
త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్
హైదరాబాద్ : చేనేత కలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన పవర్ లూమ్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమంపై సీఎం వారితో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్, గోదాంలు ఏర్పాటుచేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్తో వరంగల్కు మహర్దశ రానుందన్నారు. రాబోయే బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు.