Live Updates..
- కొప్పేర్ల చేరుకున్న సీఎం జగన్ సార్ బస్సు యాత్ర
- భోగాపురం క్రాస్ అయిన సీఎం జగన్
చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
- విజయనగరం జిల్లా సిద్ధం
- విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహా సముద్రం కనిపిస్తోంది
- ఒక్కసారిగా లక్షలమంది, తాండ్ర పాపారాయుళ్లు, శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచిచూపించడానికి నా ఉత్తరాంద్ర సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది
- ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వాతాతలకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్‌ను, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్‌ను, పిల్లల భవిష్యత్‌ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా, అడ్డుతగులుతున్న పెత్తందార్లు మీద, ఆ కౌరవ సైన్యం, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి సిద్ధం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ల ముందు కనిపిస్తోంది.
- ఈ రోజు చంద్రబాబు వెనకాల ఓ కాంగ్రెస్ ఉంది, ఓ బీజేపీ ఉంది.. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు.. చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఓ దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5 ఉంది. ఇవి సరిపోవన్నుట్లుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు ఉన్నాయి
- ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి
- ఈ రోజు మీ జగన్ వెనకాల ఆ యెల్లో మీడియా లేదు.. ఆ పార్టీలు లేవు..
- ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకం అవుతా ఉన్నారు
- జగన్ కనుక ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే, ప్రతీ ఇంట్లోను జగన్‌ను బిడ్డ గా, తమ్ముడిగా భావించకపోతే.. ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను
- జగన్ ఒకే ఒక్కడు కాదు.. నాకున్నది కోట్ల మంది మీరు అని సగర్వంగా చెబుతున్నాను
- ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ.. ఇంటింటికి చేసిన మంచే నాకున్న నమ్మకం.. ఆపై పైనున్న దేవుడి దయ
- ప్రతీ వర్గానికి మంచి చేశాం.. న్యాయం చేశాం మనం.. మోసం చేసింది మాత్రం వారు
- ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం.
- పేదల్ని ఓడించాలని వారు.. ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం
- చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చార్మిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా?
- ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న ఆ బాబుకు , ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?
- ఎక్కడైనా గమనించమని కోరతా ఉన్నాను
- వస్తువులు ఎత్తుకుపోతే దొంగల ముఠా అంటాం
- బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం
- ఎన్నికలప్పుడు మోసం చేసి, మోసపూరిత చరిత్ర ఉన్న ఆ మూడు పార్టీల కూటమిని ఏమనాలి అని అడుగుతున్నాను
- ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఆ తర్వాత మోసం చేస్తే.. అలాంటి మోసగాళ్లను ఏమంటాం
- అలాంటి వాళ్లను 420లు అందామా... వారిని 420లనే అంటాం
- మళ్లీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం
- 420 అనే కాదు.. చంద్రముఖి బృందం అని కూడా అంటాం
- పేదల కలల్ని అర్దం చేసుకుని మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా
- దాదాపుగా 40 స్కీమ్స్ పెట్టాం
- మీ కలల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ
- ఆ క్రమంలో అందజేసిన సొమ్ము ఎంతో తెలుసా
- ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలు
- నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం
- ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే.. ఏకంగా మరో లక్ష కోట్లకు పైగానే ఇచ్చాం
- నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని గర్వంగా చెప్పగలుగుతున్నాను
- ఇది కేవలం 58 నెలల కాలంలోనే పంపడం జరిగింది
- నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు.. ఇలా డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగింది.
- పేదరికం కారణంగా పిల్లల్ని బడులకు పంపలేని పరిస్థితిని నేను నా ఓదార్పుయాత్రలో చూశాను.. నా పాదయాత్రలోనూ చూశాను
- అలాంటి నిరుపేద కలల్నినిజం చేయడానికే పుట్టింది.. జగనన్న అమ్మ ఒడి అని గర్వంగా చెబుతున్నాను.
- అంతే కాకుండా ఆ పేద తల్లి తమ పిల్లల గొప్ప భవిష్యత్‌కు కోసం కనే కలలు గురించి అర్ధం చేసుకున్నాను కాబట్టే ఒక నాడు నాడు, ఒక ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఒక సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం
- మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, బైజూస్ కంటెంట్, ఆరోతరగతి నుంచే డిజిటల్ బోధనలు, ఎనిమిదో తరగతి వచ్చేసరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్... ఇలా ఎంతో సంక్షేమాన్ని తీసుకొచ్చాం
- ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతం మందికి విద్యా దీవెన, వసతి దీవెన ప్రవేశపెట్టాం
- ఒక డిగ్రీలో కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ.. విదేశీ విద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్‌లైన్ వర్టికల్స్‌ను మన డిగ్రీలతో అనుసంధానం చేశాం
- మన డిగ్రీల్లో మ్యాండెటరీ ఇంటర్నెషిప్ తీసుకురావడం జరిగింది.
- ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్.. వాటి నుంచి వచ్చినవే ఈ నా స్కీమ్స్
- మరి వీటి గురించి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఆలోచనైనా చేశాడా అని అడుగుతున్నాను
- మరి ఈ ఆలోచనలు చంద్రబాబుకు ఎందుకు రాలేదంటే.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి.
- పేదలకు మంచి చేయడం కోసం కాదు.. పేదల రక్తాన్ని తాగేందుకు లకలకాని తపిస్తాడు కాబట్టి
- ప్రతీ అక్క చెల్లెమ్మకు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఒక కల ఉంటుంది. కుటుంబం బాగుండాలని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కలలు కంటుంది. ఒక రూపాయి సంపాదించి కుటుంబానికి తోడుగా ఉండాలని కలలుకంటుంది.
- మరి అటువంటి కలలు కన్న వారి కోసం ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చామో చూద్దామా..
- ఓ వైఎస్సార్ ఆసరా పథకం, ఓ వైఎస్సార్ సున్నా వడ్డీ అనే పథకం.
- అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారు నిలదొక్కుకునేలా ఉండేందుకే పుట్టిందే వైఎస్సార్ చేయూత అనే పథకం
- నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది.. కాపునేస్తం అనే పథకం
- నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఈబీసీ నేస్తం అనే పథకం
- అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. వాటిని నిజం చేయడానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి అని చెబుతున్నాను
- డ్రీమ్స్ పేదింటి అమ్మవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అని గర్వంగా చెబుతున్నాను
- చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్స్ లేవు.
- చంద్రబాబు హయాంలో నా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచించి రోడ్డు మీద పడేసి వారి రక్తాన్ని పీల్చే చంద్రముఖి పాలన మాత్రమే చూశాం.
- ప్రతీ అక్క చెల్లెమ్మ కలకంటుంది. సొంత ఇల్లు ఉండాలని కలలు కంటుంది. దీని కోసం జీవితకాలం ఎదురుచూస్తాం.
- మరి ఆ డ్రీమ్‌ను నెరవేరుస్తూ మీ బిడ్డ ఏం చేశాడు
- నా అక్క చెల్లెమ్మల పేరిటి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది.
- డ్రీమ్ మీవి.. స్కీమ్ మీ బిడ్డవి, మీ తమ్ముడివి, మీ అన్నవి
- చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి
- మీ బిడ్డ పాలనలో ఎటువంటి మంచి జరిగిందో ఆలోచన చేయండి
- ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్.
- పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం.
- సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు.
- దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్.
- పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం.
- ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు.
- ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు.
- పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చుకానీ బాబును నమ్మలేం
- నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
- మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది..
- ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి
చెల్లూరు బహిరంగ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్
- ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
- అశేష జనవాహినితో నిండిపోయిన సభా ప్రాంగణం
- జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం
విజయనగరం:
చెల్లూరు చేరుకున్న సీఎం జగన్
- మరికాసేపట్లో మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్
- లక్షలాది మందితో కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం
- జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం
విజయనగరం:
- కాసేపట్లో చెల్లూరు బహిరంగ సభ వద్ద చేరుకోనున్న సీఎం జగన్
- చెల్లూరు సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
- సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజలు
- మేమంతా సిద్ధమంటూ హోరెత్తుతున్న ఉతర్రాంధ్ర
విజయనగరం:
ఐనాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు
- రోడ్లకు ఇరువైపులా జన ప్రభంజనం
- ఐనాడుకు కొద్దీ దూరంలోనే జరగనున్న సిద్ధం సభ.
విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర
- మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ 21 రోజు బస్సుయాత్ర
- విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర
- విజయనగరం జిల్లా ఎంట్రన్స్‌లో సీఎం జగన్ బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ నేతలు
- పదిహేను వందల బైక్‌లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.. ప్రజలు పువ్వులతో స్వాగతం పలుకుతూ హారతులతో ఆశీర్వదించారు.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు సీఎం జగన్ భరోసా
- వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా వేదిక ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశం
- సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదుతో పాటు పార్టీ నుంచి న్యాయ సహాయం
- దాడులకు భయపడేది లేదు
- దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి - నా చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్
- ఇటు వైపు జగన్ ఒక్కడే.. అటు వైపు కూటమితో ఏకమయ్యారు
- మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం
- అబద్ధాలు,మోసాలతో యుద్ధం చేస్తున్నాం
- గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారు
- టీడీపీ ఎంత దిగజారిందో దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనం
- సోషల్ మీడియా మనతోనే ఉంది
- సెల్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ మనతోనే ఉన్నారు
- విశాఖపట్నం ఏపీకి డెస్టినీ అవుతుంది
- ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది
- సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది
జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు.
మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను.
దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు.
ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు.
పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు.
మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్ కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు.
మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ.. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం
- సీఎం జగన్‌కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో స్వాగతం పలికిన ప్రజలు
- బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి
కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం జగన్
- విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు
- విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను నివేదించిన కార్మిక సంఘాల నాయకులు
- రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది: సీఎం జగన్
- ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది:
- తొలిసారిగా ప్రధానికి లేఖ రాశాం
- స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం:
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం
- ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి
- ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి
- స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి
- స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది
- శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది
- మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి
- విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం
- కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం
- ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైఎస్సార్సీపీకే ఉంది
- పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను: సీఎం జగన్
21వరోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- ఎండాడ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
- కాసేపట్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి
- సాయంత్రం చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ
- బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్
పీఎంపాలెం వద్ద కోలాహలం
- పీఎంపాలెం వైయస్సార్ స్టేడియం వద్ద సందడి వాతావరణం..
- సీఎం జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..
- మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
- మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం(ఏప్రిల్ 23) షెడ్యూల్
- సీఎం జగన్ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు
- మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు
- అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు
- జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు
- అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు
- ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు
ఇదీ చదవండి: ఓ విజేత జైత్రయాత్ర
Memantha Siddham Yatra, Day -21.
ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి ప్రారంభం
సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభ
అక్కివలస దగ్గర రాత్రి బస#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/IAQvjd6MPK— YSR Congress Party (@YSRCParty) April 23, 2024
జననేతకు అడుగడుగునా జన నీరాజనం
- రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర.. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు
- తమ బతుకుల్లో వెలుగులు నింపిన నేతకు అడుగడుగునా జన నీరాజనం
- రాయలసీమ.. దక్షిణ కోస్తా.. ఉత్తర కోస్తా.. ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా అదే ప్రభంజనం
- మండుటెండల్లోనూ పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం
- మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకుని మళ్లీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ
- బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జనసంద్రాలను తలపించిన వైనం
- కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్ షోలు
- అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్‌పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక..
- నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం యాత్ర
- బస్సు యాత్ర ప్రభంజనంతో పోటీ ఏకపక్షంగా మారిందంటున్న రాజకీయ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment