
సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కోనసాగుతోంది. టీడీపీ అధికారంలో ప్రజలకు అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలను తెలసుకుంటూ వారికి భరోసా ఇస్తూ రాజన్న తనయుడు ముందుకు కదులుతున్నారు.
తాజాగా జననేతను చేనేత కార్మికులు కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. చంద్రబాబు చెప్పుకుంటున్న చేనేత రుణమాఫీ ఎవరికి అందిందో తెలీదని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వయసు పైబడిని చేనేత కార్మికులకు మూడు వేల పింఛన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల కష్టాలు విన్న రాజన్న తనయుడు.. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతానని హామీఇచ్చి ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment