సీఎం జగన్‌తో చేనేత కార్మికులు ఏమన్నారంటే? | Handloom Workers Who Shared Their Happiness With Cm Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో చేనేత కార్మికులు ఏమన్నారంటే?

Published Sat, Apr 13 2024 3:14 PM | Last Updated on Sat, Apr 13 2024 3:43 PM

Handloom Workers Who Shared Their Happiness With Cm Jagan - Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం.. చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము పొందిన లబ్ధిని వివరిస్తూ సీఎంతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి చంద్రబాబు అన్యాయం చేశారని, జగనన్న మళ్లీ మీరే రావాలి.. మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నామని.. మీరే మా నమ్మకమన్నారు.

సీఎం జగన్‌ స్పందిస్తూ.. మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నా..
నాకు చేయూత వస్తోంది. నా సొంత మగ్గంతో నా సొంతింటిలోనే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను. నాకు మగ్గం డబ్బులు కూడా వచ్చాయి
-చేనేత మహిళ

సీఎం జగన్‌కు ధన్యవాదాలు..
నాకు మగ్గం షెడ్డులో ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు
-గుండు కమల, మంగళగిరి

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..
యావత్ చేనేత కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. రేపు జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి.. సహకార సంఘాలు, కార్మికులు, పవర్ లూమ్స్ విషయంలో గానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేతల పిల్లలు ఈరోజు టోఫెల్ అంటే.. 4 లక్షల మంది జగన్ లు తయారవుతారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ ప్రజానీకానికి తెలిస్తే 2030 వరకు ఉన్న విజన్ ను గుర్తించాలి. చేనేత బ్యాంక్ ను ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను
-పి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు

నేతన్న నేస్తం వస్తోంది..
నాకు రాజీవ్ గృహకల్పలో ఇళ్లు వచ్చింది నాన్నగారి టైమ్ లో. 2009 నుంచి అక్కడే ఉంటున్నాం ఆ చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకుని. నేతన్న నేస్తం వస్తోంది, పింఛన్ కూడా వస్తోంది బాగానే ఉంది మాకు..
కవుతరపు రాఘవమ్మ, చేనేత మహిళ.

మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా..
నమస్తే జగనన్న మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకు ఉదయాన్నే ఇంటివద్దనే పిలిచి పెన్షన్లు ఇవ్వడం చాలా బాగుంది. ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్లాలి? ఏంటి? అని గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత కూడా సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటీర్లు ఇంటికే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటివద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని తీర్చే ఈ వాలంటీర్ల వ్యవస్థ మాకు నచ్చింది. చాలామంది చదువుకోవడానికి అమ్మఒడి, విద్యాదీవెన ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీనాలీ చేసుకునే ప్రతిఒక్కరు కూడా తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారు.

ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షలు ఇవ్వడం వల్ల చాలామంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతోంది. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. ఆయన చెప్పిన నవరత్నాలన్నీ కూడా అమలు పరిచిన సీఎం కాబట్టి మళ్లీ జగనన్నే రావాలి, మనమందరం కూడా జగనన్నకే ఓటు వేయాలి. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు గానీ చేసింది లేదు. జగనన్న వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. మా పిల్లలకు అమ్మఒడి వస్తోంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు అన్నవాళ్లు ఎవరూ లేరు. రాలేదు అని చెబుతున్నారంటే వాళ్లు కావాలని చెబుతున్నట్టే. కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాలు వచ్చాయి.
-విజయలక్ష్మి, మంగళగిరి..

అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం..
ప్రాణదాత, విద్యాదాత రాజశేఖర్ రెడ్డి గారైతే మరో విద్యాదాత మా జగనన్న. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రూ.81 కోట్ల గ్రాంట్ కూడా వస్తే ట్రెజరీలో ఉంటే ఆ డబ్బులను చేనేతలకు ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు. తమరు వచ్చిన తర్వాత దేశంలోనే చేనేతలకు ప్రప్రథమంగా రూ.24 వేలను నేతన్న నేస్తంగా ప్రకటించారు. రూ.3 వేల పెన్షన్ లెక్క ఇస్తూ సుమారు రూ.1000 కోట్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఆప్కోకు కూడా రూ.108 కోట్ల బకాయిలను చెల్లించి చేనేత కార్మికుల జీవితాలు బాగు చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం..
-శ్రీనివాసరావు, మంగళగిరి

జగనన్న మళ్లీ మీరే రావాలి
నాకు ఇద్దరు ఆడపిల్లలకు జగనన్న. పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన వస్తోంది. నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్లకు ఇంటి స్థలం వస్తోందని వాలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పి మరీ నాకు ఇంటి స్థలం ఇప్పించారు. కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి అన్యాయం చేశారు. చంద్రబాబు ఇలా చేయడం కరెక్ట్ కాదు. జగనన్న మళ్లీ మీరే రావాలి, మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరే మా నమ్మకం
-హేమలత, మంగళగిరి

సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం జగన్‌
మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆర్నెళ్లు చూస్తాడు, దాని తర్వాత అవసరమైతే మళ్లీ కొత్త స్థలాలు కొని ఇచ్చైనాసరే వీళ్లందరికీ కూడా అక్కడే ఇచ్చే కార్యక్రమం చేస్తాను కచ్చితంగా చేస్తామని చెబుతున్నాను. 

మనమందరం ఆలోచించుకోవాలి..
నేను యూట్యూబ్‌లో చూశాను. లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేం చెప్పినవాళ్లకే పథకాలు, ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పడం నేను విన్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే సీఎం కావాలా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా? అని మనమందరం ఆలోచించుకోవాలి.
-మేరీ పాల్ పద్మావతి దేవి, హరిజన క్రైస్తవ, వెనుకబడిన తరగతుల సేవాసంఘం అధ్యక్షురాలు


 

ఇదీ చదవండి: బాబు బ్యాచ్‌ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement