బాబు పాలనలో చేనేతల కష్టాలు
బాబు పరిహాసం.. ‘పరిహారమిస్తే ఆత్మహత్యలు పెరుగుతాయి
’బాబు డైరీ: నేతన్న నిండుగా దుస్తులు ధరించలేని దుస్థితి చంద్రబాబు జమానా. కడుపు నిండా ఒక్కపూటైనా ఇంటిల్లిపాదికి అన్నం పెట్టలేని దా‘రుణాలు’. ఏడాదికిపైగా వస్త్ర ఖరీదు సొమ్ము ప్రాథమిక చేనేత సంఘాలకు బాబు సర్కార్ చెల్లించనేలేదు. దాంతో 1994-95 కాలంలో రూ.126 కోట్ల ఆప్కో వ్యాపారం 1998-99 కాలానికి రూ.280 కోట్లకు పెగకపోగా, రూ.60 కోట్లకు పడిపోయింది. పైగా, తాను కేంద్రంలో చక్రం తిప్పడం వల్లే బీజేపీ సర్కార్ ఏర్పడిందని గొప్పలు చెప్పుకున్న బాబు చేనేత వస్త్రాలపై 20 శాతం సబ్సిడీ కొనసాగింపులో ఘోర వైఫల్యం చెందారు. ఫలితంగా చేనేత వస్త్రాలు గుట్టలుగా పేరుకుపోయి.. పనులు లేక నేతన్నలు అల్లాడారు. ఎవరైనా ధైర్యం చేసి అప్పు చేసి వస్త్రాల్ని నేస్తే.. వాటి అమ్మకాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రోత్సాహం శూన్యమైంది. దాంతో చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకు దారి తీసింది.
* నేత కార్మికుల సంక్షేమం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పెపైచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు.
* 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సృష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. అప్పటి చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు.
* బాబు హయాంలో 1999-2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు.
* నేత కార్మికులకు పింఛను ఇవ్వాలని బాబు ఏనాడూ ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు.
* చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలను వంద వరకు మూసేశారు.
* ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు.
* బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భీవండి, సూరత్ వలసపోయారు.