పోవడంతో నిత్యావసరాలు కొనుక్కోలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. మందులకు డబ్బులు లేవు.. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికురాలు వడ్డెపల్లి గీతావాణి. లాక్‌డౌన్‌తో పని లేక నానా అవస్థలు పడుతోంది. ఈమె భర్త గోపాల్ 7 సంవత్సరాల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. ఏకైక కుమారుడు శ్రీధర్ (10) మానసిక వికలాంగుడు. శ్రీధర్ వైద్యఖర్చులు, మందులకే నెలకు నాలుగైదు వేలు ఖర్చవుతోంది. గీతావాణి మస్రస్ చీరలను మగ్గంపై నేస్తుంది. నెలకు 5 నుంచి 6 చీరలు నేయడం ద్వారా సరాసరి నాలుగున్నర వేలు సంపాదిస్తుంది. నెలరోజులుగా మగ్గం నడవట్లేదు. చేనేత అనుబంధ పనులు ఏమైనా చేద్దామంటే అవి కూడా మూతపడ్డాయి. మందులు కొనడానికి డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌బియ్యం, రూ.1,500 నిత్యావసర సరుకులు కొనడానికే సరిపోతున్నాయని చెబుతోంది. చేతిలో డబ్బుల్లేక ఇక్కట్లు పోచంపల్లికి చెందిన ఈమె పేరు కాముని పద్మ. భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి బాధ్యతను భుజాలకు ఎత్తుకుని 22 ఏళ్లుగా మగ్గం నేస్తోంది. అద్దె ఇంట్లో ఉంటోంది. కూలీ మగ్గం నేసి ముగ్గురు కుమార్తెల వివాహం చేసింది. ఇంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత రోజూ 8 గంటలు కూలీకి మగ్గం నేస్తుంది. నెలంతా పనిచేస్తే రూ.5 వేలు సంపాదిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహిళా సంఘం ద్వారా బ్యాంకులో తీసుకున్న లోన్, పొదుపు డబ్బులు కట్టలేకపోతోంది. పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో రూ.70కోట్లకు పైగా పట్టు చీరల నిల్వలు, రామన్నపేట, మిగతా ప్రాంతాల్లో రూ.60కోట్ల కాటన్ వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ షాపింగ్ కాంప్లెక్స్‌లో 100కు పైగా దుకాణాలు ఉన్నాయి. మాస్టర్ వీవర్స్ వద్ద రూ.10 కోట్లు, చేనేత సహకార సంఘంలో రూ.1.5 కోట్లు, వస్త్ర దుకాణాల్లో మరో రూ.50 కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. స్టాక్ అమ్మాకే కార్మికులకు ఉపాధి ఇవ్వగలుగుతామని మాస్టర్ వీవర్స్ అంటున్నారు. ‘ఇక్కత్’కు కష్టాలు పోచంపల్లి మగ్గాల కేంద్రానికి తాళం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టు చీరలు, కాటన్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోవడంతో రూ.130 కోట్ల విలువ చేసే చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. సహకార, సహకారేతర రంగంలో భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, భువనగిరి, రాజపేట, ఆలేరు, గుండాల, ఆత్మకూర్ (ఎం) యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో చేనేత రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో 1,300 పైచిలుకు మగ్గాలు ఉండగా, 3 వేలకు పైగా చేనేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,500 మంది జియో ట్యాగింగ్‌లో నమోదు కాగా, మరో 15 వేల మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నిలిచిన ముడి సరుకు రవాణా ప్రభుత్వం లాక్డౌన్ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇస్తూ చేనేత కార్మికులు పని చేసుకోవచ్చని తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని కల్పించే సానుకూల పరిస్థితులు లేవు. చైనా దేశం నుంచి దిగుమతి అయ్యే పట్టు ముడిసరుకు, రంగులు, రసాయనాలు 3 నెలల కిందటే నిలిచిపోయాయి. బెంగళూరులో ఉత్పత్తి అయ్యే పట్టు దేశంలోని కార్మికుల అవసరాలకు సరిపోవట్లేదు. చీరల జరీ సూరత్ నుంచి వస్తుంది. కాటన్ వస్త్రాలS తయారీకి అవసరమైన కాటన్ నూలు తమిళనాడులోని ఈరోడ్, సేలం, ఆదిలాబాద్ నుంచి జిల్లాకు వస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ముడిసరుకు దిగుమతి ఆగిపోయింది. చాలా చోట్ల ముడి నూలు లేక వస్త్రాల తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నేతన్నల దుస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 10,550 మంది చేనేత కార్మికులు వివిధ రకాల డిజైన్లతో జరీ చీరలు, దుప్పట్లు, తువాళ్లను తయారు చేస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబం నెలకు సగటున నాలుగు జరీ చీరలు నేస్తారు. లాక్డౌన్ రోజుల్లో సుమారు 10 వేల వరకు జరీ చీరలు తయారయ్యాయి. కార్మికులు నేసిన ఈ చీరలను మాస్టర్ వీవర్స్ లాక్డౌన్ కారణంగా కొనుగోలు చేయట్లేదు. దీంతో కార్మికులు తయారు చేసిన చీరలను ఇళ్లలోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పని నిలిచిపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో కొంతమంది నేత కార్మికులు ఉన్నారు. ప్రధానంగా గద్వాల, రాజోలి, అమరచింత, నారాయణపేట, కొత్తకోట, అయిజ, ధన్వాడ, గట్టు, మాచర్ల, గోర్లఖాన్దొడ్డి తదితర ప్రాంతాల్లో నేత కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నూలు ధరలపై నియంత్రణేది చైనా నుంచి నూలు ముడి సరుకు నిలిచిపోయింది. దీంతో సిల్క్ ఉత్పత్తి తగ్గి బెంగళూరు కేంద్రంగా సరఫరా అయ్యే నూలుకు డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 3 నెలల కింద కిలో పట్టు వార్పు రూ.3,200ల నుంచి రూ.4,500లకు, వెప్ట్ కిలో రూ.3,500ల నుంచి రూ.4,800లకు పెరిగింది. మొత్తానికి వార్పు (7చీరలు)పైన రూ.15 వేల వరకు ధర పెరిగిందని వాపోతున్నారు. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో జరిపిన విక్రయాలకు డబ్బులు రాకపోవడంతో మాస్టర్ వీవర్స్ తమ వద్ద పనిచేసే కార్మికులకు పని నిలిపేశారు. దీంతో పనులు లేక కార్మికులు అర్ధాకలితో గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, రూ.1,500 మాత్రమే వారికి జీవనాధారం అయ్యాయి. మూగబోయిన సిరిసిల్ల.. సిరిసిల్లలో కరోనా ప్రభావంతో కార్ఖానాలు బంద్ అయ్యాయి. బట్ట ఉత్పత్తి చేస్తేనే నేత కార్మికుల పొట్ట గడుస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోనూ ఆధునిక మరమగ్గాలు బంద్ అయ్యాయి. దీంతో మొత్తంగా సిరిసిల్లలో 25 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా సిరిసిల్లలో వేలాది మంది కార్మికుల ఉపాధికి విఘాతం ఏర్పడింది. కాగా, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. 6.2 కోట్ల మీటర్లు బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చారు. చీరల డిజైన్‌ను మార్చడంతో బతుకమ్మ చీరలకు అవసరమైన నూలును దిగుమతి చేసుకుంటున్న దశలో కరోనా లాక్డౌన్ అయింది. దీంతో సిరిసిల్లకు పూర్తి స్థాయిలో నూలు ఇంకా రాలేదు. వచ్చిన నూలుతో వస్త్రోత్పత్తికి లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. దీంతో సిరిసిల్లలో అటు పాలిస్టర్ బట్ట, ఇటు బతుకమ్మ చీరల బట్ట ఏదీ ఉత్పత్తి కావట్లేదు. దీంతో నేత కార్మికుల బతుకు దయనీయంగా మారింది. నిత్యం పని చేసే కార్మికులకు నెల రోజులుగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక.. దిక్కుతోచక..! ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న శంకర్, పద్మ దంపతులిద్దరూ చేనేత కార్మికులు. వీరికి ఆరేళ్లపాప ఉంది. చేనేత వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కష్టపడి మగ్గం ద్వారా జరీ చీరలను తయారు చేస్తారు. నెలకు 3 చీరలు నేయడమే గగనం. వీటి ద్వారా సంపాదన నెలకు రూ.10 వేలకు మించదు. లాక్డౌన్ విధించడం, రాజోలి రెడ్‌జోన్‌లోకి వెళ్లడంతో మగ్గాలు నిలిచిపోయాయి. దీంతో వారు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఘొల్లుమంటున్న ‘గొల్లభామ’ గత 40 రోజులుగా సిద్దిపేట జిల్లాలో నేతన్నల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచే చేనేత కార్మికులు పని ప్రారంభించారు. జిల్లాలో 13 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 5,450 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా గొల్లభామచీరలు, లివర్ టవల్స్, జర్నరీ టవల్స్ అధికంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన వస్త్రాలను టెస్కో ఖరీదు చేస్తుంది. గత 4 నెలల నుంచి వస్త్రాలను ఖరీదు చేయడంలో టెస్కో ఆలస్యం చేయడంతో కార్మికులకు కూలీ చెల్లించలేకపోతున్నారు. సహకార సంఘాల వద్ద వస్త్రాలు పేరుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా 2.5 కోట్ల విలువైన వస్త్రాలు సహకార సంఘాల వద్ద ఉన్నాయి. వీటిని విక్రయిస్తేనే కార్మికులకు వేతనాలు అందుతాయి. ప్రభుత్వం ఈ వస్త్రాలను త్వరగా ఖరీదు చేసి అదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. పొట్ట నిండటమే కష్టమవుతోంది.. ఇతడి పేరు చాప శ్రీనివాస్ (38). నిత్యం సాంచాలు నడుపుతూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే వాడు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీనివాస్‌కు ఉపాధి కరువైంది. అద్దె ఇంట్లో ఉండే శ్రీనివాస్‌కు ఇద్దరు ల్లలు. భార్య బీడీ కార్మికురాలు. పొట్ట నింపుకోవడం కష్టమైతుందని వాపోతున్నాడు. చాప శ్రీనివాస్, పవర్లూమ్ కార్మికుడు, సిరిసిల్ల -
జాంధానీ జరీ..మెరిసింది మళ్లీ
ఉప్పాడ చేనేత కళాకారుల అద్భుతసృష్టి జాంధానీ.. ఏళ్లు గడిచినా తరగని విలువ దీని ప్రత్యేకత. ఎటు నుంచి చూసినా కళాత్మకత ఉట్టిపడే ఈ చీరలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. జాంధానీ డిజైన్లతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయనుండడంతో ఈ చీర సోయగాల గొప్పతనం మరోసారి మార్మోగుతుంది. ఇప్పటికే పేటెంట్ హక్కుతో పాటు ఇండియన్ హ్యాండ్లూమ్స్లో ఉప్పాడ జాంధానీకి స్థానం లభించగా.. తాజాగా దక్కిన గౌరవంతో తమ బతుకుల్లో వెలుగులు వస్తాయని చేనేత కళాకారులు ఆశిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించే నాణ్యమైన వెండి జరీ, అత్యంత నేర్పుతో ఒక్కొక్క పోగు చేతితో పేర్చే నేతన్న పనితనంతో ప్రపంచపటంలో జాంధానీకి అరుదైన స్థానం లభించింది. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో తరతరాలుగా ఈ జాంధానీ చీరల తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఇవి అంత అందంగా కనిపించడానికి పూర్తిగా చేతితో నేయడమే కారణమని చెబుతారు. పాడై చిరిగిపోయినా.. కొన్న డబ్బులో సుమారు 30 శాతం వరకు తిరిగి వచ్చేస్తుంది. వెండి జరీలో సన్నని పట్టు, ఎర్రటి దారం ఉంటుంది. ఇది తొందరగా కాలదు, బూడిద కాదు. గీటురాయితో వెండి జరీ నాణ్యతను çపరీక్షించుకోవచ్చు. జరీని ఎన్ని పోగులు ఉపయోగిస్తే చీరకు అంత విలువ పెరుగుతుంది. నేతలో ఎక్కడా వదులు లేకుండా కార్మికులు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా లోపాన్ని పట్టుకోలేం.ఒక చీరపై ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పనిచేస్తారు. డిజైన్‌ను బట్టి పూర్తికావడానికి 20 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. గతంలో రోజుకు ఒకట్రెండు చీరల కంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి 100 చీరలు తయారుచేస్తున్నారు. ముందు పేపరుపై డిజైన్ గీసుకుని నేత ప్రారంభిస్తారు. జరీని బట్టి చీర ధర నిర్ణయం చీరలో వాడే జరీని బట్టి విలువ నిర్ధారిస్తారు. చీరలో 240 గ్రాములు జరీ వాడితే దాని విలువ రూ 5 వేల వరకూ ఉంటుంది. డిజైన్ల కనుగుణంగా 500 గ్రాముల వరకూ జరీ వినియోగిస్తారు. చిలుక, హంస, నెమలి వంటి అనేక రకాల డిజైన్లు నేతన్నల కళాత్మకతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కొత్తపల్లి మండలంలోనే కొత్తపల్లి, కుతుకుడుమల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట తదితర గ్రామాల్లో గతంలో 50 వరకు ఉండే మగ్గాలు నేడు 500కు చేరాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి తదితర గ్రామాల్లోను వీటి తయారీ ఉంది. అన్ని కులాల వారు చీరలు నేయడం విశేషం. పోస్టల్ కవర్లపై ముద్రించేందుకు డిజైన్ల ఎంపిక రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే చీరల్ని ఇక్కడి నేతన్నలు తయారుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాషింగ్ సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇటీవల కాలంలో వ్యాపారం ఊపందుకుంది. జాంధాని పేటెంట్ హక్కు సాధించుకున్నాక అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు కూడా పొందింది. ఇప్పుడు వీటిపై పోస్టల్ కవర్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉప్పాడ చేనేత కళాకారులకు వర్తమానం పంపింది. కవర్లపై ప్రింట్ చేసేందుకు చీరల డిజైన్లను పంపమని సూచించడంతో.. ఎంపిక చేసిన కొన్ని డిజైన్లకు ఢిల్లీకి పంపారు. నేతన్న శ్రమకు దక్కని విలువ మార్కెట్లో ఈ చీరలకు మంచి ధర పలుకుతున్నా.. నేత కార్మికుడికి దక్కే మజూరీ అంతంతమాత్రమే. కొన్ని చేనేత సహకార సంఘాలు మాస్టర్ వీవర్సుతో కుమ్మౖMð్క నేత కార్మికులను నట్టేట ముంచుతున్నాయి. తక్కువ మజూరీలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయి. సహకార సంఘాల ద్వారా నేత కార్మికులతో చీరలు నేయించాల్సి ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. ముడిసరుకుల ధరలు చుక్కలనంటడం, చేసిన అప్పులు పెరిగిపోవడంతో నేతన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు తమకిచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఉప్పాడ పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు మాత్రమే సొంతమైన పేటెంట్ హక్కును కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రకం చీరలను ఇతర ప్రాంతాల్లో నేయించడంతో ఇక్కడి చీరలకు గిరాకీ తగ్గుతోంది. పేటెంట్ హక్కును కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నేతన్న నేరుగా విక్రయించేలా చూడాలి అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీర నేసిన ఘనత మా కార్మికులకుది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయడంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మా కళాకారుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది. నేరుగా కార్మికులే ఆన్లైన్లో విక్రయాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట -
‘టెక్స్టైల్ పార్క్’ ఇంకెప్పుడు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఇంకా తుది రూపం దాల్చలేదు. రూ.1,150.47 కోట్ల అంచనాతో ఐదు దశల్లో మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా రూపొందించిన ప్రణాళిక ముందుకు సాగట్లేదు. భూమిని చదును చేయడం, రోడ్లు, వరద నీటి కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, సీఈటీపీ, విద్యు త్, సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలిదశలో రూ.439.50 కోట్లతో పను లు చేపట్టాలని నిర్ణయించగా, గీసుకొండ మండ లం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లిలో 1,190 ఎకరాల భూమిని రూ.110 కోట్లతో సేకరించారు. ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఐఎల్ఎఫ్ఎస్ అనే కన్సల్టెన్సీకి అప్పగించి, ఇప్పటివరకు రూ.50 కోట్లతో పార్కు కాంపౌండ్ వాల్, కొన్ని అంతర్గత రోడ్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా పార్కు అవసరాల కోసం ప్రత్యేకమైన తాగునీటి పైపులైను నిర్మాణం కొనసాగుతోంది. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మరో రూ. 50 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. తొలిదశ పనుల పూర్తికి మరో రూ.230 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం ఆచితూచి నిధులు ఖర్చు చేస్తోంది. భూ వివాదాల కొలిక్కి యత్నాలు.. టెక్స్టైల్ పార్కును ఐదు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసి, పర్యావర ణ అనుమతులూ సాధించా రు. కాలుష్య శుద్ధీకరణకు కా మన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెం ట్ ప్లాంటు (సీఈటీపీ) ఏర్పాటుకు ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీం (ఐపీడీఎస్) కింద ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఇటు పార్కు అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ స్కీం (ఐటీపీఎస్) కింద ఆర్థిక సా యం చేయాలని రాష్ట్ర ప్రభు త్వం కోరుతోంది. అయితే, పార్కుకు దారితీసే గంగదేవిపల్లి అప్రోచ్‌రోడ్డు పనులు భూ వివాదాల కారణంగా కో ర్టు కేసులో చిక్కుకుని అర్ధంతరంగా నిలిచిపోయాయి. రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలె క్టర్ ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. పార్కు అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 3 ఎంఎల్డీలు సరఫ రా చేసేలా పనులు కొనసాగుతుండగా, భవిష్యత్తులో చలివాగు నుంచి ప్రత్యేక నీటి పైపులైను నిర్మించాలని ప్రతిపాదించారు. మరోవైపు పార్కుకు వెళ్లే మార్గంలో రైల్వే లైను అడ్డుగా ఉండటంతో.. రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. ఇటు 132/ 11 కేవీ సామర్థ్యమున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ను భవిష్యత్తు అవసరా ల కోసం నిర్మించాలని టీఎస్ఐ ఐసీ ప్రతిపాదించింది. అయితే అభివృద్ధి పనులు సకాలంలో జ రగకపోవడంతో పరిహారం పెం చాలంటూ భూములు అప్పగించి న రైతులు అక్కడక్కడా తిరిగి సా గు చేసేందుకు ప్రయత్నిస్తుండ టం వివాదాలు సృష్టిస్తోంది. యూనిట్ల స్థాపనేది? టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన సందర్భంగా వస్త్రోత్పత్తిలో పే రొందిన 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆస క్తి చూపుతూ ప్రభుత్వంతో ఎంఓ యూ కుదుర్చుకున్నాయి. రెండే ళ్లు కావస్తున్నా మౌలిక వసతులు అందుబాటులోకి రాకపోవడం తో యూనిట్ల స్థాపనకు ముందు కు రావట్లేదు. ఎంఓయూ కుదుర్చుకున్న సంస్థల్లో ఏడింటికి ఆన్లైన్ విధానంలో 50 ఎకరాలు కే టాయించినా పనులు ప్రారంభించలేదు. నూలు ఉత్పత్తిలో పేరొందిన కరంజీ, ప్లాస్టిక్ వ్యర్థాల నుం చి యార్న్ తయారు చేసే గణేశ ఎకోస్పియర్ వంటి కంపెనీలు త్వరలో పనులు ప్రారంభించే అ వకాశముందని సమాచారం. మె గా టెక్స్టైల్ పార్కులో యూనిట్ల స్థాపన వేగవంతంగా జరగకపో వడంతో షోలాపూర్, సూరత్, భివండీ ప్రాంతాల్లో వస్త్రోత్పత్తి యూనిట్లు నడుపుతున్న తెలంగాణ వారితో టీఎస్ఎండీసీ తర చూ భేటీ అవుతోంది. కొరియాకు చెందిన యాం గ్వాన్ అంతర్జాతీయ వస్త్రోత్పత్తి సంస్థ రూ.700 కోట్లతో ‘యార్న్ టు ఫ్యాబ్రిక్’(నూలు నుంచి వస్త్రం వరకు) పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతుండటంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ టెక్స్టైల్ పార్కు ముఖ చిత్రాన్ని మారుస్తుందని టీఎస్ఐఐసీ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా ఏర్పాటయ్యే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా పది వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. వలస కార్మికులకు ఉపాధి కల్పించాలి.. తెలంగాణ చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే భివండీ, షోలాపూర్ ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమ సంక్షో భాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చి ఉపాధి పొందుదామని అనుకున్నా రెండేళ్లుగా టెక్స్టైల్ పార్కు పనులు ముందుకు సాగడం లేదు. ఎంఓయూ కుదుర్చుకున్న పరిశ్రమలు తక్షణం యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాలి. – దాసు సురేశ్, నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ -
శ్రమలోనేనా సమానత్వం?
చేనేత వస్త్రాల తయారీలో పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు సమానమైన వేతనం లభించకపోగా, ఆర్థికంగా ఇక్కట్లపాలైన కొన్ని చేనేత కుటుంబాలను మహిళలే నడిపించవలసి వస్తోంది! ప్రభుత్వం చొరవ తీసుకుని చేయూతనిస్తే తప్ప మహిళా చేనేత కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం, తగిన విలువ లభించని పరిస్థితి నెలకొని ఉంది. పడుగు పేకల మేలు కలయికతో అందమైన, ఆకర్షణీయమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. అలాగే స్త్రీ, పురుషులు ఇద్దరు ప్రత్యేకశ్రద్ధతో చేనేత రంగంలో తమ శక్తియుక్తులను, వృత్తినైపుణ్యాన్ని మేళవించి అపురూప కళాఖండాలతో వస్త్రాలను తయారు చేస్తారు. అయితే ఇద్దరి శ్రమ సమానమే అయినప్పటికీ మహిళా కళాకారులకు మాత్రం సరైన గుర్తింపు, వేతనాలు లభించడం లేదు. అన్నిరంగాల్లో మాదిరిగానే చేనేత రంగంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారు. చేనేత వస్త్రాల తయారీలో 60 శాతం పనులలో స్త్రీల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో వారికి గుర్తింపు రావడం లేదు. వేతనాల్లో కూడా వివక్ష కొనసాగుతోంది. కుటీర పరిశ్రమగా ఈ రోజు చేనేత నిలదొక్కుకుందంటే దాంట్లో మహిళల పాత్రే అధికం. కూలీ గిట్టుబాటు కాక బతుకుదెరువు కోసం మగవారు ఇతర ప్రాంతాలకు వలసపోతే ఇంటి వద్ద ఉండి కుటీర పరిశ్రమను నిలబెట్టుకున్న ఘనత మహిళలదే. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు పేర్గాంచినవి కాగా.. ఈ ప్రాంతాలకు అనుబంధంగా పలు గ్రామాల్లో చేనేత కార్మికులు.. ప్రధానంగా మహిళా కార్మికులు ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎనభై ఏళ్ల వృద్ధమహిళలు సైతం జీవనాధారం కోసం రోజువారి కూలీ రూ.100 గిట్టుబాటు కాకున్నా పొట్టకూటి కోసం శ్రమిస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లకు తాళలేక భర్త ఆత్మహత్యలు చేసుకుంటే మహిళలే వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను భుజాన వేసుకుని కుటుంబ బాధ్యతను మోస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్క పోచంపల్లిలోనే చేనేత మగ్గాలు వేసే వారి సంఖ్య 225 వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు వెయ్యికి పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత వృత్తిలో చీరలు, ఇతర రకాల వస్త్రాలను తయారు చేయడం కోసం మగ్గం నేయడం, అచ్చులు అతకడం, చిటికీలు కట్టడం, ఆసులు పోయడం, కండెలు చుట్టడం, సరిచేయడం, రంగులు అద్దడం, రబ్బర్లు చుట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిపనుల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. సంప్రదాయంగా వస్తున్న చేనేత వృత్తిలో భర్తకు తోడుగా భార్య కచ్చితంగా తన సహకారాన్ని అందిస్తుంది. అయితే మహిళలకు రావాల్సినంత గుర్తింపు, వేతనాలు అందడం లేదు. సహకార సంఘాల్లో సభ్యత్వాలు, గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వడం లేదు. అందుకే మహిళల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఈ పరిశ్రమలో మహిళలకు మరింత ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం మహిళా సొసైటీలను ఏర్పాటు చేయాలని చేనేత కళాకారులు కోరుతున్నారు. అలాగే మహిళలకు వృత్తిపరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మగ్గమే జీవనాధారం భూదాన్ పోచంపల్లి మండలం భద్రావతి కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు బత్తుల అనితకు మగ్గమే జీవనాధారం అయింది. నిరుపేద చేనేత కుటుంబమైన బత్తుల అంబరుషి, అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం, పిల్లల చదువులు అనితపై పడ్డాయి. అ«దైర్యపడకుండా తనకు తెలిసిన వృత్తి.. మగ్గాన్ని నమ్ముకుంది. కూలీ మగ్గం నేయగా వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివిస్తోంది. ప్రస్తుతం కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా, కుమార్తె పాలిటెక్నిక్ చేస్తోంది. అనిత రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. నెల రోజులు కష్టపడి చీరెలు నేస్తే రూ.10వేలు ఆదాయం వస్తుంది. కిరాయి ఇంట్లో ఉంటుంది. రెండు రోజులకు నాలుగొందలు బాల్యం నుంచి చేనేత వృత్తి తెలుసు. మగ్గం నేస్తూ, చిటికీ కట్టడం, ఆసుపోయడం లాంటి పనులు చేస్తాను. ప్రస్తుతం కూలీకి అచ్చు అతుకుతున్నాను. ఒక అచ్చు అతకడానికి రెండు రోజులు సమయం పడుతుంది. దీనికి రూ. 400 కూలీ లభిస్తుంది. ఇలా నెలలో రూ. 4వేల వరకు సంపాదిస్తాను. నా భర్త కూడా చేతకాక, చేతనై కూలీకి మగ్గం నేస్తున్నాడు. ఒకరికొకరం చేదోడువాదోడుగా పని చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాం. – రాపోలు ప్రమీల, పోచంపల్లి వృద్ధాప్యంలోనూ తప్పని పని భర్త, కుమారుడు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఇదీ మా కుటుంబం. అయితే చేతికంది వచ్చిన కుమారుడు తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నా భర్త కూలీ మగ్గం నేస్తున్నాడు. నేను కూడా మాస్టర్ వీవర్ వద్ద రోజువారీ కూలీగా చిటికీలు కడుతున్నాను. నెలంతా పనిచేస్తే రూ. 6 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ వృద్దాప్యంలో కూడా ఇద్దరం పనిచేసుకుంటూనే జీవనాన్ని సాగిస్తున్నాం. – చిందం భద్రమ్మ, భూదాన్ పోచంపల్లి – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
చేనేత కార్మికులను ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చేనేత కార్మికుల కోసం ఏ రాష్ట్రంలో లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకించి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని కేటీఆర్ సూచించారని, అలాగే చేనేత ఉత్పత్తుల స్థాయిని, ప్రజల్లో ఈ దుస్తులకు ఆదరణ పెంచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకుల ఆదరణ లేకపోవడంతో చేనేత వృత్తి అంతరించి పోయే స్థితికి చేరిందని, మగ్గం మీద బట్టలు నేసే వారు చాలా చోట్ల కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు వృత్తిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. మే నెల నుంచి బీడీ కార్మికుల పింఛన్ మొత్తం రెట్టింపు అవుతుందని, పీఎఫ్ కార్డున్న కార్మికులందరికీ బీడీ భృతి లభిస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన వారందరికి డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానని, మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. గ్రామగ్రామాన టీఆర్ఎస్ సైనికులు.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో ప్రణాళికా బద్ధంగా తమ ఎన్నికల ప్రచారం కొనసాగుతోందని కవిత పేర్కొన్నారు. గ్రామగ్రామాన వందలాది మంది టీఆర్ఎస్ సైనికులు పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళుతున్నారన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, వీలైనన్ని గ్రామాలను చుట్టి వచ్చానని, ఎమ్మెల్యేలు కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోందన్నారు. ఆడబిడ్డలే టీఆర్ఎస్కు ఆయువుపట్టుగా నిలుస్తున్నారని, మహిళలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల దయతో తాను ఈసారి కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, నాయకులు ఆనందర్‌రెడ్డి, అర్కల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత వ్యాపారులపై వరదాపురం సూరి వివాదస్పద వ్యాఖ్యలు
-
చిక్కుల్లో చేనేత పరిశ్రమ..!
విజయనగరం, రామభద్రపురం: జిల్లాలో చేనేత పరిశ్రమ ప్రభుత్వ సహకారం లేక రోజురోజుకూ కునారిళ్లుతోంది. నాలుగేళ్ల కిందట జిల్లాలో 18 చేనేత సహకార సంఘాలుండేవి. ఆ సంఘాలను ప్రస్తుత ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంతో ఆయా కార్మికులకు గిట్టుబాటు ధర లేక పలు సంఘాలు మూతపడగా... ప్రస్తుతం 10 సంఘాలు మాత్రమే నిర్వహించబడుతున్నాయి. చేనేత కార్మికులను ఆదుకుంటాం..రెండు నెలలు జీవన భృతితో పాటు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం అని.. చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నేటికి అమలుకాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న పది సహకార సంఘాల్లో సుమారు 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరికి దాదాపు రూ.2 కోట్లు పైబడి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను ఆప్కో పరిశ్రమ ఏడాదికి పైగా అవుతున్నా ఇప్పటికీ ఇవ్వకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొనుగోళ్లలో నిర్లక్ష్యమే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేత సహకార సంఘంలో కార్మికులు తయారు చేసిన వస్త్రాలను నెలా నెలా కొనుగోలు చేయడంతో పాటు బకాయిలు చెల్లించేవారు. నాలుగేళ్లుగా చేనేత సహకార సంఘాల నుంచి వస్త్ర కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడంతో నాలుగు నెలలకో.. ఆరు నెలలకో ఒకసారి కొనుగోలు చేస్తున్నారు. పేరుకుపోయిన బకాయిలు, వస్త్ర నిల్వలు... మండలంలో గల కొట్టక్కి చేనేత సహకార సంఘంలో పాచిపెంట, కొట్టక్కి, సాలూరు,రామభద్రపురం మండలాల్లోని 90 మంది చేనేత కార్మికులకు పనికల్పిస్తున్నారు. వీరికి గతేడాది డిసెంబర్ నాటికి సుమారు రూ.66 లక్షలు బకాయి ఉంది. ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సుమారు రూ.31 లక్షలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.97లక్షలు బకాయి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వస్త్ర కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో ఈ సంఘంలో తయారైన సుమారు రూ.20 లక్షల వస్త్రాలు నిల్వ ఉండగా మరో రూ.10 లక్షల విలువ చేసే ముడి సరుకు నిల్వ ఉంది. వస్త్రాలు సరిగా కొనుగోలు చేయకపోవడం.. అలాగే తీసుకెళ్లిన సరుకుకు డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడంతో సంఘ పాలకవర్గం అప్పులు చేసి కొద్దో గొప్పో కార్మికులకు చెల్లిస్తున్నారు. మిగిలిన బకాయిల కోసం కార్మికులు నెలల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు హామీలు గాలికి... వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే విధంగా వర్షాకాలంలో రెండు నెలల పాటు పనులు కోల్పోయిన చేనేత కార్మికులకు నెలకు రూ. రెండు వేల చొప్పున ఆర్థిక సాయం.. వంద యూనిట్ల ఉచిత విద్యుత్..పక్కాఇల్లు, వర్క్‌షెడ్, తదితర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కార్మికులు మండి పడుతున్నారు. పెథాయ్ తుఫాన్ కారణంగా పది రోజుల పాటు ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి. కార్పొరేషన్‌తో ప్రయోజనం శూన్యం చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనడం ఎన్నికల గిమ్మిక్కు. దీని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని కార్మికులు చెబుతున్నారు. కార్మికులను ఆదుకునేందుకు ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయించడం.. బకాయిలు విడుదల చేయిస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 9వ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ చదివిన చేనేత కార్మికుల పిల్లలకు చదువు పెట్టిబడి కోసం ఏడాదికి రూ.1200 చొప్పున్న ఉపకారవేతనాలు అందేవని..ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం ఎటువంటి సహాయం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు. గిట్టుబాటు లేదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కొనుగోలుతో పాటు నెల నెలా పేమెంట్ ఉండేది. ఇప్పుడు పేమెంట్ అందేసరికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. అలాగే అప్పట్లో మీటరు వస్త్రం నేస్తే రూ.20 చొప్పున ఇచ్చే వారు. ఇప్పుడూ 20 రూపాయలే ఇవ్వడంతో గిట్టుబాటు కావడం లేదు. – గార అప్పలస్వామి,చేనేత కార్మికుడు, కొట్టక్కి -
దౌర్జన్య కాండ
చీరాల: చీరాల తెలుగుదేశం నాయకుల దౌర్జన్యాలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. అధికారం ఉంది అడిగేవారెవరంటూ దాడులకు తెగబడుతున్నారు. పోలీసులతో సహా అన్ని వ్యవస్థలు మావే.. మేము ఏం చేసినా మీకు దిక్కేదంటూ రెచ్చిపోతున్నారు. పైపెచ్చు కట్టేసి నివాసం ఉంటున్న ఇళ్లకు ఇప్పుడు పట్టాలిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. అధికారులను సైతం ఎటువంటి ప్రొటోకాల్ లేకుండానే బెదిరిస్తున్నారు. మేం చెప్పిన పని చేయండి.. లేకుంటే మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చీరాలలో ఇటీవల కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీ వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న హడావుడిఅంతాఇంతా కాదు. మంగళవారం ఇదేమని ప్రశ్నించిన కొందరు చేనేత యువకులతో పాటు ఒక మహిళను దారుణంగా కర్రలు, రాడ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే... చీరాలలో టీడీపీ నేతలు చేస్తున్న హడావుడితో ఇక్కడకు కొత్తగా వచ్చిన అధికారులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారంటూ టీడీపీ నేతలు హంగామా సృష్టిస్తున్నారు. ఎన్నికల కోడ్ కూసే ముందే మీకేం కావాలో చెప్పండి...అది చేసేస్తాం అన్న రీతిలో ఓటరుకు తాయిలాల బంధాన్ని బిగిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమకు ముఖ్యమంత్రి రాత పూర్వకంగా ఆదేశాలిచ్చారని, తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. మరో వైపు ప్రజలను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. మరో పదిరోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం.. పింఛన్లు ఇప్పిస్తాం..రేషన్‌కార్డులు కావాలా...కొత్త ఇళ్లు నిర్మించుకుంటారా అంటూ ప్రజలచేత దగ్గరుండి అర్జీలను ఇప్పిస్తున్నారు. ఎమ్మెల్యే ఆమంచి పార్టీని వీడటంతో టీడీపీలో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలు తమ అనుచరులతో కలిసి చీరాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపారు. నాలుగు రోజుల నుంచి చీరాల నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులను ఎమ్మెల్సీ పోతుల, మాజీ ఎమ్మెల్యే పాలేటిలు కలుస్తున్నారు. నాలుగేళ్లలో టీడీపీ హయాంలో చీరాల్లో జరిగిన అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటుగా అధికారులతో కలిసి పనులను చూస్తూ, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పాలేటి, పోతుల సునీతలు నియోజకవర్గంలో ప్రజలను నిలువునా మోసం చేసేలా ఉసిగొల్పుతున్నారు. అధికారులపై టీడీపీ నేతల స్వారీ... అధికారులు కూడా ఈ ఒత్తిళ్లతో పనిచేయడం కష్టతరమేననుకొని బదిలీ చేయించుకునే పనిలో పడ్డారు. అధికారులపై స్వారీ చేసేలా టీడీపీ నేతలు మారడంతో తప్పుకుంటే మంచిది అని వారు భావిస్తున్నట్లు సమాచారం. అలానే నేతల మధ్య కూడా కలహాలు మొదలయ్యాయి. చీరాల మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య సోమవారం మున్సిపల్ కార్యాలయంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో తిట్ల పురాణాలు అందుకున్నారు. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో ఎమ్మెల్సీ పోతుల సునీత కార్యాలయం బయట టెంటు వేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ తతంగాన్ని చూసి ప్రశ్నించిన చైర్మన్‌పై సునీత, అనుచరులు వాగ్వాదానికి దిగి ప్రభుత్వం మాది..పథకాలు మేము తెప్పించి ఇస్తాం...నీకేం సంబంధం అంటూ చైర్మన్‌ను ప్రశ్నించి దురుసుగా వ్యవహరించారు. వేడెక్కిన చీరాల రాజకీయాలు:ఇది గడచిన మరుసటి రోజునే చేనేత యువకులపై టీడీపీ నేత పాలేటి రామారావు అనుచరులు దాడులకు తెగబడడం రాజకీయాలను మరింత వేడెక్కించాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ప్రభుత్వ స్థలంలో చేనేత కార్మికులకు ఇళ్ల పట్టాలు అందచేసి పెద్ద సంఖ్యలో చేనేత షెడ్డు కార్మికులకు గృహాలు నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇళ్లల్లో చేనేత షెడ్డు కార్మికులు నివాసముంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు చీరాలలో అధికారులతో చర్చలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేనేతపురి కాలనీ వాసులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన ఇళ్ల పట్టాలు హౌసింగ్ కార్యాలయంలోనే ఉన్నాయి. కానీ ఇది తెలియని టీడీపీ నేతలు పాలేటి రామారావు, మరికొందరు నాయకులు ఆ పట్టాలన్నీ ఎమ్మెల్యే ఆమంచి వద్దే ఉన్నాయని భావించి మంగళవారం హౌసింగ్ డీఈ సుబ్బారావు వద్దకు వెళ్లి పట్టాల విషయం చర్చించడంతో పట్టాలన్నీ తమ వద్దే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయినా వినని టీడీపీ నేతలు అవి చేనేతపురి వాసుల వద్దకు వెళ్లి చూపించాలని బలవంతం చేశారు. ఈ సమావేశానికి కొందరు వెళ్లగా మరికొందరు ఇదేంటని ప్రశ్నించారు. తమకు ఎప్పుడో పట్టాలు మంజూరై ఎమ్మెల్యే ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఇప్పుడు సమావేశం అవసరం ఏముందని ప్రశ్నించడంతో టీడీపీ నాయకులకు, చేనేతపురి యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, పాలేటి వర్గీయులు కలిసి చేనేత యువకులపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో చేనేతపురికి చెందిన అండగుండ ప్రవీణ్‌కుమార్, గోర్పుని శశిధర్, బూడిద వరహాలును ఇళ్లలో నుంచి బయటకు లాగి ఇనుపరాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా నరికారు. తమను కొట్టవద్దని చేనేత యువకులు ప్రాధేయపడినా పాలేటి అనుచరులు శాంతించలేదు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకుని పరామర్శించారు. ఇలా రోజుకు ఒక విధంగా టీడీపీ నేతల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అధికారం మాది...పెత్తనం కూడా మాదే అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు ఈ స్థాయిలో ప్రవర్తించడంతో ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
చేనేత కార్మికులకు చేయూత: హరీశ్
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలు మెచ్చాయని, ఇక్కడి చేనేత కార్మికులు నేసిన గొల్లభామ చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిం దని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట చేనేత సొసైటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించి ప్రభుత్వ రుణమాఫీ చెక్కులను బ్యాంకర్లకు అందజేశారు. నేత కార్మికులను ఆదుకుంటామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల యోగ క్షేమాలపై ప్రత్యేక దృష్టిపెట్టారని ఆయన అన్నారు. చాలీచాలని ఆదాయంతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడంలో కేటీఆర్ సహకారం మరువలేమని అన్నారు. కార్మికులకు నూలు, రసాయనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతి పట్టణంలో చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గొల్లభామ చీరల తయారీని ప్రభుత్వ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. -
సర్వేలతో సరి !
అనంతపురం సప్తగిరి సర్కిల్: ‘చేనేత రంగాన్ని ఆదుకుంటాం.. గుర్తింపు కార్డులు, ప్రత్యేక ప్యాకేజీలతో భరోసా ఇస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో సర్వేలను చేశారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా కార్వే సర్వే పేరుతో ఓ సర్వేను నిర్వహించింది. అయితే సర్వే అయిపోయి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఏ గుర్తింపు కార్డులు మాత్రం ఇవ్వలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం.. హౌస్ కం వర్క్‌షెడ్, హెల్త్ స్కీం కోసం సర్వేను చేపట్టినా అది ఇంకా కొనసా...గుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్వేల పేరుతో వారి ఓట్లను పొందేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు సర్వే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు కార్వే సంస్థ చేత సర్వేను చేపట్టింది. వారు తమ నివేదికను ఆయా ప్రభుత్వాలకు అందించారు. కాని వాటి ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ లబ్ధి చేకూరలేదు. ఇటు రాష్ట్రప్రభుత్వం వేసిన సర్వేల కోసం కొత్తగా కమిటీలనూ వేసింది. ప్రధానంగా పంచాయతీ, మండల, మునిసిపల్, జిల్లా స్థాయిలో కమిటీలను వేశారు. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ, పీడీ డీఆర్డీఏ, హౌసింగ్ అధికారులు, చేనేత, జౌళి శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదే తీరు మునిసిపల్, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ కొనసాగుతోంది. ఆయా కమిటీలు తాము చేసే సర్వేల ఆధారంగా చేనేతలను గుర్తించడం ఒక ఎత్తు అనుకుంటే వారికి పథకాలను అమలు చేయడం మరో ఎత్తుగా ఉంటుందని చేనేత సంఘాల నాయకులు వాపోతున్నారు. ప్రధాన సమస్యలు ఇలా... చేనేతలకు ప్రకటించిన రాయితీ ముడి సరుకును సకాలంలో అందించకపోవడం. పట్టు రాయితీని అనర్హులైన వారికి కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా వారు పవర్‌లూమ్స్ మగ్గాల ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారు. పవర్‌లూమ్స్ చేనేత రంగాన్ని అతలాకుతలం చేసింది. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు వాటికి వత్తాసు పలకడం. పవర్‌లూమ్స్ యాక్ట్ చట్టాలను కఠినతరంగా అమలు పరచకపోవడం వంటి సమస్యల ద్వారా చేనేత రంగం కుదేలవుతోంది. గతంలో అమలులో ఉన్న హెల్త్ స్కీంను ప్రభుత్వం విస్మరించడంతో చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక.. చేనేతలకు రుణమాఫీ చేసిన దాఖలాలూ లేవు. దీంతో పాటు జిల్లాలోని చేనేతలు రేషం సబ్సిడీ పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని ప్రభుత్వం అందించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందింస్తున్న ముద్రా రుణాల మంజూరులోను అలసత్వమే దర్శనమిస్తోంది. హామీలు ఇలా... ఈ ఏడాది ఆగస్టు 7న చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ , గుంత మగ్గాలు కలిగి వర్షాకాలంలో వానలో మునిగిన మగ్గాలకు రూ. 2 వేలు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం, హౌస్ కం వర్క్‌షెడ్, కామన్ వర్క్‌షెడ్స్ వంటి హామీలను ఇచ్చారు. ఆగస్టులో ఇచ్చిన హామీకి నవంబర్ వరకు జీ ఓల జారీకే సరిపోయింది. నవంబర్‌లో జీఓలు జారీ అయినా ఇప్పుడు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. వీటిని కాస్త జనవరి నుంచి మార్చి వరకు సాగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్న విమర్శలున్నాయి. -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, యాదాద్రి: మహాకూటమి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 15 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహా ర దీక్షను బుధవారం రాత్రి ఆయన టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కార్మికుల 12 డిమాండ్లను మహాకూటమి ఎజెండాలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు పెంచుతామన్నా రు. భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న భూములు, బంగారం, ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై టీఆర్ఎస్ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నీ చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయని కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టాలని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ సీఎం అయితే ఏదో ఉద్ధ రిస్తాడని, ప్రజల బతుకులు బాగుపడతాయని గెలి పిస్తే వాటన్నింటినీ మరిచిపోయారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పేద ప్రజలకు వారి సొంత స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయలేకపోయారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేద ల బాధలు తొలగాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహాకూటమి అధికారంలోకి రావడం అవసరమని పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నేతలు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండువారాల్లో రుణమాఫీ
రామన్నపేట( నకిరేకల్ ) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.40 కోట్ల రుణమాఫీ ప్రకియ రెండువారాల్లో పూర్తవుతుందని రాష్ట్ర చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని ఎస్బీఐ, కెనరాబ్యాంక్‌లలో రుణమాఫీ కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా అందిన ప్రతిపాదనల జాబితాను పరిశీలించారు. బ్యాంకు మేనేజర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఆయన స్థానిక మాట్లాడుతూ రాష్ట్రంలో 2010 ఏప్రిల్ 1 నుంచి 2017మార్చి 31 మద్యకాలంలో వివిధ బ్యాంకుల ద్వారా సుమారు 12వేల మంది చేనేత కార్మికులు తీసుకున్న రూ.40కోట్ల రుణాలను మాఫీ చేయుటకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కాలంలో రుణాలు తీసుకుని సక్రమంగా డబ్బులు చెల్లించిన చేనేతకార్మికులకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. రుణమాఫీకి సంబంధించి కలెక్టర్లు అందజేసిన ప్రతిపాదనలను బ్యాంకులవారిగా పరిశీలించే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందన్నారు. పరిశీలన ముగిసిన వెంటనే మాఫీకి సంబంధించిన మొత్లాన్ని బ్యాంకుఖాతాల్లో జమచేయడం జరుగుతుందని వివరించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో రుణమాఫీ ద్వారా 3,653 మంది చేనేత కార్మికులకు సంబంధించి 13.65కోట్ల రుపాయాల రుణాలు మాఫీ అవుతాయన్నారు. రుణాల వసూలుకోసం కార్మికులను ఒత్తిడి చేయవద్దని స్టేట్‌లెవల్ బ్యాంకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఆయనవెంట సహాయ అభివృద్ధి అధికారులు కళింగరెడ్డి, చంద్రశేఖర్, సంఘ అధ్యక్షుడు వనం సుధాకర్ ఉన్నారు. -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
కరీంనగర్ సిటీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేనేత కార్మికులందరినీ కంటికి రెప్పలా కాపాడుకుని, అండగా ఉంటామని ఆర్థిక పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత వృత్తి గౌరవప్రదమైనదన్నారు. ఇప్పటివరకు దేశంలో పూర్తిస్థాయిలో ఈ వృత్తిని కాపాడడంలో అన్ని ప్రభుత్వాలు శ్రద్ధకనబర్చలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేనేత కార్మికులు, సంఘాలు సంఘీభావం తెలిపారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా చేనేత సంఘాలకు షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. రంగులపై, నూలుపై 40శాతం సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో 6 కిలోల బియ్యం, లక్ష రూపాయల కల్యాణలక్ష్మి పథకం చేనేత కార్మికులకు కూడా వర్తిస్తుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలను మంత్రి కేటీఆర్‌తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.చేనేత కార్మికులలో చిరువ్యాపారాలు చేసుకొనే వారికి, వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం రుణాల కింద మంజూరైన చెక్కులను మంత్రి అందజేశారు.వృద్ధ చేనేత కార్మికులను సన్మానించారు. పాఠశాలల్లో నిర్వహించిన పోటీపరీక్షలలో ప్రతిభచూపిన వారికి బహుమతులు అందించారు. శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావు, చేనేత జౌళిశాఖ ఏడీ వెంకటేశం, ఎంపీపీ వాసాల రమేశ్, ఖాదీ రీజినల్ ఆఫీసర్ సతీష్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం తదితరులు ఉన్నారు. -
ఎన్నికల వేళ..తాయిలాల వల
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జిల్లా పర్యటనలో పాత హామీలనే మరోమారు వల్లె వేశారు. గతంలో ఎప్పటికప్పుడు హామీల తేదీలను మార్చి చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఈసారి మాత్రం గత పర్యటనలో చెప్పిన తేదీలనే మళ్లీ ప్రస్తావించారు. నాలుగేళ్ళ పాలనలో జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల వేళ పాత హామీలనే ఏకరువు పెట్టడం అధికార పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో హెలికాప్టర్లో పామూరు మండలం మండలం దూబగుంట్ల చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ 208.45 ఎకరాలలో రు.1200 కోట్లతో నిర్మిచనున్న ఏపీజే అబ్దుల్‌కలాం ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి భూమిపూజ చేసి, పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం రామన్నపేట, పందిళ్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. పందిళ్లపల్లిలో జాతీయ చేనేత దినో త్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నెలకోమారు వెలిగొండ సందర్శన.. గత నెల 28న ఒంగోలుకు వచ్చిన ముఖ్యమంత్రి వచ్చే సంక్రాంతి నాటికి టన్నెల్–1 పనులను పూర్తి చేసి వెలిగొండ నీటిని విడుదల చేస్తామని చెప్పారు. మంగళవారం పామూరు మండల పర్యటనలో మాట్లాడుతూ వెలిగొండకు తానే శంకుస్థాపన చేశానన్నారు. సంక్రాంతి లోపల 1వ టన్నెల పనులు పూర్తిచేసి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో నీరిస్తామన్నారు. పోలవరం లాగే నెలకొకసారి వెలిగొండను సందర్శిస్తానన్నారు. ఆగిన వెలిగొండ పనులు రెండు రోజుల్లో మొదలవుతాయని సీఎం చెప్పారు. వెలిగొండ నీటితో గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. వెలిగొండకు శ్రీశైలం టన్నెల్ ద్వారానే నీరు రావాల్సి ఉందన్నారు. ప్రకాశం జిల్లాకు సైతం గోదావరి నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు డెయిరీకి రూ.37 కోట్లు నిధులిచ్చి పునరుద్దరించినట్లు సీఎం చెప్పారు. గోదావరి నీళ్లు సాగర్ రైట్ మెయిన్ కెనాల్‌కు తెస్తున్నామన్నారు. కనిగిరి ప్రాంతంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) అభివృద్ధి చేస్తామన్నారు. దర్శిలో మెగా ఇండస్ట్రీయల్ హబ్ వస్తుందన్నారు. రామాయపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల కోసం జిల్లాలో ఆసియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమతో మాట్లాడుతున్నట్లు సీఎం చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే 28వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మార్టూరులో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. నేతన్నకు నెలకు రూ.4000 కరువు భత్యం వేటపాలెం: సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటనలో ఎన్నికల తాయిలాలుగా చేనేతలపై వరాల జల్లులు కురిపించారు. వేటపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చారు. పామూరు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో రామన్నపేట గ్రామంలో కొత్తిళ్ళ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అనంతరం బస్సులో భోజనం చేసి పందిళ్ళపల్లి స్టేజీ బజారు వెళ్లే రోడ్డు వద్ద రూ.5.17 కోట్లతో నిర్మించనున్న పీహెచ్సీ నూతన భవనం, జలశుధ్ధి కేంద్రం, శ్మశానాల అభివృద్ధి పనులు, అంగన్వాడీ కేంద్రాలు, అంతర్గత సీసీ రోడ్లు, పంచాయతీ నూతన భవనం, డంపింగ్ యార్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాదయాత్రగా స్టేజీ సెంటర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన నూలుకు రంగుల అద్దకం, యార్న్, చేనేత చీరలకు సంబంధిత చేనేత ప్రదర్శనలు తిలకించారు. అనంతరం మగ్గం గురించి తెలుసుకుని కాసేపు మగ్గం నేసారు. గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించి నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్న చేనేత కార్మికుడు పింజల యేసు ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలసుకున్నారు. తర్వాత నిరుద్యోగ యువతకు యువనేస్తం పథకాన్ని వివరించి రూ.వెయ్యి ఇస్తామని తెలిపారు. చీరాల వస్త్రానికి పేటెంట్ ఇస్తాం.. మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి జాతీయ చేనేత దినోత్సవ బహిరంగ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా చీరాల వస్త్రానికి పేటెంట్ ఇస్తామని, చేనేతలకు వర్షం పడే కాలంలో గుంటల్లో నీరు నిలిచి పనులు సాగనందున నెలకు రూ.4000 కరువు భత్యం ఇస్తామని, హెల్త్‌స్కీం పునరుద్ధరిస్తామని, 100 యూనిట్లలోపు ఉచిత కరెంటు ఇస్తామని, త్రిఫ్ట్ ఫండ్ 16 శాతానికి పెంచుతామని, జీఎస్టీపై పోరాటం చేస్తామని, రూ. 2.50 లక్షలతో హౌస్ కం వర్క్‌షెడ్ నిర్మిస్తామని, ఆప్కో బకాయిలను చెల్లిస్తామని, యార్న్‌కు 30 శాతం సబ్సిడీ ఇస్తామని, అమరావతిలో 10 ఎకరాల్లో చేనేత భవనం నిర్మిస్తామని, చేనేతల రుణమాఫీ చేశామని, చేనేత అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, పరిటాల సునీత, ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణ బలరాం, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు పోతుల రామారావు, కలెక్టర్ వి.వినయ్‌చంద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలను పర్యవేక్షించారు. -
మాది చేనేతల ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్క నేతన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడనే మాట విన్పించొద్దనేదే మా విధానం’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్న బాగుంటే, ఆత్మగౌరవంతో, సంతృప్తిగా ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని పేర్కొన్నారు. చేనేత కళాకారుల సంక్షేమానికి మరెన్నో కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. వీటిపై ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. జా తీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో చేనేత వస్త్రాల ప్రదర్శనశాలను కేటీఆర్ ప్రారంభించారు. చేనేత ఉ త్పత్తుల ప్రాధాన్యం గుర్తించడం, ప్రోత్సహించడం, మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర తదితర ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకు ని ఆన్లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్, మాల్స్‌లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని, టెస్కో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయాలు జరుపుతామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా చేనేత, జౌళి శాఖకు రూ.1,200 కోట్ల కేటాయించామని, అందులో రూ.400 కోట్లను చేనేత రంగానికే వెచ్చిస్తున్నట్లు వివరించారు. ప్రతి పైసా చేనేత కళాకారులకే అందేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు, వాటికి అనుబంధంగా 22,875 మంది కలిపి మొత్తం 40 వేల చేనేత కళాకారులు ఉన్నారని తెలిపారు. పద్మశాలి ఇంట్లో కేసీఆర్ చదువు.. సీఎం కేసీఆర్ పుట్టిన చింతమడక గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో ఆయన ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్బాకకు రోజూ నడిచి వెళ్లేవారని కేటీఆర్ చెప్పారు. దీంతో కేసీఆర్‌ను దుబ్బాకలోని ఓ పద్మశాలి సోదరుడి ఇంట్లో ఉంచి చదివించారని గుర్తుచేశారు. కేసీఆర్ పద్మశాలీల కష్టసు ఖా లు దగ్గరగా ఉండి తెలుసుకున్నారని కేటీఆర్ పేర్కొ న్నారు. చేనేత కార్మికుడి ఇంట్లో పురుషుడు మగ్గం నేస్తే, మహిళలు బీడీలు చుట్టేవారని, దీని కారణంగా చేనేత, బీడీ కార్మికుల కష్టసుఖాల పట్ల కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేతన్న ల వేతనం పెంచాలనే ఉద్దేశంతో చేనేత మిత్ర పేరు తో పథకాన్ని ప్రవేశపెట్టి 50% సబ్సిడీపై నూలు, రసాయనాలు, అద్దకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పా రు. ఈ పథకంలో 18,683 మంది చేనేతకారు లు నమోదు చేసుకున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. చేనేతకారుల సామాజిక భద్రత కోసం నేతన్నలకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించామని, ఇందులో 19,125 మంది చేనేత కార్మికులు చేరారని, ప్రభు త్వం రూ.60 కోట్లు కేటాయించిందన్నారు. కళాకారు ల కుటుంబానికి ప్రతీ నెలా రూ.6 వేల నుంచి రూ.8 వేల ఆదాయం వచ్చేలా ఈ 2 పథకాలు అమలు చేసు ్తన్నామన్నారు. 12 వేల మంది నేతన్నలకు సంబంధిం చిన రూ.40 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రుణాలు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలకు మార్కెట్ భద్రత కల్పించేందుకు టెస్కో షోరూంల ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పోచంపల్లిలో మైక్రోసాఫ్ట్ సహకారంతో డిజైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించేందుకు సినీ, టీవీ కళాకారుల సేవలను వినియోగిస్తున్నామని, ఈ క్రమంలో నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామని పేర్కొన్నారు. రూ.10.2 కోట్లతో 2,600 మంది కళాకారుల కోసం ఇప్పటికే రాష్ట్రంలో 8 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా 18 క్లస్టర్లు మంజూరు చేయాలని కేం ద్రాన్ని కోరామన్నారు. రూ.15 కోట్లతో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణ, రూ.14 కోట్లతో గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాçపూజీ పేరుతో 30 మంది కళాకారులకు చేనేత పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ శైలజా రామయ్యర్, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణి పాల్గొన్నారు. -
చిక్కుల్లో నేత
అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల బతుకులు నానాటికి దుర్భరంగా మారుతున్నాయి. మగ్గంపై రేయింబవళ్లు కష్టపడినా మూడు పూటలా నోట్లోకి ఐదు వేళ్లు పోవడంలేదు. వీరి కష్టానికి ఖరీదు దక్కడంలేదు. అపర బ్రహ్మలుగా కీర్తించబడుతున్న చేనేతలకు చేయూత ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. వెంకటగిరి (నెల్లూరు): చేనేతల కష్టానికి ఖరీదు అందడంలేదు. చేనేత పరిశ్రమలో ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మాస్టర్ వీవర్లు కార్మికులను దోచుకుంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికుల్లో దయనీయస్థితి ఏర్పడింది. కొందరు చేనేత వృత్తిపై జీవించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో మగ్గం అటకెక్కింది. జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వెంకటగిరి, చెన్నూరు, ఇందుకూరుపేట, మడమనూరు, దంపూరు, వావిళ్ల, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, పాటూరు, నేదురుమల్లి, కసుమూరు, పాలిచర్లపాడు ప్రాంతాల్లో చేనేత కార్మికులు నివసిస్తున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు మగ్గంలో నలిగిపోతున్నారు. విదేశాల్లో చేనేత వస్త్రాలకు ఆదరణ అభివృద్ధి చెందిన దేశాల్లో చేనేత వస్త్రాలు ధరిం చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందంతో పాటు దర్పణానికి ప్రతీ కలుగా చేనేత వస్త్రాలు నిలుస్తున్నాయి. చేనేత వస్త్రాలు ఆరో గ్యానికి ఎంతో ఉపయుక్తం కావడంతో ఈ వస్త్రాలకు విదేశాల్లో సైతం డిమాండ్ పెరుగుతుంది. చేనేత వస్త్రాలకు గిరాకీ ఉన్నా చేనేత కళాకారు ల బతుకులు మాత్రం దిగజారిపోతున్నాయి. నేతల బతుకులను రక్షించాల్సిన చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. స్వాతంత్య్రం కోసం ఉద్యమ స్ఫూర్తి ని రగిలించిన ఘనత చేనేత రంగానిదే. ఉద్యమసారథి మహాత్మాగాంధీ విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చిన ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేనేత వస్త్రాలపై పేటెంట్ హక్కును పొందిన ఘనత చేనేత కళాకారులదీ. కాగా వెంకటగిరి చీరలకు 2009లో జీఐ (జియాలాజికల్ ఐడెంటిఫికేషన్) గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపుతో తమ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి బతుకులు గాడిన పడుతాయనుకున్న నేత కళాకారులకు తొమ్మిదేళ్లుగా ప్రత్యేకంగా ఒరింగిదేమీ లేదు. పరిశ్రమను బతికిస్తున్న సృజనాత్మకత సృజనాత్మకశక్తిని ఉపయోగించి ఎన్నో కొత్త డిజైన్లను సృష్టించడంలో వెంకటగిరి చేనేత కళాకారులు సిద్ధహస్తులు. ఇక్కడి కార్మికుల సృజనాత్మకతో రూపుదిద్దుకున్నదే జాందానీ వర్క్ చీరలు. వెంకటగిరి చీరలకు జింధానీ వర్క్‌తో అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉంది. చీర డిజైన్ నేయడంలో జాందానీ వర్క్ ఉంటే ఇరువైపులా ఒకే రకంగా డిజైన్ కనిపిస్తుంది. ఇటువంటి ప్రత్యేకతతో చీరలు నేయడం దేశంలో ఎక్కడా కనిపించదు. బంగ్లాదేశ్‌లో జాందానీ వర్క్‌తో చీరలు నేస్తారు. ఆ విధానంలో నైపుణ్యతను పెంచుకుని ఇక్కడి కార్మికులు ప్రత్యేకతను చాటుతున్నారు. జాంధానీ వర్క్‌తో మగ్గాల మీదనే నేయడం వలన ప్రత్యేకత ఉంది. జాతీయ అవార్డులు.. మారని బతుకులు రాష్ట్రపతి, ప్రధానిమంత్రి నుంచి జాతీయ అవార్డులు అందుకున్నా.. చేనేతల తలరాతలు మారడం లేదు. 1950లో వెంకటగిరి పట్టణానికి చెందిన బోగా వెంకటసుబ్బయ్య తొలిసారిగా జాతీయ చేనేత పురష్కారం అందుకున్నారు. ఆ తర్వాత గునకుల వెంకటేశు, బత్తిన సుబ్బరాయులు ఈ అవార్డులను అందుకున్నారు. 1987లో దొంతు సంజీవి, 1989లో డక్కిలి మండలం మార్లగుంటకు చెందిన కలవలపూడి వీరా స్వామి, 1996లో కూనా మల్లికార్జున్, 1999లో భో గా రాములు, 2000లో సజ్జావీరయ్య, 2005లో గౌరాబత్తిన రమణయ్య, పట్నం మునిరాజా జాతీ య (రాష్ట్రపతి) అవార్డులు పొందారు. 2014లో వెంకటగిరి పట్టణం బొప్పాపురానికి చెందిన లక్కా శ్రీనివాసులు వెంకటగిరి చీరలో గోవర్ధనుడైన రాధాకృష్ణులను నేసి జాతీయ (రాష్ట్రపతి) అవార్డుకు ఎంపికయ్యారు. 2015లో పట్నం చీరాలరెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది వెంకటగిరి పట్టణం కట్టెలవీధికి చెందిన పట్నం మునిబాబు జాతీయ అవార్డుకు ఎంపికయి మంగళవారం జమ్మూలో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో అవార్డు అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఎంతో మంది ఇక్కడి చేనేత కళాకారుడు జీవిత చరమాంకంలో కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కళాకారులును ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూ త ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేనేతల డిమాండ్లు ఇవీ చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు వంటి వాటి ద్వారా చేయూత అందించాలి. నేత కార్మికులకు స్టాండ్ మగ్గాలు అందించాలి. నేత పనులకు అవసరం అయిన నూలు, జరీ, వంటి ముడిసరుకులు సబ్సిడీపై అందించేందుకు చేనేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేయాలి. చేనేత ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలి. చేనేతను జౌళి శాఖ నుంచి వేరు చేసి బడ్జెట్ నిధుల కేటాయింపులు నేరుగా చేనేతల సంక్షేమానికి వినియోగపడేలా చర్యలు తీసుకోవాలి. చేనేతలకు పింఛన్, పక్కాఇల్లు, ఆరోగ్యబీమా వంటి పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రభుత్వం ప్రోత్సహించకుంటే కనుమరుగే చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకుంటే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిల్క్‌సబ్సిడీ రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు ఇస్తున్న రూ.600 సబ్సిడీని సైతం నిలిపివేసింది. వడ్డీ లేకుండా చేనేతలకు రుణాలు అందించాలి. – కూనా మల్లికార్జున్, రాష్ట్రపతి అవార్డుగ్రహీత, వెంకటగిరి -
చేనేతకు చేయూత ఏదీ!
సాక్షి, అమరావతి: ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువ అన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని.. రుణమాఫీ చేస్తామని ఎంతో ఆర్భాటంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వాటి ఊసే మరిచారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం పేరుతో మూడు రోజులుగా ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అధికార యంత్రాంగమంతా అక్కడే ఉంది. చేనేత కమిషనర్ కూడా చీరాలలోనే తిష్టవేశారు. ఈ నేపథ్యంలో చేనేత రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రత్యేక కథనం.. ప్రభుత్వం అంకెల గారడీ: రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 1,90,000 మంది ఉన్నారు. అనధికారికంగా మరో 60 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇంత జనాభా ఉన్న వీరికి ఏటా బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ నాలుగున్నరేళ్లల్లో కేవలం రూ.675కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గత సంవత్సరం వరకు ఖర్చు చేసింది సుమారుగా రూ.189 కోట్లు మాత్రమే. చేనేతలకు చంద్రబాబు చేస్తున్న నమ్మకద్రోహానికి ఈ లెక్కలు అద్దంపడుతున్నాయి. ప్రభుత్వం తీరుతో చేనేత కార్మికులు వేరే వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. కూలీలుగా.. లారీ క్లీనర్లుగా.. బార్లలో సర్వర్లుగా.. పెట్రోల్ బంకుల్లో.. చేరుతున్నారు. జీఎస్టీ భారంపై నోరు విప్పని సర్కార్ 2017 జూన్ 3న జరిగిన జీఎస్టీ సమావేశంలో చేనేతపైన జీఎస్టీ వేయడాన్ని ఒప్పుకోబోమని ఒడిశా ప్రభుత్వం కరాఖండిగా చెప్పగా.. టీడీపీ ప్రభుత్వం అందుకు కనీస మద్దతు కూడా ఇవ్వలేదు. అలాగే, చేనేతల కోసం కార్పొరేషన్ అవసరం అని ధర్మవరంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన తరువాత చంద్రబాబు చేనేత సలహా బోర్డ్ నియామకానికి ఆలోచిస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ.2000లు సబ్సిడీ ఇస్తామని జగన్ హామీ ఇవ్వగానే టీడీపీకి ఏం చేయాలో పాలుపోలేదు. కాగా, కనీస వేతన చట్టం ప్రకారం ప్రతీ చేనేత కార్మికునికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంది. కానీ, అదెక్కడా అమలుకావడంలేదు. మాటలన్నీ నీటిమూటలే! చేనేతలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం చేతల్లోకి వచ్చేసరికి మాత్రం రిక్తహస్తం చూపుతోంది. ఉదాహరణకు.. - చేనేతల త్రిప్ట్ ఫండ్ పథకానికి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసింది. రూ.1000 కోట్ల ప్రత్యేక నిధితో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు హామీ గాలిలో కలిసిపోయింది. - రాజధాని అమరావతికి భూమి పూజ చేసిన సమయంలో రైతులకు ఇచ్చిన ఆప్కో వస్త్రాల బిల్లు రూ.3.88 కోట్లు ఇంతవరకు ఆప్కోకు చెల్లించలేదు. - చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జనతా వస్త్ర పథకానికి రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా పవర్ లూమ్ వారికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించడం ఈ ప్రభుత్వ ద్వంద వైఖరికి అద్దంపడుతోంది. - ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు కనీస పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. ఇలా చేస్తేనే చేనేతకు చేయూత - జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ పది శాతం రాయితీతో నూలు ఇప్పించాలి. - తమిళనాడులోని చేనేత విధానాన్ని అమలుచేయాలి. - ప్రభుత్వ పాఠశాలలు, సాంఘీక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు చేనేత వస్త్రాలను మాత్రమే ఇవ్వాలి. - ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒకసారైనా చేనేత వస్త్రాలను ధరించాలి. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. - సహకార సంఘాలను బలోపేతం చేసి వారికి ఇంకా నైపుణ్యం కల్పించి డిమాండ్ ఉన్న వస్త్రాలు నేసేలా కార్మికులను తీర్చిదిద్దాలి. ఇవన్నీ జరిగినప్పుడే చేనేత జాతీయ దినోత్సవాన్ని చేనేతలు పండుగలా జరుపుకుంటారు. మోసపు మాటలు చేనేత రుణాలు రద్దు చేస్తామన్నారు, చేసినట్లు నటించారు. కానీ, ఇంకా బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. చేనేత కార్మికుల్లో మరింత నైపుణ్యం పెరిగేలా శిక్షణ ఇవ్వటంలేదు. కనీస వేతనం అమలు చేయించడంలేదు. కార్మికులకు వృద్ధాప్యంలో ఉచిత వైద్యం అందటంలేదు. ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలే. పవర్‌లూమ్స్ వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు చేతి వృత్తి వారికి ఇవ్వడంలేదు. బీరక సురేంద్ర, వైఎస్సాఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
చేనేతల కష్టాలు విని చలించిన వైఎస్ జగన్
-
ఉపాధి లేక వలస పోతున్నారన్నా..
అంబాజీపేట: చేనేతకు ఉపాధి లేక కార్మికులు వలస పోతున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద చేనేత మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేబ్రోలు క్యాంపు కార్యాలయం వద్ద జననేతను వారు కలిసి సమస్యలను వివరించారు. చేనేత పనిచేసేవారికి ఉపాధి కూలీకి ఇస్తే ఆదాయం కూడా రావడం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో రుణాలు మంజూరు చేసి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసి పక్క రాష్ట్రాల నుంచి పవర్ లూమ్స్ వస్త్రాలు తీసుకువచ్చి స్కూల్ యూనిఫాం ఇస్తున్నారన్నారు. దీంట్లో టీడీపీ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం జననేతను వారు సత్కరించారు. చేనేత రంగాన్ని కాపాడాలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత రంగాన్ని కాడాపాలంటూ గొల్లప్రోలుకు చెందిన చేనేత కార్మికులు బండారు బాబూరావు, పలకా సుబ్బారావు తదితరులు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో వారు జగన్‌ను కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం అందించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన సమయంలో జిల్లాలో 50 చేనేత సంఘాలు ఉండేవని, ఎనిమిది సంఘాలు మినహా మిగిలిన సంఘాలన్నీ మూతబడే పరిస్థితికి వచ్చాయని, ఆ సమయంలో చేనేత సంఘాలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేసి చేనేత కార్మికులను ఆదుకున్నారన్నారు. అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధంగా జీఓ జారీ చేయడం, ఆరోగ్య బీమాతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల ఆరోగ్య బీమా పథకాన్ని ఎత్తివేశారని వాపోయారు. ప్రతీ జిల్లాకు టెక్స్టైల్ పార్కు నిర్మించి అందులో చేనేత కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో చేనేత సంఘాలు కుంటుబడ్డాయన్నారు. యేటా వెయ్యి కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పి మాట తప్పారన్నారన్నారు. గతంలో ఒక్క గొల్లప్రోలు మండలంలోనే రెండు వేలు మగ్గాలు ఉండగా 2018 నాటికి వీటి సంఖ్య 800 పడిపోయిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్‌ల వలన చేనేత రంగం దెబ్బతింటోందని వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై దృష్టి సారించడంతో పాటు చేనేత వర్గానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని, మత్స్య కార్మికుల మాదిరిగా చేనేత కార్మికులకు కూడా వర్షాకాలంలో పనికి ఆహారపథకం అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన చేనేత కార్మికులు
సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కోనసాగుతోంది. టీడీపీ అధికారంలో ప్రజలకు అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలను తెలసుకుంటూ వారికి భరోసా ఇస్తూ రాజన్న తనయుడు ముందుకు కదులుతున్నారు. తాజాగా జననేతను చేనేత కార్మికులు కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. చంద్రబాబు చెప్పుకుంటున్న చేనేత రుణమాఫీ ఎవరికి అందిందో తెలీదని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వయసు పైబడిని చేనేత కార్మికులకు మూడు వేల పింఛన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల కష్టాలు విన్న రాజన్న తనయుడు.. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతానని హామీఇచ్చి ముందుకు సాగారు. -
నేతన్నకు రుణమాఫీ
సాక్షి, వరంగల్ రూరల్ : చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.లక్షలోపు వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలో నెరవేరనుంది. ఆ హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయిలో లబ్ధిదారుల గుర్తిం పుతోపాటు రుణమాఫీ అమలు చేస్తే వర్తించే బ్యాంకులు, లబ్ధిదారుల స్టేటస్ తదితర సమగ్ర వివరాలతో జిల్లా కమిటీ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికను కలెక్టర్ ఆమోదంతో చేనేత జౌళిశాఖ రాష్ట్ర శాఖకు నివేదికను అందించారు. రుణమాఫీ చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,167 మంది చేనేత కార్మికులకు రూ.7.27 కోట్ల లబ్ధి చేకూరనుంది. రెండు విధాలుగా రుణ మాఫీ.. 1 ఏప్రిల్, 2010 నుంచి 31 మార్చి 2017 వరకు చేనేత కార్మికులు పొందిన రుణాల్లో లక్ష రూపాయల్లోపు రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూల రుణ మొత్తాన్ని చేనేత జౌళి శాఖ భరిస్తే, వడ్డీ మొత్తాన్ని బ్యాంకులు భరిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాల పరిమితిలో రుణం పొంది అప్పులు తిరిగి చెల్లించిన వారికి రూ.లక్ష రీయింబర్స్మెంట్ చేయనున్నారు. ఈ పథకం కింద బ్యాంకుల్లో రుణాలు పొందిన చేనేత కార్మికులకు రూ.లక్ష ప్రయోజనం కలుగుతుండడం గమనార్హం. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులతో రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల ఖరారు.. ఈ పథకం అమలు కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా లీడ్ బ్యాంక్ మేనేజర్, చేనేత జౌళి శాఖ అధికారి, నాబార్డ్ ఏజీఎం, డీసీసీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార శాఖ ఆడిట్ అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ జిల్లాలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి చేనేత రుణాలు పొందిన వారి వివరాలు సేకరించి ఇటీవల నేతన్నకు రుణమాఫీఆయా జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల గుర్తించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత ఈ నెల 30న రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసే ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వానికి నివేదికలు పంపాం చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేయనున్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ రుణమాఫీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారందరివి ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. –రమేష్, చేనేత జౌళి శాఖ ఏడీ, వరంగల్ రూరల్ -
త్వరలో జిల్లా స్థాయి నేతన్నల సదస్సులు
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి నేతన్నల సదస్సులు ప్రతి జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, వృత్తి అభివృద్ధి పథకాలను వివరించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చేనేత, వస్త్ర పరిశ్రమ రంగాల అభివృద్ధిపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం సచివాలయంలో కేటీఆర్ సమీక్షించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని చేనేత కార్మికుల సమస్యలపై చర్చించారు. సిద్దిపేట జిల్లాలో నేతన్నల తొలి సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేటీఆర్, హరీశ్‌రావు సూచించారు. గొల్లభామ చీరలకు ఆదరణ సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందని, వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలలో ఈ చీరలను అందుబాటులో ఉంచుతామన్నారు. సిద్దిపేటలో గొల్లభామ చీరలు నేసే 30 మంది చేనేత కార్మికులకు జఖాత్‌లు ఇవ్వాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని చేనేత కార్మికులకు నిర్వహణ పెట్టుబడి త్వరగా అందించాలని సూచించారు. పూచీకత్తు లేకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం అందించే అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ ఆదేశించారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ సజావుగా అందేలా చూడాలన్నారు. జిల్లాల వారీగా ఎంతమందికి రుణమాఫీ జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రుణ మాఫీపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సిద్దిపేట, దుబ్బాకలో చేనేత క్లస్టర్.. సిద్దిపేట, దుబ్బాకలో ప్రత్యేక చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని, దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటల్లో అసంపూర్తిగా ఉన్న చేనేత సొసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావు కోరగా, కేటీఆర్ అందుకు అంగీకరించారు. నేతన్నల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా నేతన్నల జీవితాల్లో మార్పు వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు, యూనిఫాంల సరఫరా, వివిధ ప్రభుత్వ శాఖలు జరిపే వస్త్ర సేకరణ ఆర్డర్ల ద్వారా నేతన్నలకు చేతి నిండా పని దొరుకుతుందని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునీకరణ వంటి పథకాలతో నేతన్నలకు ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయనున్న చేనేత చీరలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులు చూపించగా.. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేతన్నకు భరోసా ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘నేతన్నల పరిస్థితిపై అంచనా లేని గత ప్రభుత్వాలు వారిని గాలి కొదిలేశాయి. దీంతో వారి జీవితాలు దుర్భ రంగా మారిపోయాయి. మా ప్రభుత్వం నేతన్నల జీవితాలను మెరుగుపరిచే చర్యలు విజయవంతంగా అమలు చేస్తోంది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత రంగానికి ప్రోత్సాహంపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ‘ప్రపంచ వస్త్ర ఉత్పత్తిలో దేశ వాటా 4 శాతమే. కాని చైనా 35 శాతాన్ని మించింది. బంగ్లాదేశ్ 14%తో ముందుంది. మనం చైనాతో పోటీపడేలా నేత పరిశ్రమ లను ప్రోత్సహించాలి. అందుకే వరంగల్‌లో 1,200 ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశాం. కానీ దీనికి కేంద్రం నుంచి సహకారం కరువైంది’అని వివరించారు. గుండ్లపోచంపల్లిలోని అపెరల్ పార్కు 20 వేల మందికి ఉపాధినిచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. కార్మికులు కాదు.. కళాకారులు చేనేత పని వారిని కార్మికులు అనకూడదని, కళాకారులుగా అభివర్ణించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అంత అద్భుత పనితనం వారిలో ఉందని, కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో వారివి వలస బతుకులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘2002లో భూదాన్‌పోచంపల్లిలో వారం రోజుల్లో ఏడుగురు నేతన్నల ఆత్మహత్యతో కేసీఆర్ చలించిపోయారు. నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో జోలపట్టి రూ.మూడున్నర లక్షలు వసూలు చేసి సాయం చేశారు. 2007లో సిరిసిల్లలో మరమగ్గం నేతలు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో టీఆర్ఎస్ పక్షాన రూ.50 లక్షలతో ట్రస్టు ఏర్పాటు చేసి సూక్ష్మ రుణాలకు అవకాశం కల్పించడం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం. తాజాగా రూ.1,200 కోట్ల బడ్జెట్ కేటాయించాం. చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.40 కోట్లు కేటాయించాం.రుణాల్లో సబ్సిడీ మొత్తాన్ని 50 శాతానికి పెంచాం’అని వివరించారు. రాష్ట్రంలో ఎన్ని చేనేత, మరమగ్గం నేత కుటుంబాలున్నాయో లెక్కలు తీసి చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,523 చేనేతమగ్గాలు, 35,000 మరమగ్గాలున్నాయని పేర్కొన్నారు. వస్త్రాన్ని మేమే కొంటాం చేనేత పని వారు ఏటా 4.08 కోట్ల మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని, మరమగ్గాల ద్వారా 63 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతోందని కేటీఆర్ తెలిపారు. పాఠశాలలు సహా భవిష్యత్ సింగరేణి, ఆర్టీసీ కార్మికుల యూనిఫామ్స్‌కు కూడా వారి నుంచే వస్త్రాలు కొంటామని చెప్పారు. బతుకమ్మ చీరల పేరుతో మరమగ్గాల ద్వారా నేసిన చీరలు కొంటున్నామని చెప్పారు. నేతన్నలకు పొదుపు పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎంత వాటా పొదుపు చేస్తే అంతకు రెట్టింపు ప్రభుత్వం జోడించి జమ చేస్తోందని పేర్కొన్నారు. 36 వేల మందికి ఆసరా పింఛన్ ఇస్తున్నామని, గద్వాలలో రూ.15 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమంత ఒక్క రూపాయి తీసుకోవట్లేదు నేత పరిశ్రమకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీనటి సమంత ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సమంతను నియమించడంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, దీని వెనక వేరే ఎజెండా లేదని సభ దృష్టికి తెచ్చారు. పట్టు పరిశ్రమకు కూడా చేయూత అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు సహా అధికార పార్టీ సభ్యులు కలిపి మొత్తం తొమ్మిది మంది ఈ చర్చలో తమ అభిప్రాయాలు సభ ముందుంచారు. -
‘లండన్’ మనసు దోచిన ‘గొల్లభామ’
సాక్షి, సిద్దిపేట: చేనేత కార్మికుల ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. సిద్దిపేట మగ్గాలపై నేసిన గొల్లభామ డిజైన్లతో ఉన్న చీరలను లండన్ మగువలు, ప్రవాస భారతీయులు మెచ్చుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లండన్‌లో వివిధ దేశాల కళాకృతులు, హస్తకళల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో గొల్లభామ చీరలను ఉంచారు. ఈ ప్రదర్శనను ప్రవాస భారతీయ సంతతికి చెందిన లండన్ ఎంపీలు సీమా మల్హోత్రా, వీరేంద్రశర్మతో పాటు అక్కడి ప్రజాప్రతినిధులు, మహిళలు గొల్లభామ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మల్హోత్రా, వీరేంద్రశర్మ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే గొల్లభామ చీరల స్టాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్‌గౌడ్ అంతటి మాట్లాడుతూ, తెలంగాణ చేనేత కార్మికులు ప్రపంచ దేశాలు అబ్బురపడేలా చీరలు తయారు చేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో గొల్లభామ చీరల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. -
నేతన్నకు సర్కారు భరోసా
దుబ్బాక: గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పట్టించుకోలేదని, ఫలితంగా నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలసి మంత్రి పరిశీలించారు. అందులో పని చేస్తున్న కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బడ్జెట్లో చేనేత రంగానికి రూ.1,200 కోట్లు కేటాయించి తమ ప్రభుత్వం చరిత్రలో నిలిచిందన్నారు. వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో చేనేత కార్మికులకోసం చేపడుతున్న అపెరల్, టెక్స్టైల్ పార్క్‌ల తరహాలో దుబ్బాకలో కూడా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూలు, రసాయనాలు, ఇతర ముడిసరుకులను 50 శాతం సబ్సిడీపై చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మరుగునపడుతున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి, నైపుణ్యాలను వెలికి తీయడానికే రాష్ట్ర ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంతను నియమించిందన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేనేత, పవర్లూమ్లకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తోందన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని అక్కడున్న అధికారులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి సూచించారు. దీంతో చేనేత కార్మికులకు పరోక్షంగా ఉపాధిని ఇచ్చినవాళ్లమవుతామన్నారు. దుబ్బాక చేనేతలకు రూ. 1.56 కోట్ల రుణాల మాఫీ దుబ్బాక సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులకు సంబంధించిన రూ. 1.56 కోట్ల రుణాలను ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు మాఫీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేటలోని చేనేత కార్మికుల రుణాల విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తన దృష్టికి తెచ్చారని, వారికి కూడా రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకరావడానికి కోటి రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తామని హామీనిచ్చారు. బిడ్డా బాగున్నావా.. మాది మీ ఊరే! కేటీఆర్‌ను ఆప్యాయంగా పలకరించిన వజ్రవ్వ దుబ్బాక టౌన్: ‘ఏం బిడ్డా మంచిగున్నవా.. చిన్నప్పుడెప్పుడో చూసిన.. చాన ఏండ్లయింది నిన్ను చూడక...మాదీ మీ వూరే చింతమడక. చిన్నప్పుడు మీ నాయన చంద్రశేఖర్‌రావుతో కలసి మీ బాయికాడ మోటకొట్టేటోళ్లం’అంటూ దుబ్బాకకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను బ్యాగరి వజ్రవ్వ ఆప్యాయంగా పలకరించారు. దుబ్బాక చేనేత సహకార సంఘానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసి, ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద పనిచేసే వజ్రవ్వ అక్కడకు వెళ్లి పలకరించింది. మంత్రి ఆమె చెప్పిన విశేషాలను ఆసక్తిగా ఆలకించారు. ‘నాదీ చింతమడ్కనే.. లగ్గం అయి దుబ్బాకకు వచ్చిన. చిన్నప్పుడు మీ ఇంటివద్ద, బాయికాడ పనిచేసేదాన్ని’అంటూ వజ్రవ్వ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ‘పాణం ఎలా ఉంది? ఇప్పుడేం చేస్తున్నావు’అంటూ కుశలం అడిగారు. నాయన కేసీఆర్‌ను కలిపిస్తానంటూ చెప్పడంతో వజ్రవ్వ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. -
360 గజాల చీర తయారీ
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్ : అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. ఇప్పుడు మరో రికార్డు నేతన్నలు సృష్టించారు. చేనేత గ్రామమైన బండార్లంకలో 360 గజాల ఎరుపు రంగు చీరను తయారు చేశారు. సాధారణ చేనేత చీర ఆరు నుంచి ఏడు గజాల వరకు తయారు చేస్తారు.అయితే ఈ కార్మికులు ఏకంగా 360 గజాల చీరను తయారు చేసి అబ్బురపరిచారు. ఈ భారీ చీర తయారీలో గ్రామంలోని చేయి తిరిగిన నేతలన్నలు నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు పూర్తి చేశారు. జిల్లాలో చేనేతకు ప్రసిద్ధి చెందిన బండార్లంకలో 360 గజాల చేనేత చీర తయారీకి ఇటీవల శ్రీకారం చుట్టారు. 360 గజాల అతిపెద్ద పడుగుతో పట్టిన అతిపెద్ద అల్లికను చూసేందుకు జనం తరలివచ్చారు. పసుపు రంగు పడుగుపై కుంకుమ రంగు పెనవేసి పవిత్రంగా ఈ చీరను నేశారు. కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చింతా శంకరమూర్తి, చేనేత సొసైటీ అధ్యక్షుడు పుత్సల వరద రాజులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు కాపటవీధిలో కొబ్బరికాయ కొట్టి ఈ చీర తయారీని ప్రారంభించారు. అల్లు పనిలో లింగ వయోభేదం లేకుండా కార్మికులందరూ పాల్గొన్నారు. మంగళవారం చీరను ప్రదర్శించారు. మగ్గంపై నెయ్యడానికి 50 రోజులు సమయం పట్టిందని సత్యనందం తెలిపారు. ఈ చీరను గ్రామదేవత గంగాదేవి మురుగులమ్మవారికి మార్చి 18న ఉగాది రోజున సమర్పిస్తామని సొసైటీ అధ్యక్షుడు వరదరాజులు చెప్పారు. అనంతరం గ్రామంలోని ముత్తయిదువులు, ఆడపడుచులు, పెద్దలకు చీరలను 60 మందికి పంపిణీ చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచి బడుగు సత్యనారాయణ, చింతపట్ల గంగా సత్యనారాయణ, యాళ్ల సుబ్రహ్మణ్యం, బట్లు బాలకృష్ణ పాల్గొన్నారు. -
కౌశల్ వికాస్‌కు దరఖాస్తు చేసుకోండి
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జయరామయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికులకు మరమగ్గాల్లో వారి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఆర్పీఎల్లో అధునాతనమైన డిజైన్స్ నేర్పించడంతోపాటు డిజిటల్ లెర్నిం గ్, మొబైల బ్యాంకింగ్, ఈ–కామర్స్ వంటి తదితర రంగాలలో శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ఆసక్తిగల చేనేత మరమగ్గాలకు చెందిన కార్మికులందరూ తమ పేరు, తండ్రి పేరు, చిరునామా, ఆధార్‌కార్డుతోపాటు వృత్తి, బ్యాంకు వివరాలతో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 దినసరి ఇస్తామన్నారు. జిల్లాలో చేనేత కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఆదరణ–2కు దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలో బీసీ వర్గాలకు ఆదరణ–2కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు జయరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కార్మికులకు ఆదాయ వృద్ధి, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రూ. 2.5 లక్షల వరకు ఆధునిక ఉపకరణాలు (గుంతమగ్గాలు, పైమగ్గాలు, జాకాడ్ మగ్గాలు)ను అందించనున్నామన్నారు. మూడు సంవత్సరాల కాలంలో మగ్గాలలో లబ్ధిపొందని చేనేత కార్మికుల వివరాలను తమకు తెలుపాలన్నారు. జిల్లాలోని చేనేత వృత్తిపై జీవిస్తున్న వారు తమ పూర్తి చిరునామా, వృత్తి, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్, ఐఎస్ఎ‹ఫ్ కార్డు, ఏ మగ్గంపై పనిచేస్తున్నది తది తర వివరాలను సహాయ సంచాలకులు, చేనేత జౌళిశాఖ, డి–బ్లాక్, కొత్త కలెక్టరేట్లోని తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. -
చేనేతకు అండగా ప్రభుత్వం
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : చేనేత రంగానికి ప్రభుత్వం అండగా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పుట్టపాకలో శ్రీభావనాబుుషి మిశ్రమ చేనేత సహకార సంఘంలో సబ్సిడీపై నూలును, పాస్ పుస్తకాలను గురవారం కార్మికలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేనేతపై ప్రత్యేక దృష్టి పెట్టిందిన్నారు. స్టాండ్ మగ్గములు ఇప్పించాలని ఎమ్మెల్యేకు కార్మికులు విన్నవించారు. కార్యక్రమంలో పద్మశ్రీ ఆవార్డు గ్రహీత గజం గోవర్ధన్, జెడ్పీటీసీ సభ్యుడు బోల్ల శివశంకర్, వీవర్ సర్వీస్ సెంటర్ ఏడీ హిమేజ్‌కుమార్, సర్పంచ్ నల్లగొండ కళమ్మ, వర్కాల చంద్రశేఖర్, సంఘం ఆధ్యక్షురాలు సామల విజయలక్ష్మీభాస్కర్, గజం సత్యనారాయణ, కత్తుల లక్ష్మయ్య, మిర్యాల శ్రీను, గురునాధం, పరదేశి, రమేష్, ఉమాశంకర్, సాంబయ్య, తదితరలున్నారు. -
చేనేత రంగాన్ని పరిరక్షించాలి: పవన్
ధర్మవరం: కళాత్మక మైన చేనేత రంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ధర్మవరం పట్టుచీరలకు గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత సదస్సు నిర్వహించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ మాట్లాడుతూ దేశానికి నాగరికతను నేర్పిన చేనేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిట్టుబాటు ధర లేక ఈ మూడేళ్ల లో పదుల సంఖ్యలో చేనేతలు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సు ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే వరదాపురం సూరిని కలిశారు. -
ఆ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. కులవృత్తిపై ఆధారపడ్డ చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారికి చేయూత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్ దాసు, సలహాదారులు కుంటాల గంగాధర్ తిలక్, ఊర్మిళ, శ్రీనివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయని, కానీ ఈ సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వివరాలను తేల్చాలని, అనంతరం వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. -
45 ఏళ్లకే పింఛన్
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘చేనేతలు, బడుగు, బలహీన వర్గాల వారు పనులకు వెళ్తేనే కడుపు నిండుతుంది.. ఆరోగ్యం బాగోలేక ఇంటిపట్టున ఉంటే బతకలేని పరిస్థితి.. కాయ కష్టం చేయడంతో 40–50 ఏళ్ల మధ్యే కీళ్ల నొప్పులు మొదలవుతాయి.. ఒక్క ఏడాది ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ తర్వాత 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల(బడుగు, బలహీన వర్గాలు)లోని పేదలకు పింఛన్లు ఇస్తాం.. అదీ రూ.వెయ్యి కాకుండా రూ.2 వేలు ఇస్తాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం అనంతపురం జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం సమీపం లో రిలే దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను మంగళవారం జగన్ పరామర్శించి, దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే చాలా రోజులుగా దీక్షలు చేస్తున్నారని, ఇంటిల్లిపాదీ.. అక్కలు, చెల్లెళ్లు కూడా దీక్షల్లో పాల్గొన్నారని, ఎన్ని రోజులు దీక్షలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం కనికరించదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా విచ్చేసిన చేనేతలు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చేనేతలు రూ.వెయ్యి సిల్క్ రాయితీ కోసం 37 రోజులుగా టెంట్లు వేసుకుని దీక్షలు చేస్తుంటే చంద్రబాబుకు మనసు కరగలేదన్నారు. సిల్క్ రాయితీ బకాయిలు చెల్లించి, నెల నెలా సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. మోసం చేయడం బాబుకు కొత్త కాదు అనంతపురం జిల్లాలో 34 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లాలోని ధర్మవరం పట్టు పరిశ్రమ దేశంలోనే ప్రసిద్ధి. నాడు జగన్ ధర్మవరానికి వెళ్తున్నారు.. చేనేత కుటుంబాల ఇళ్లకు వెళతారని 11 మందికి ముష్టి వేసినట్లు సాయం అందించా రు. అందులోనూ రూ.5 లక్షల పరిహారం దేవుడెరుగు రూ.1.50 లక్షలు కూడా అందలేదు. జగన్ వెళ్లిపోయిన తర్వాత (భరోసా ముగిసిన తర్వాత) తిరిగి చేనేతలను పట్టించుకునే నాథుడే లేడు. ఇంత మంది చనిపోతే ఆదుకోవాలనే స్పృహ ప్రభుత్వానికి లేదు. చేనేత కుటుంబాల్లోని ఆడబిడ్డలు దీక్షలు చేస్తుంటే కూడా మనసు కరగలేదు. బాబు ప్రభుత్వం రాకముందు ముడి పట్టుపై రూ.600 రాయితీ వచ్చేది. ముడి పట్టు రూ.2,300 ఉన్నపుడు రూ.600 అంటే 25 శాతం సబ్సిడీ వచ్చేది. ఈ రోజు ముడి పట్టు ధర రూ.4 వేలకు పెరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 41 నెలలైంది. ఏడాది కిందట ఆయన ఇక్కడకు వచ్చి.. సబ్సిడీని రూ.600 నుంచి వెయ్యి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని నెలలు రాయితీ ఇచ్చారని శిబిరంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే.. బాబు రాక ముందు 13 నెలలు రాలేదన్నారు. రూ.వెయ్యి సబ్సిడీ ప్రకటించాక కేవలం రెండు నెలలు ఇచ్చారని చెప్పారు. రూ.వెయ్యి చొప్పున 10 నెలల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. దీక్ష చేస్తున్నవారి వద్దకు జగన్ వచ్చాడు అని తెలిసిన తర్వాతైనా బాబుకు జ్ఞానోదయమవుతుందని ఆశిద్దాం. మోసం చేయడం ఆయనకు కొత్త కాదు. రైతులు, విద్యార్థులు, పిల్లలు, అవ్వాతాతలు, చివరకు అన్ని కులాల వారినీ మోసం చేశారు. చేనేతలనైతే దారుణంగా వంచించారు ఇదే ఎన్నికల మేనిఫెస్టో (మేనిఫెస్టో చూపిస్తూ)లో మగ్గం పట్టుకుని, సినిమా ఫోజు పెట్టి చేనేత కార్మికులను మోసం చేసేందుకు నాంది పలికారు. చేనేత కార్మికుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ‘రుణాలు చెల్లించొద్దు. నేనొస్తున్నా.. చెల్లిస్తా’ అన్నారు. ఎంత మందికి రుణాలు మాఫీ అయ్యాయని అడుగుతున్నా? రైతులకు సంబంధించి రూ.87,612 కోట్ల రుణాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చింది దాని వడ్డీకి కూడా సరిపోలేదు. చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం కేవలం రూ.390 కోట్లు. కనీసం ఇదైనా మాఫీ చేస్తారనుకుంటే ఇందులో కత్తిరింపులు వేసి రూ.110 కోట్లకు తగ్గించారు. అందులోనూ కేవలం రూ.70 కోట్లు ఇచ్చి చేతులెత్తేశారు. ఒక్కో చేనేత కార్మిక కుటుంబానికి రూ.లక్ష వరకు తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామన్నారు. బ్యాంకులకు వెళితే రుణం అందుతుందా అని అడుగుతున్నా? రుణమిస్తామనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రతీ చేనేత కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇల్లు, మగ్గం ఏర్పాటు చేస్తామన్నారు. ఉచితంగా ఇల్లు కట్టించి, షెడ్డు నిర్మించారా? అని అడుగుతున్నా. (జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రతీ ప్రశ్నకు ప్రజల నుంచి ‘లేదు.. లేదు..’ అని సమాధానం వచ్చింది) ఇలా చంద్రబాబు చేసిన మోసాల గురించి చెబుతూ పోతే చాలా ఎక్కువగా కన్పిస్తాయి. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలి? ఇచ్చారా? అని అడుగుతున్నా. బ్యాంకు లేదు.. నిధి లేదు. తుదకు ఇస్తున్న సబ్సిడీని కూడా కత్తిరించారు. అందరం ఒక్కటవుదాం.. ప్రతీ జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. కడపలో నాకైతే కన్పించలేదు. మీకు అనంతపురంలో ఎక్కడైనా చేనేత పార్కు కన్పించిందా? అని అడుగుతున్నా. ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తానన్న చంద్రబాబు 2014 – 15 బడ్జెట్లో రూ.98 కోట్లు, 2015 – 16లో రూ.120 కోట్లు మాత్రమే కేటాయించారు. ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ ఉండేది. రూ.30 వేల వరకూ వైద్యం అందేది. ఈ ముఖ్యమంత్రి పుణ్యమా అని ఆ భరోసా కూడా పోయింది. చేనేత కార్మికులంతా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఆప్కో అనే పేరు ఎక్కడైనా కనిపిస్తోందా? ఓ వైపు ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయి. మరో వైపు చీరల ధరలు మాత్రం పెరగడం లేదు. కార్మికులు మూడు రోజులు కష్టపడితే రూ.500 వస్తోంది. దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ఈ ప్రభుత్వ పాలనలో ఏం చేసినా వారికి కన్పించడం లేదు.. విన్పించడం లేదు. ఈ దుర్మార్గపు పాలన పోయే రోజు దగ్గరలోనే ఉంది. అందరం ఒక్కటై మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఏడాదిలో ఎన్నికలు వస్తాయని ఆయనే పదిసార్లు చెప్పారు. అప్పటి వరకూ కలసి కట్టుగా పోరాడి చంద్రబాబు మెడలు వంచుదాం. ఇందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని జగన్ అన్నారు. సభ అనంతరం అనంతపురానికి చెందిన పారిశ్రామికవేత్త శివారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. మెరుగైన పాలన అందిస్తాం ‘‘ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించాం. ఎన్నికలకు ఏడాదికి పైగా గడువు ఉందని, రూ.2 వేలు పింఛన్ ఇస్తామని మనం ఇప్పుడే ప్రకటించడం వల్ల చంద్రబాబు కూడా అంతే మొత్తం పెంచే అవకాశం ఉందని ఆ తర్వాత పలువురు నాతో అన్నారు. నిజంగా ఆయన అలా చేయాలని నేను ఛాలెంజ్ విసురుతున్నా. అలా చేస్తే పేదవాడికి మేలు జరుగుతుంది. అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే అన్నాను. ఈ డబ్బులు వారి ఆస్పత్రి ఖర్చులకు పనికొస్తాయి. మానవత్వంగా ఆలోచించాలని చెప్పా. ఆయన అలా పెంచితే.. జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించాకే చేసినట్లవుతుందని చెప్పాను. బాబు కంటే గొప్పగా, మెరుగైన పాలన అందిస్తామని మీ అందరికీ భరోసా ఇస్తున్నా. చేనేతలను ఆదుకుంటాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు ప్రతీ నెల రూ.2 వేలు సిల్క్ రాయితీ ఇస్తాం. రూ.1.50 లక్షలతో ఇల్లు కట్టిస్తాం. ప్రతీ చేనేత కార్మికుడికి తోడుగా ఉంటాం. రూ.390 కోట్లలో మిగిలిన అప్పులు మాఫీ చేస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 50 ఏళ్లకు పింఛన్ ఇచ్చారు.. మేము అధికారంలోకి రాగానే 45 ఏళ్లకే చేనేతలతో పాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలలోని బడుగు, బలహీనవర్గాలకు పింఛన్లు ఇస్తాం. ఆ పింఛన్ కూడా రూ.వెయ్యి కాకుండా రూ.2 వేలకు పెంచుతాం. వడ్డీ లేకుండా రూ.లక్ష అప్పు ఇప్పిస్తాం. ఇందుకు బ్యాంకర్లు ఒప్పుకోకపోతే హ్యాండ్లూం కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా రుణం ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లూ కన్పించలేదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా పేద వాళ్లకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. గ్రామాల్లో నిల్చుని ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవకుండా అందరికీ న్యాయం చేస్తాం. -
చేనేతలకు చేయూత కరువు.!
►జిల్లాలో 40 వేలకుపైగా చేనేత కార్మికులు ►ముద్ర రుణాల పేరుతో అరకొరగా రుణం ►బ్యాంకర్ల తీరుపై సర్వత్రా విమర్శలు చేనేత కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. జిల్లాలో చేనేత కార్మికుల కుటుంబాలు దాదాపు 40 వేల వరకు ఉన్నాయి. వారంతా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయితే చేనేతలకు ప్రోత్సాహం అందించి ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కార్మికుల అభివృద్ధిని ఆకాంక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం.. నేల చూపులు చూస్తోంది. జమ్మలమడుగు/ జమ్మలమడుగు రూరల్ : జిల్లాలో వెయ్యి మంది చేనేతలకు ముద్ర రుణాలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఒక్కో చేనేత కార్మికుడికి రూ. 50 వేల వరకు బ్యాంకర్లు రుణం ఇవ్వనున్నట్లు ఏడీ జయరామయ్య తెలిపారు. అయితే జిల్లాలో ఉన్న చేనేతల సంఖ్యకు.. అధికారులు మంజూరు చేస్తున్న రుణాల సంఖ్యకు వ్యత్యాసం భారీగా ఉండడంతో ప్రభుత్వ తీరుపై చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగులోనే అత్యధికం.. జిల్లా వ్యాప్తంగా జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం గ్రామాలతో పాటు పెద్దముడియం మండలంలో బీటీ పాడు, కొండాపురం మండలంలోని దత్తాపురం, ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు, యామవరం, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలల్లో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. జమ్మలమడుగులో 300 మందికే రుణాలు.. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ముద్ర పథకం కింద 300 మందికి మాత్రమే రుణాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఒక్క జమ్మలమడుగు నియోజకవర్గంలోనే దాదాపు 10వేలకు పైగా చేనేత కుటుంబాలు నివాసం ఉన్నాయి. వీరిలో కేవలం 3 శాతం మందికి మాత్రమే రుణాలను మంజూరు చేయడంపై మిగిలిన వారు మండిపడుతున్నారు. చేనేతలంటే అంత అలుసా..? చేనేతలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవసరమైన రుణం మంజూరు కోసం బ్యాంకర్లు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని చేనేత కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 2015–16 సంవత్సరంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేసిన క్రెడిట్ కార్డుల మేరకు.. ఒక్కో కార్మికునికి వ్యక్తిగతంగా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇవ్వాలి. అయితే బ్యాంకర్లు మాత్రం షూరిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 50 వేలకు రూ.30 వేలు మాత్రమే... చేనేత కార్మికులకు బ్యాంకు అందజేసే రుణ మొత్తంలో రూ. 20 వేలను తమ వద్దే ఉంచుకోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రూ.50వేలు రుణం ఇవ్వాల్సి ఉండగా కార్మికుడికి రూ.30వేలను అందజేసి షూరిటీ పేరుతో రూ.20 వేలను బ్యాంకర్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీనికితోడు వీవర్స్ క్రెడిట్ కార్డు కలిగిన కార్మికులకు ఆరు శాతం మాత్రమే వడ్డీ వసూలు చేయాల్సి ఉంది. కానీ, బ్యాంకర్లు 12 శాతం వడ్డి విధిస్తూ.. తమ వద్ద ఉన్న రూ. 20 వేల షూరిటీ మొత్తానికి 8 శాతం వడ్డీ మాత్రమే ఇస్తుండడంపై విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు కూడా బ్యాంకర్లకే వత్తాసుపలుకుతుండడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బ్యాంకర్లు మోసం చేస్తున్నారు కార్మికులకు రుణాలను పూర్తి స్థాయిలో ఇవ్వకుండా బ్యాంకర్లు వింత నిబంధనలు పెట్టి మోసం చేస్తున్నారు. బ్యాంకు అందజేసే రూ.30 వేలతో ఏవిధంగా చేనేతలు అభివృద్ధి చెందుతారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. బ్యాంకర్లు అన్యాయంగా వ్యవహరిస్తున్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. – బడిగించల చంద్రమౌళి, చేనేత కార్మిక సభ్యుడు, జమ్మలమడుగు రుణ మొత్తాన్ని అందజేయాలి.. చేనేత మగ్గాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రూ.50 వేలకు పైగా ఖర్చవుతుంది. అలాంటిది బ్యాంకర్లు కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తుండడంతో ఆ మొత్తాన్ని ఏ విధంగా అభివృద్ధికి వినియోగించుకోవాలో అర్థం కావడం లేదు. ఈ విధంగా అరకొరగా రుణాలు ఇచ్చినా... ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. – జొల్లు కొండయ్య, మోరగుడి -
చేనేతకు చేయూత
భూదాన్‌పోచంపల్లి/ చౌటుప్పల్: చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తానని పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్ చెప్పా రు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును సందర్శించారు.మగ్గాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ... పోచంపల్లి ఇక్కత్ వస్త్రా లకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ తగిన మార్కెటింగ్ లేక అవకాశాలను అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నెల 18న కేరళలో జరిగే దక్షిణ భారత ఫ్యాషన్ షోలో పోచంపల్లి గౌను ధరించి జడ్జిగా పాల్గొనబోతున్నానని, అలాగే ఓ హాలివుడ్ సినిమాలో సైతం పోచంపల్లి వస్త్రాలను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
చేనేతకు ఆర్థిక భద్రత
భూదాన్ పోచంపల్లిలో నేతన్నకు చేయూత పథకం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ భూదాన్ పోచంపల్లి: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించడానికి త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని (పొదుపు నిధి) తెచ్చినట్లు ఐటీ, చేనేత జౌళిశాఖ మంత్రి కె.తారకరామారావు తెలి పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ‘నేతన్నకు చేయూత’ పేరిట త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్నతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చిన్నప్పటి నుంచి చేనేత కార్మి కుల బాధలను ప్రత్యక్షంగా చూశారని, వారి కన్నీళ్లు తుడవడానికే రూ.70కోట్లున్న బడ్జెట్‌ను రూ.1,283 కోట్లకు పెంచారన్నారు. 2002లో పోచంపల్లిలో చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు జరి గినప్పుడే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇక్కడికి వచ్చి జోలపట్టి రూ.3.50లక్షలు విరాళాలు సేకరిం చి ఏడుగురు బాధిత కుటుంబాలకు అందించారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితో చేనేత కార్మికులకు మరింత భరోసా కల్పించడానికి సీఎం ఆదేశాల మేరకు పోచంపల్లిలో త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ప్రారంభించినట్లు కేటీఆర్ వివరించారు. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే... ఈ పథకంలో చేరేందుకు 18 ఏళ్లు నిండి చేనేత వృత్తిపై ఆధారపడిన ప్రతి కార్మికుడు అర్హుడేనని కేటీఆర్ తెలిపారు. కార్మికుడు వేతనంలో 8 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 16శాతాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా అతడి ఖాతాకు జమ చేస్తుందన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 30 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. అంతేకాక 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు, రసాయనాలు అందిస్తామన్నారు. నేత కార్మికులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కార్మికులు నేసిన బట్టను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకు ‘బై బ్యాక్’ పాలసీని తెస్తున్నామన్నారు. కార్మికుడికి కనీసం రూ.15వేలకు తగ్గకుండా వేతనం అందిం చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను వరంగల్‌లో త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారం భించనున్నట్లు చెప్పారు. అలాగే రూ.30 కోట్లతో సిరిసిల్లలో అపెరల్ పార్క్, జమ్మికుంట, కమలా పూర్, దుబ్బాకల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయను న్నట్లు చెప్పారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ కేవలం 3.87 శాతం వస్త్రోత్పత్తులు చేస్తూ వెనుకబడి ఉన్నా మన్నారు. అదే పొరుగుదేశమైన బంగ్లాదేశ్ 10 శాతం, చైనా 30 శాతం వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తుందన్నారు. చేనేత, టెక్స్టైల్ పరిశ్రమపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని గట్టిగా కోరామని, ప్రస్తుతం ఢిల్లీ పర్య టనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తారన్నారు. అనంతరం స్థానిక టూరిజం పార్క్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీ, చైతన్య భారతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత డిజిటల్ సాధికారత కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి çసునీత, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కె.ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఫ్లోరోసిస్ పాపం గత పాలకులదే... ‘‘జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి 6, 7 ఫీట్ల పొడవున్నారు.. గతంలో మంత్రులుగా నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించారు.. కానీ ఏంలాభం.. తలాపునే కృష్ణానది పోతు న్నా, నాడు గుక్కెడు నీళ్లు అందించలేదు’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. జిల్లాలో రెండు లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారంటే ఆ పాపం గత పాలకులది కాదా అని ప్రశ్నించా రు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా కోసమే రూ.9వేల కోట్లు తీసుకెళ్తుంటే మంత్రివర్గంలో ఉండి సంతకాలు పెట్టింది వీరు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మిషన్ భగీరథ కింద తాగునీరు అందిస్తుంటే స్కామ్ భగీరథ అని వారు విమర్శిస్తున్నారన్నారు. -
చేనేత కార్మికులకు వైఎస్ జగన్ భరోసా
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం చేనేత కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు వైఎస్ జగన్‌కు వివరించారు. తమ సమస్యలను ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని వినతిపత్రం అందజేశారు. దీంతో చేనేతన్నలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. -
చేతివృత్తులకు పెద్దపీట
► గ్రామాల్లో ఉపాధి పెంచేందుకు కృషి ► రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నేరడిగొండ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు కుల, చేతివృత్తులకు రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గృహ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం వడూర్ గ్రామంలో మంత్రి పర్యటించి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ శోభారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలోని పురాతన నగరేశ్వరాలయ అభివృద్ధికి, మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేతి, కులవృత్తులపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణమైన అవగాహన ఉన్నందునా పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాల అభివృద్ధితో పాటు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, రైతులకు మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. సర్కారుపై ఆరోపణలు చేయడం విపక్షాలు మానుకోవాలన్నారు. వడూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు వారు తెలిపారు. తహసీల్దార్ కూనాల గంగాధర్, ఎంపీడీవో మహ్మద్ రియాజొదీ్దన్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేశ్‌చక్రవర్తి, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, ఉపాధ్యక్షుడు చిల్కూరి లక్ష్మణ్, వీడీసీ అధ్యక్షుడు ఆదుముల్ల భూషణ్, టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, శంకర్, పోశెట్టి, పండరి, గంగారెడ్డి, రవీందర్, శంకర్, రాంపెదబాపు, రాములు, నారాయణ్‌సింగ్, జహీర్, భోజన్న, కమల్‌సింగ్, కపిల్‌దేవ్, పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక లాభాలు తలమడుగు (భీంపూర్): రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని, దీంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండలం ధనోర గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పత్తి, సోయాబీన్, జొన్న తదితర పంటలను ఏటా పండించడం ద్వారా దిగుబడి రాక నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి చేసి పసుపు, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలను వేయాలని సూచించారు. ధనోర గ్రామంలోని గోవర్ధన్ యాదవ్, పంట మార్పిడితో పసుపు, అల్లం, మిర్చి సాగు చేసి అధిక దిగుబడి సాధించగా ఈ సందర్భంగా ఆయనను మంత్రి సన్మానించారు. గోవర్ధన్ యాదవ్‌ను రైతులంతా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి జిల్లాలో పసుపు మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాడిపరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, గ్రామ సర్పంచ్ శంకర్, తహసీల్దార్ రాజేశ్వర్, ఆత్మ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్
హైదరాబాద్ : చేనేత కలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన పవర్ లూమ్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమంపై సీఎం వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్, గోదాంలు ఏర్పాటుచేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్‌తో వరంగల్‌కు మహర్దశ రానుందన్నారు. రాబోయే బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. -
అవి సర్కారు హత్యలే
- చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులపై సీపీఐ నేత నారాయణ - ఇందిరా పార్కు వద్ద చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో ధర్నా - వెంటనే చేనేత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ హైదరాబాద్: చేనేత కార్మికుల ఆత్మ హత్యలు, ఆకలి చావులు సర్కారు హత్య లేనని, వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. చేనేత విధా నం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద చేనేత కార్మి కులు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా చేనేత కార్మికులు ధర్నా శిబిరం వద్ద మగ్గాలపై వస్త్రాలు నేస్తూ, మహిళలు రాట్నాలపై పనిచేస్తూ నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి నారాయణ మాట్లా డుతూ.. పాలకులు దేవుళ్లకు పట్టువస్త్రాలు సమర్పించి భక్తిని చాటుకుంటారే తప్ప.. వాటిని నేసే చేనేత కార్మికులపై మాత్రం వారికి భక్తి ఉండదని అన్నారు. తిరుపతి వెంకన్న, బెజవాడ అమ్మ వారికి రూ.కోట్ల ఆభరణాలు సమర్పించాలనుకునే కేసీఆర్.. ఆ డబ్బును చేనేత కార్మికులకు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాలకు బడ్జెట్లో నిధులుంటాయి కానీ.. చేనేతకు మాత్రం నిధుల కేటాయింపు ఉండదని, చేనేతకు సహాయం అనేది వృత్తికి సంబంధించినది కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. చేనేత సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పోరాటం చేయాలని, ఇందుకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చేనేత కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని, సమగ్రమైన చేనేత విధానాన్ని ప్రకటించాలని, సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సహకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సీపీఎం నాయకుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ గిట్టుబాటు కూలీ లభించక అనేక మంది చేనేత కార్మికులు వలస పోతున్నారని వాపోయారు. కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ మనిషికి నాగరికత నేర్పిన చేనేత కార్మికులు ప్రస్తుతం సమస్యల పరిష్కారం కోసం రోడ్డు ఎక్కాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక నాయకులు ధనుంజయ, గడ్డం జగన్నాథం, సిల్వేరు కాశీనాథ్, గోశిక యాదగిరి, పాశికంటి లక్ష్మీనర్సయ్య, వెంకటేష్, కూరపాటి రమేష్, గర్ధాసు బాలయ్య, సత్యనారాయణ, రాంచంద్రం, నరేందర్, కాశీనాథం తదితరులు పాల్గొన్నారు. -
ఆ'ధారం' కావాలి
నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు కొత్త జిల్లా ఆవిర్భావం ఫలితం సిరిసిల్ల : సిరిసంపదలతో తులతూగిన శ్రీశాల ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. దానిని సంక్షోభంలోంచి గట్టెక్కించేందుకు రాజన్న జిల్లా ఏర్పాటుతో మార్గం సుగమమైంది. మరమగ్గాల మధ్య పన్నెండు గంటలపాటు అలుపెరగకుండా శ్రమించే వారికి పూటగడవడం గగనమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 42వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 33 వేలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 24 వేల చేనేత మగ్గాలపై ఆధారపడి 30వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్(మరమగ్గాల)పై మరో 25 వేల మంది పనిచేస్తున్నారు. వస్త్రపరిశ్రమలోని సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలపై కథనమిదీ.. ఇదీ నేతన్న బతుకు.. శివనగర్‌లో సాంచాలు నడుపుతున్న ఇతడి పేరు కొండబత్తిని సూర్యనారాయణ(46). భీమదేవరపల్లి మండలం కొప్పూరు స్వగ్రా మం. ఉపాధి కోసం ఆరేళ్లక్రితం సిరిసిల్ల వచ్చి పాలిస్టర్ మరమగ్గాల్లో పని చేస్తున్నా డు. అంతకు ముందు 20 ఏళ్ల పాటు భీవండిలో పనిచేశాడు. భార్య విజయ, కుమారుడు, కూతురు ఉన్నారు. రోజూ 12 గంటలు పనిచేస్తే నెలకు రూ.10వేల వరకు వేతనం వస్తుంది. గైర్హాజరైన రోజు వేతనంకోత ఉంటుంది. పిల్లల చదువులు, ఇంటిఅద్దెకు, నిత్యావసరాలు, కరెంట్ బిల్లుకు వేతనం సరిపోవడంలేదు. అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం అప్పు చేయకతప్పదు. నేత కార్మికులకు ఇచ్చే 35 కిలోల బియ్యం(ఏఏవై) కార్డు లేదు. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఇది ఒక్క సూర్యనారాయణ దుస్థితే కాదు.. ఇతడితోపాటే పనిచేసే చిప్ప విజయ్‌కుమార్(35)దీ ఇదే పరిస్థితి. ఇలా మరమగ్గాల మధ్య పని చేసే కార్మికుల అందరిదీ ఇదే దుస్థితి. పెత్తనమంతా పెట్టుబడిదారులదే.. వస్త్రపరిశ్రమలో మూడంచెల విధానం కొనసాగుతోంది. మిల్లుల ద్వారా యజమానులు (మాస్టర్ వీవర్స్) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములను నింపి ఆసాముల (వీవర్స్)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేశాక ఆ గుడ్డను మళ్లీ యజమానులకే విక్రయిస్తారు. ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులకు ఉపాధి కల్పిస్తారు. మగ్గాల యజమానే కరెంటు బిల్లులు భరిస్తాడు. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. 50మంది వరకు యజమానులు, 5 వేల మంది ఆసాములు ఉన్నారు. వీరితోపాటు 25వేల మంది కార్మికులు వస్త్రపరిశ్రమలో పని చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. పెత్తనమంతా పెట్టుబడిదారులదే. ఇవీ పరిష్కారాలు.. వస్త్రపరిశ్రమలో తక్షణమే 8 గంటల పని విధానం అమలు చేయాలి ముడిసరుకు సరఫరా కోసం ప్రభుత్వమే అన్నిరకాల వస్త్రం తయారీకి అనువైన నూలు డిపోలు ఏర్పాటు చేయాలి. మూస పద్ధతికి స్వస్తి చెప్పి మార్కెట్లో డిమాండ్‌ను బట్టి గుడ్డ ఉత్పత్తి చేయాలి. ఇందుకోసం యజమానులు, ఆసాములు, కార్మికులను ప్రోత్సహించాలి. అందుబాటులో ఆధునిక సైజింగ్, వార్పింగ్, డైయింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ప్రపంచ మార్కెట్లో పోటీని తట్టుకునేలా వస్త్రాన్ని ఉత్పత్తి చేయించాలి. వస్త్రం కొనుగోలుకు ఆప్కో తరహాలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ధర పతనమైనప్పుడు నిల్వ చేసుకునే ఉత్పత్తిదారులకు రుణవసతి కల్పించాలి. రాష్ట్రప్రభుత్వం ఈసారి విద్యార్థుల యూనిఫామ్స్ కోసం 1.14 కోట్ల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేసింది. మ్యాక్స్ సొసైటీలకు యార్న్ కొనుగోలుకు 50 శాతం అడ్వాన్స్ డబ్బులు చెల్లించాలి. ప్రభుత్వ సంస్థలైన మున్సిపల్, సింగరేణి, ఆస్పత్రులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు వస్త్రం కొనుగోలు చేయాలి. ప్రభుత్వ శాఖల ఆర్డర్లకు ముందే కార్మికుల కూలి రేట్లను జౌళిశాఖ నిర్ణయించాలి. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పీఎఫ్ సౌకర్యం కల్పించాలి, జనశ్రీ బీమా పథకం వర్తింపజేయాలి చేనేత కార్మికుల మాదిరిగా ‘ట్రిప్ట్’ పథకం ద్వారా సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు పొదుపు సదుపాయం కల్పించాలి. చేనేత కార్మికులకు కూలిలో నిత్యం రూ.15 కోత వి«ధించి వారి వ్యక్తిగతబ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రభుత్వం మరో రూ.15 ఇస్తుంది. పని దినాల ఆధారంగా నెలకు రూ.800 జమ అవుతుంది. ఈ విధానంతో ఎంతోకొంత భరోసా కలుగుతోంది. అర్హులైన కార్మికులకు ఏఏవై కార్డులు అందించాలి. అనర్హలను తొలగించాలి. మరమగ్గాలపై వస్త్రోత్పత్తితోపాటు దోమలతెరలు, చీరలు, ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తి ప్రోత్సహించాలి. చేనేత సహకార సంఘాల మాదిరిగానే పవర్‌లూం సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి. వీటికి ప్రభుత్వం ద్వారా ఆర్థికసాయం, బ్యాంకు రుణ వసతి కల్పించాలి. ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి, డిజైన్ వస్త్రాల ఉత్పత్తి కోసం కార్మికుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు శిక్షణ ఇవ్వాలి. మహిళలకు కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇవ్వాలి. బీడీలకు ప్రత్నామ్యాయ ఉపాధి చూపించాలి. గార్మెంట్ పరిశ్రమను విస్తరించాలి. మంత్రిపైనే ఆశలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో తమకు ఉపాధి మెరుగవుతుందని నేతకార్మికులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావుపై ఆశలు పెంచుకున్నారు. వీరికి మెరుగైన ఉపాధి కల్పించాలి. 50 శాతం విద్యుత్ రాయితీ ఆసాములు, యజమానులకే వర్తిస్తుండగా ఆ మేరకు కార్మికులకు ప్రయోజనం దక్కడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. వస్త్రపరిశ్రమకు ప్రత్యామ్యాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. సమస్యలు.. సవాళ్లు వస్త్ర పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. కొందరు మార్వాడీలు నూలు సరఫరా చేస్తూ వస్త్రాన్ని వారే కొనుగోలు చేస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి వస్త్రం మన రాష్ట్రానికి దిగుమతి అవుతుంది. ఇక్కడ ఉత్పత్తి వ్యయానికి, గిట్టుబాటు ధరకు మధ్య వ్యత్యాసం చాలా ఉండడంతో నష్టానికి బట్టను అమ్మాల్సి వస్తోంది. మీటరు పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తికి రూ.5 ఖర్చు అవుతుండగా.. అంతే ధరతో విక్రయించాల్సి వస్తోంది. మార్కెట్ సౌకర్యం లేక ఒక్కోసారి రూ.4.50 కే అప్పగించాల్సి వస్తోంది. మరమగ్గాల మరమ్మతు, మరమ్మతు దరలు పెరగడం, ముడిసరుకు ధరలు ఆకాశాన్నంటడం, పొరుగు రాష్ట్రాల నుంచి భారీఎత్తున వస్త్రం వచ్చి చేరడం ఇందుకు కారణమైంది. రాత్రి,పగలు 12గంటలపాటు పని చేయడం ద్వారా కార్మికులు, ఆసాములు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. అనారోగ్యం బారినపడుతున్నారు. -
సిరిసిల్లలో నేత కార్మికుల సమ్మె
కరీంనగర్ : కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో చేనేత కార్మికులు సోమవారం సమ్మెకు దిగారు. దీంతో 7 వేల మరమగ్గాలు మూగబోయాయి. దాదాపు 3 వేల మంది నేత కార్మికులు రోడ్డెక్కి భారీ ర్యాలీ నిర్వహించారు. కూలీ రేట్లు పెంచేంత వరకూ సమ్మెను విరమించబోమని కార్మికులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. -
కార్మికులకు సొంతంగా బీమా చెల్లించిన కేటీఆర్
సిరిసిల్ల : చేనేత, పవర్ లూమ్ కార్మికులకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు బీమా కానుక ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని 25 వేల మంది కార్మికులకు ప్రమాద బీమా ప్రీమియంను మంత్రి సొంతంగా చెల్లించారు. కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల శాశ్వత అంగవైకల్య బీమాను కేటీఆర్ కానుకగా ఇచ్చారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఈ బీమా విషయంపై హర్షం వ్యక్తం చేశారు. -
నెలలోపే రుణాలు మాఫీ: కొల్లు రవీంద్ర
ధర్మవరం టౌన్ (అనంతపురం): చేనేత కార్మికుల రుణాలను నెలలోపే మాఫీ చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నేత కార్మికులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.2.9 లక్షలు అందిస్తామని చెప్పారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించనున్నట్టు తెలిపారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిగ్గు లేకుండా అనంతపురం జిల్లాలో పర్యటించారని విమర్శించారు. రాష్ట్ర విభజన చేసి చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రి పరిహారం అందజేశారు. -
చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులు
హిరమండలం : జిల్లాలోని చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులు అందిస్తామని జిల్లా జౌలు చేనేత సంస్థ ఏడీ జి.రాజారావు తెలిపారు. శనివారం సుభలయి శ్రీ ఏకాంబరే శ్వర చేనేత సంఘం కార్యాలయ ఆవరణలో చేనేత కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 1003 మంది చేనేత కార్మికుల పిల్లలకు(విద్యార్థులకు)ఉపకార వేతనాలు మంజూరయ్యాయన్నారు. ఏకాంబరేశ్వర సంఘం పరిధిలోని విద్యార్థులకు ఇప్పటికే స్కాలర్షిప్లు అందించామన్నారు. అలాగే జిల్లాలో 4380 మంది కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని, ఇంకా అర్హులైన వారు పూర్తి సమాచారంతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. హుద్‌హుద్ తుపానుకు నష్టపోయిన 2 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని చేనేత సంఘం మండల అధ్యక్షుడు గణేష్ కోరారు. శాతవాహన స్పిల్లింగ్ మిల్లు మేనేజర్ కృష్ణారావు, సర్పంచ్ ఎ.సూర్యకుమారి, పీఏసీఎస్ డెరైక్టర్ రామకృష్ణ, మేనేజర్ శంకరరావు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలి
నగరి : చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలను ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అన్నమైనా మానేస్తాను రాట్నంపై నూలు వడకడం మానను అని చెప్పి మహా త్మాగాంధీ మాటలను ప్రతి నాయకు డు గుర్తుంచుకుని చేనేత కార్మికులపై వ్యవహరించాలన్నారు. బడ్జెట్ సమావేశంలో గాంధీ పేరు చెప్పడమే గానీ చేనేత కార్మికులకు ఇచ్చిన రుణమాఫీ గుర్తించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరం అన్నారు. వ్యవసాయం తరువాత ప్రాధాన్యత సంతరించుకున్న రంగం చేనేత రంగమే అన్నారు. నేతన్న ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడుకునే బాధ్యత ప్ర భుత్వంపై ఉందన్నారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా చేనేత కార్మికులు అన్ని సదుపాయాలు అందాల న్నారు. రూ.వెయ్యి కోట్లతో చేనేత కార్మికులకు ఏర్పాటు చేస్తానన్న నిధి వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వెయ్యి ఫించన్లు ప్రతి నెలా మంజూరు చేయాలన్నారు. 20 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులకు కావలసిన వస్తువులను అందజేయాలన్నారు. -
పార్టీ ఏదైనా.. జెండా సిరిసిల్లదే
పార్టీ జెండాల ప్రింటింగ్‌లో కార్మికులు బిజీబిజీ ఎన్నికల వేళ కార్మికులకు చేతినిండా పని రూ.కోట్లలో వ్యాపారం సాంచాల చప్పుళ్లు.. చేనేత కార్మికుల ఆకలి కేకలు వినిపించే సిరిసిల్లలో ఎన్నికలప్పుడు మాత్రం సందడి నెలకొంటుంది. జెండా, ఎజెండాతో ప్రమేయం లేకుండా సిరిసిల్ల లోగిళ్లన్నీ వివిధ పార్టీల జెండాలు, కండువాలు, బ్యానర్లతో నిండిపోతాయి. ఎన్నికల ప్రచార వస్త్రోత్పత్తికి కేంద్రంగా నిలుస్తున్న ఈ ప్రాంతంలో తయారయ్యే పార్టీ జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతుంటాయి. మూడున్నర దశాబ్దాలుగా.. రామ్ బలరామ్ స్క్రీన్ ప్రింటర్స్ వారు తొలిసారిగా 1978లో రంగురంగుల పార్టీ జెండాలను ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిరిసిల్లలో సందడే సందడి. ప్రస్తుతం ఇక్కడ ఇటువంటి పరిశ్రములు పది వరకు ఉన్నాయి. బ్యానర్లపై పార్టీ గుర్తులే కాకుండా అభ్యర్థుల పేర్లు, నినాదాలు కూడా ముద్రిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీఎస్పీ.. ఇలా ఏ పార్టీ జెండా తయారీకైనా సిరిసిల్లే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రూ. కోట్లలో వ్యాపారం ఇక్కడ ఉత్పత్తయ్యే పాలియెస్టర్ వస్త్రాన్ని మొదట ఆయా పార్టీల రంగుల్లో ప్రాసెసింగ్ చేస్తారు. కాంగ్రెస్ మూడు రంగుల జెండాలను మాత్రం హైదరాబాద్‌లో ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఈ పరిశ్రమలపై ఆధారపడి 250 మంది కార్మికులు ఉపాధి పొందుతుండగా మిషన్లపై జెండాలు కుట్టే పనిలో మరో వెయ్యిమంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఒక్కో బ్యానర్‌కు సైజును బట్టి రూ.35 నుంచి రూ.100 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.ఐదు చొప్పున, టోపీలకు రూ.ఏడు నుంచి రూ.పది వరకు వసూలు చేస్తున్నారు. పదివేల తోరణాల జెండాలకు రూ.2500 తీసుకుంటున్నారు. మొత్తంగా ఎన్నికల సీజన్లో రూ.నాలుగు కోట్ల మేర వ్యాపారం సాగుతున్నట్టు ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లు సైతం ఇక్కడే ముద్రితమవుతున్నాయి. ‘కోడ్’ కూసినా నష్టమే ప్రింటింగ్ పూర్తయిన జెండాలు, బ్యానర్లు తదితర వాటిని రవాణా చేసే సమయంలో ఎన్నికల కోడ్ అమలు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల్లో వీటిని చూపకపోవడం వల్ల రవాణా సమయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులకు ఉద్దెర(అరువు)గా సరఫరా చేస్తే ఒక్కోసారి మొదటికే మోసం వస్తోంది. జెండాలు ఇచ్చి ఎన్నికల తరువాత డబ్బుల కోసం వెళితే.. గెలిచిన వారు దొరకక, ఓడినవారు ముఖం చాటేస్తుండడంతో మునిగిపోతున్నారు. నిండా ముంచిన ‘పీఆర్పీ’ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రజాచైతన్య యాత్రకు సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడంతో వ్యాపారం జోరుగా సాగుతుందని ఇక్కడి వ్యాపారులు ఆ పార్టీ జెండాలు, కండువాలను భారీగా తయారుచేశారు. అయితే ఆ తర్వాత పీఆర్పీ కాస్తా కాంగ్రెస్‌లో విలీనం కావడంతో వ్యాపారులు రూ.లక్షల్లో నష్టపోయారు. ఓ వ్యాపారి అయితే ఐపీ కూడా దాఖలు చేశారు. - న్యూస్‌లైన్, సిరిసిల్ల బ్యానర్లకు గిరాకీ తగ్గింది ఎన్నికల సీజన్లో గతంతో పోలిస్తే వ్యాపారం తగ్గింది. ఫ్లెక్సీల ప్రింటింగ్‌తో గిరాకీ పూర్తిగా పడిపోయింది. కండువాలు, జెండాలు, టోపీల వ్యాపారమే జరుగుతోంది. మూడు దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం కాబట్టి నాయకులు ముందే మమ్మల్ని సంప్రదిస్తారు. ఈసారైనా వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాం. - అన్నల్దాస్ రాజు, వ్యాపారి ‘రికార్డు’ ఎమ్మెల్యే వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 57 ఏళ్లు పూర్తికాగా అందులో 27ఏళ్ల పాటు కమ్యూనిస్టు నేత, దివంగత మద్దికాయల ఓంకార్ ఒక్కరే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1972, 1978, 1983, 1985, 1989 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన 1994లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేతిలో 87ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ టైగర్‌గా గుర్తింపు పొందిన ఓంకార్ సీపీఎం నుంచి మూడుసార్లు గెలుపొందగా తర్వాత ఎంసీపీఐ పార్టీ స్థాపించి మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. - న్యూస్‌లైన్, నర్సంపేట కొంపముంచిన ‘విమానం’ ఒక్కోసారి గుర్తులు అభ్యర్థుల జాతకాలను తారుమారుచేస్తాయి. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టీడీపీలో ఉన్నారు. అయితే టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా మెట్పల్లి అసెంబ్లీ సీటును బీజేపీ అభ్యర్థికి కేటాయించారు. దీంతో మెట్పల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విద్యాసాగర్‌రావు బరిలోకి దిగారు. ఇదే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మామిడిపల్లి గంగారాజం పోటీకి దిగారు. వీరిద్దరికీ ఎన్నికల గుర్తుగా విమానం కేటాయించారు. రెండు ఎన్నికలు ఒకేసారి కావడం, గుర్తు కూడా ఒకటే కావడంతో చాలామంది ఓటర్లు విద్యాసాగర్‌రావుకు వేస్తున్నామనుకుని గంగారాజానికి ఓట్లేశారు. ఫలితంగా విద్యాసాగర్‌రావు ఐదువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇలా విమానం గుర్తు విద్యాసాగర్‌రావును రాజకీయంగా ఐదేళ్లు వెనక్కి నెట్టింది. - న్యూస్‌లై న్, కోరుట్ల -
బాబు పాలనలో చేనేతల కష్టాలు
బాబు పరిహాసం.. ‘పరిహారమిస్తే ఆత్మహత్యలు పెరుగుతాయి ’బాబు డైరీ: నేతన్న నిండుగా దుస్తులు ధరించలేని దుస్థితి చంద్రబాబు జమానా. కడుపు నిండా ఒక్కపూటైనా ఇంటిల్లిపాదికి అన్నం పెట్టలేని దా‘రుణాలు’. ఏడాదికిపైగా వస్త్ర ఖరీదు సొమ్ము ప్రాథమిక చేనేత సంఘాలకు బాబు సర్కార్ చెల్లించనేలేదు. దాంతో 1994-95 కాలంలో రూ.126 కోట్ల ఆప్కో వ్యాపారం 1998-99 కాలానికి రూ.280 కోట్లకు పెగకపోగా, రూ.60 కోట్లకు పడిపోయింది. పైగా, తాను కేంద్రంలో చక్రం తిప్పడం వల్లే బీజేపీ సర్కార్ ఏర్పడిందని గొప్పలు చెప్పుకున్న బాబు చేనేత వస్త్రాలపై 20 శాతం సబ్సిడీ కొనసాగింపులో ఘోర వైఫల్యం చెందారు. ఫలితంగా చేనేత వస్త్రాలు గుట్టలుగా పేరుకుపోయి.. పనులు లేక నేతన్నలు అల్లాడారు. ఎవరైనా ధైర్యం చేసి అప్పు చేసి వస్త్రాల్ని నేస్తే.. వాటి అమ్మకాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రోత్సాహం శూన్యమైంది. దాంతో చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకు దారి తీసింది. * నేత కార్మికుల సంక్షేమం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పెపైచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు. * 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సృష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. అప్పటి చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు. * బాబు హయాంలో 1999-2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు. * నేత కార్మికులకు పింఛను ఇవ్వాలని బాబు ఏనాడూ ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు. * చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలను వంద వరకు మూసేశారు. * ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు. * బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భీవండి, సూరత్ వలసపోయారు. -
చిక్కిపోతున్న చేనేత..
పూర్తి కాని లక్ష్యం.. నెలరోజులే గడువు డిపాజిట్, ఇతరత్రా కొర్రీలు పెడుతున్న బ్యాంకర్లు భువనగిరి, న్యూస్‌లైన్: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా తయారైంది జిల్లాలో చేనేత కార్మికుల రుణాల పరిస్థితి. చేనేత కార్మికులకు రూ.25వేల నుంచి 2లక్షల రూపాయల వరకు రుణవసతి కల్పించి వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా చేనేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారికి పెట్టుబడి వసతి కల్పించేదుకు క్యాష్ క్రెడిట్ రుణాలను మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనుంది. రుణాల మంజూరుకు జౌళిశాఖ జిల్లాలో 11000 మంది చేనేత కార్మికులను లబ్ధిదారులుగా గుర్తించింది. లబ్ధిదారుల జాబితాలను బ్యాంకులకు పంపిం చింది. రుణాల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కలెక్టర్ టి.చిరంజీ వులు ప్రత్యేక చొరవతో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన చేనేత కార్మికులందరికీ రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. అయినా సుమారు మూడు నెలలుగా ఈ ప్రక్రియ జరుగుతున్నా ఆశించిన స్థాయిలో రుణ పంపిణీ జరగడం లేదు. బ్యాంకర్లు చేనేత కార్మికులకు రుణాలివ్వడంలో కొర్రీలు పెడుతున్నారు. ఇప్పటివరకు 1380మందికే రుణాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి చివరి వరకు ఇవ్వకపోతే ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో రుణాలను వాయిదా వేసే పరిస్థితి ఉంది. బ్యాంకర్ల కొర్రీలు.... రుణాలు వస్తాయని ఆశపడిన చేనేత కార్మికులకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. తక్కువలో తక్కువగా 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రూ.25 వేలు, రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఈ రుణం ఇవ్వడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. చేనే త కార్మికులకు బ్యాంకులో ఖాతాలు లేవని అందువల్ల రుణాలు ఇవ్వలేమంటూ బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు డిపాజిట్ చేస్తేనే రుణం ఇస్తామని మెలిక పెడుతున్నారు. దీంతో రుణాలు పొందడం కోసం చేనేత కార్మికులు డిపాజిట్ మొత్తం కోసం వడ్డీలకు తెస్తున్నారు. దీంతో వారు మరింత అప్పుల పాలవుతున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి చేనేత కార్మికుల రుణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. ఇప్పటివరకు జరుగుతున్న రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈలోపు రుణ పంపిణీ జరగపోతే రుణాలు మురిగిపోయే ప్రమాదం ఉంది. లేదా గత సంవత్సరం రుణాలంటూ బ్యాంకర్లు పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన రుణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే బ్యాంకర్లు సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తమ ఇబ్బందులు పట్టించుకోవాలని వారు అంటున్నారు. రూ.50 వేలు ఇస్తేనే మార్జిన్ మనీ వస్తుంది : సంజీవరావు, జౌళిశాఖ ఏడీ చేనేత కార్మికులకు బ్యాంకులు కచ్చితంగా రూ.50 వేల రుణం ఇవ్వాలి. అప్పుడే వారికి నాబార్డునుంచి 10 రూపాయల మార్జిన్ మనీ వస్తుంది. కొన్ని బ్యాంకులు రూ.25, రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నారు. దీని వల్ల చేనేత కార్మికులు నష్టపోతారు. ఏ బ్యాంకులో రూ.50 వేల కంటే తక్కువ రుణం ఇస్తే తన దృష్టికి తీసుకురావాలి. -
సి‘ఫార్సు’లు
చీరాల, న్యూస్‌లైన్: చేతి వృత్తులకు చేయూతనిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం చేనేత కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇప్పటికే చేనేత పార్కు, మెగా క్లస్టర్ వంటి ప్రాజెక్ట్‌లు అటకెక్కగా, చేనేత క్రెడిట్ కార్డు పథకం కూడా తూతూ మంత్రంగా సాగుతోంది. చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2 లక్షల వరకు సబ్సిడీ వడ్డీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తే వ్యక్తిగతంగా వారు ఆర్థికాభివృద్ధి సాధించి, సంక్షోభం నుంచి బయట పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం నుంచి చేనేత క్రెడిట్ కార్డుల పథకాన్ని అమలు చే స్తోంది. ఈ పథకం తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రుణాలు కల్పిస్తామని క్రెడిట్ కార్డులు మంజూరు చేసిన చేనేత శాఖ జిల్లా మొత్తం రెండు వేల మంది కార్మికులకు రుణాలివ్వలేదు. దీంతో రుణాలు అందక, మగ్గం సాగక కార్మికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రుణాలు దక్కని కార్మికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఆర్టిజన్, క్రెడిట్ కార్డుల వంటి పథకాలు అమలు చేసి రుణ సౌకర్యాలు కల్పిస్తామన్న సర్కారు ఆచరణలో మాత్రం చేనేతలకు ‘చెయ్యి’స్తోంది. దశాబ్దాల తరబడి మాస్టర్‌వీవర్ వద్ద కూలీలుగా పని చేస్తున్నారే తప్ప స్వతంత్రంగా పని చేసుకోలేని పరిస్థితిలో కార్మికులున్నారు. మాస్టర్ వీవర్లు ఇచ్చే కూలీలు (మజూరీలు) తినడానికి కూడా చాలక పస్తులతో కాలం నెట్టుకొస్తున్నారే తప్ప సొంతగా వారి కాళ్లపై నిలబడలేని దయనీయమైన స్థితిలో ఉన్నారు. చేనేత కార్మికులకు చేయూతనిస్తామని ఏడాదిన్నర క్రితం చేనేత క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. చేనేత మగ్గం ఉండి, చేనేత గుర్తింపు కార్డు ఉంటే అటువంటి వారిని అర్హులుగా గుర్తించి *2 లక్షల వరకు సబ్సిడీ వడ్డీ, మార్జిన్మనీతో కూడిన రుణం కల్పిస్తామని చెప్పింది. చీరాల, వేటపాలెంతో పాటు జిల్లాల్లో ఉన్న చేనేత ప్రాంతాల్లో చేనేత శాఖాధికారులు ఈ పథకం గురించి చేనేత కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులు కూడా సేకరించారు. జిల్లాలో 33 వేల చేనేత కుటుంబాలున్నాయి. 17 వేల మగ్గాలు పని చేస్తున్నాయి. 10 వేల మంది అర్హులైన వారు జిల్లాలో ఉన్నారు. కానీ ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల ద్వారా 1970 మందికి మాత్రమే రుణాలు కల్పించారు. అది కూడా ఒక్కొక్కరికి రూ.35 వేల నుంచి రూ.50 వేల లోపు మాత్రమే. క్రెడిట్ కార్డులున్నా బ్యాంక్‌లు రుణ సౌకర్యానికి మోకాలడ్డేస్తున్నాయి. క్రెడిట్‌కార్డు ద్వారా రుణ సౌకర్యం కల్పించాల్సిన చేనేత శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించడంలో చొరవ చూపలేకపోతోంది. దీంతో చేనేతలకు రుణం గగనంగా మారింది. వేలాది మంది చేనేత కార్మికులుంటే ఇప్పటి వరకు ఇచ్చింది 1970 మందికి మాత్రమే అంటే పథకం నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ సిఫార్సు ఉంటేనే... చేనేత క్రెడిట్ కార్డుల ద్వారా రుణం పొందే హక్కు గుర్తింపు కార్డులున్న కార్మికులకు ఉంటుంది. కానీ కేవలం స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు, కొంత మంది కార్యకర్త లు సిఫార్సు చేసిన వారికే రుణ సౌకర్యం లభిస్తోంది. చేనేతలు అధికంగా ఉండే ఈపూరుపాలెంలో ఒక మాజీ సర్పంచ్ రుణ పంపిణీ లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాడు. ఆయ న చెప్పిన కొంత మందికే రుణాలు మంజూరవుతున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కాకుండా మరో పార్టీకి పని చేసిన వారికి రుణాలు అందడం లేదు. మిగతా ప్రాంతాల్లో కూడా స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల ఆదరాభిమానాలు ఉంటేనే రుణం అందే పరిస్థితులున్నాయి. చేనేత అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే తానాతందానా అనడం గమనార్హం. ఇదిలా ఉంటే కొం దరు నాయకులు రుణం మంజూరు చేయిస్తే రూ.5 వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. హ్యాండ్లూమ్ ఏడీ ఏమంటున్నారంటే... జిల్లాలో చేనేత క్రెడిట్ కార్డుల పథకం కింద 1970 మందికి రుణాలు కల్పించాం. మరికొద్ది మందికి కల్పించాల్సి ఉంది. ఒక్కొక్కరికి రూ.35 నుంచి రూ. 50 వేల వరకు రుణాలు మంజూరయ్యాయి.సకాలంలో బ్యాంకర్లకు తిరిగి చెల్లిస్తే మళ్లీ అదనంగా రుణాలు వచ్చే అవకాశం ఉం దని చేనేత శాఖ ఏడీ రామ్మూర్తి పేర్కొన్నారు. -
మిగిలింది పస్తులే..!
చీరాల, న్యూస్‌లైన్: నేసిన వస్త్రాలు అమ్ముడుపోక చేనేత కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో దసరా, దీపావళి తదితర ప్రధాన పండుగల సమయాల్లో చేనేతల పరిస్థితి ఆశాజనకంగా ఉండేది. అప్పటి వరకు నేసిన వస్త్రాలు అమ్ముడుపోయి చేతినిండా డబ్బులుండేవి. మామూలు రోజుల్లో ఉపాధి కరువై మగ్గం సాగక, పూట గడవక పస్తులతో పోరాడుతుండేవారు. ప్రస్తుతం కనీసం పండుగ రోజుల్లో కూడా పట్టెడన్నం తినే పరిస్థితి లేక చేనేతలు ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వం తీరే. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం వస్త్రాలను కొనుగోలు చేసే విషయంలో సవతి తల్లి ప్రేమను కనబరుస్తోంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆప్కో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కొనుగోళ్లు చేసి మమ అనిపిస్తోంది. మాస్టర్ వీవర్ల వద్ద పేరుకుపోతున్న నిల్వలు: జిల్లాలో 24 వేల చేనేత మగ్గాలున్నాయి. ఇరవై వేల పైచిలుకు చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1.60 లక్షల మంది చేనేతలు పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడ్డారు. జిల్లాలో 56 వరకు ఆప్కో సొసైటీలుండగా చీరాలలోనే 30 సంఘాలు పనిచేస్తున్నాయి. నిత్యం కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తేనే పూట గడిచేది. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల అమ్మకాలు పూర్తిగా స్తంభించి జిల్లాలో రూ. 8 కోట్ల విలువైన చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా చేనేత మగ్గాలపై ఐదు వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అమ్మకాలు లేకపోవడం, ఆప్కో కొనుగోళ్లు చేయకపోవడంతో చేనేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్కో మాస్టర్ వీవర్ వద్ద రూ. 10 నుంచి రూ. 20 లక్షల విలువైన చేనేత వస్త్రాల నిల్వలున్నాయని సమాచారం. అప్పులపాలవుతున్న చేనేతలు: వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూతనివ్వకపోవడంతో మాస్టర్‌వీవర్లు చేనేత కార్మికులకు పని కల్పించడం లేదు. దీంతో పూట గడవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ, తదితర నూలును ముంబాయి, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మూడు నెలల వ్యవధిలో వచ్చిన వినాయకచవితి, దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ అయిన శ్రావణమాసంలో కూడా చేనేత వస్త్రాల అమ్మకాలు అరకొరగానే జరగడంతో ఎక్కడికక్కడ నిల్వలు పేరుకుపోయాయి. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాల అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్న అమాత్యుల హామీలు బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా కార్మికులకు పస్తులే మిగిలాయి. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి పడవల లక్ష్మణస్వామి, హ్యాండ్లూమ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. -
రాష్ట్రం విడిపోతే చేనేతకు గడ్డుకాలం
ఉరవకొండ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు తరలిరావాలని ఆల్ ఇండియూ హ్యాండ్లూమ్ డెరైక్టర్ చందావెంకటస్వామి పిలుపు నిచ్చారు. స్థానిక చౌడేశ్వరీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయుంలో బుధవారం జిల్లా చేనేత పారిశ్రామిక నాయుకుల సవూవేశం నిర్వహించారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు తరలివెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం విలేకరులతో చందావెంకటస్వామి వూట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి ఆశయు సాధన కోసం పాటు పడుతున్నారన్నారు. చేనేత కార్మికుల సవుస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. ధర్మవరంలో ఆవురణ దీక్షతోపాటు, సిరిసిల్లలో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయువ్ము ఆవురణదీక్ష చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించారన్నారు. విభజన అంశంపై ఇతర రాజకీయు పార్టీలు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుండగా, వైఎస్సార్సీపీ వూత్రం స్పష్టమైన సమైక్య నినాదంతో పోరాడుతోందన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దలకు సమైక్య సెగ తగిలేలా హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. -
నేతన్నలపై చిన్న చూపు
కనిగిరి, న్యూస్‌లైన్: కనిగిరి ప్రాంత చేనేత కార్మికులపై నేతలు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి రూ.60 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు హామీ నీటి మీదరాతగానే మారింది. 2011 జనవరి 22న శంకర్రావు కనిగిరిలో పర్యటించారు. చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి సంక్షేమం కోసం రూ.60 లక్షలతో ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లోపు అమలు చేసి ఆదుకుంటామని చెప్పారు. ఈమేరకు అప్పటి ఏడీఏను ఆదేశించారు. కానీ మూడేళ్లు కావస్తున్నా అతీ గతి లేదు. శంకర్రావు మారి ఆ శాఖకు మరో మంత్రి ప్రసాద్ కుమార్ వచ్చి రెండేళ్లు కావస్తున్నా వాటిపై దృష్టి సారించలేదు. అదే వేదిక పై ఉన్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా గత జూన్ నెలలో చేనేత కార్మికులకు హామీలేని రుణాలిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర హడావుడి చేశారు. ఈ ఏడాది జిల్లాలో 2,020 మందికి రూ.6 కోట్లు హామీలేని రుణాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా బ్యాంకుల పరిధిలోని చేనేతలకు తప్పక హామీలేని రుణాలివ్వాలని ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ. 30 వేలు రుణం, రూ. 4,500 సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనిగిరి ప్రాంతంలోని చేనేత కార్మికులు ఎంతో ఆశతో పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1,500 దరఖాస్తులు వచ్చాయి. కానీ నేటికి ఒక్కరికీ రుణం అందలేదు. బ్యాంకర్ల విముఖత: పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కనిగిరి ప్రాంత చేనేతలకు శాపంగా మారింది. వేదికలపై మాటలు చెప్పే నాయకులు వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలున్నాయి. చీరాల నియోజకవర్గంలోని కొంతమందికి తప్ప మిగతా ప్రాంతాల్లోని చేనేతలకు బ్యాంకర్లు హామీ లేని రుణాలు ఇవ్వలేదు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఏ బ్యాంకర్ కూడా చేనేతలకు హామీ లేని రుణాలిచేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంక్‌ల చుట్టూ రోజూ తిరుగుతున్నా స్పందించడం లేదని చేనేత సంఘ నాయకులు చెప్తున్నారు. కనిగిరి చేనేతలపై చిన్న చూపా... జిల్లాలో చేనేత కార్మికులు చీరాల తర్వాత బేస్తవారిపేట, కనిగిరి ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కనిగిరి ప్రాంతంలో 1500 మగ్గాలున్నా యి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 47 గ్రామాల్లో చేనేత కార్మికులు జీవిస్తున్నారు. దాదాపు 2వేలకు పై గా కుటుంబాలున్నాయి. 10 సొసైటీలకు సంబంధించి 2 వేల మంది సభ్యులు ఉన్న ట్లు అంచనా. వీరికి ఆర్థిక వనరులు, ప్రభు త్వ సహాయం లేక, బ్యాంక్ రుణాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ బాటలో చేనేతలు.. కనిగిరి ప్రాంతంలోని చేనేత కార్మికులు నూటికి 70 మంది ప్రత్యామ్నాయ కూలీలుగా మారి జీవిస్తున్నారు. ఇప్పటికే సగం మంది వలస బాటపట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మరి కొంత మంది బేల్దారి పని, మట్టి పని, మిక్చర్ బండ్లను, ఐస్ బండ్లను వేసుకుంటూ బతుకు తున్నారు. దేవాంగనగర్, యడవల్లి, వాగుపల్లి గ్రామాల్లో చేనేతల గృహాలు వలసలతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి.