babu diary
-
ఆ రోజులు మాకొద్దు!
బాబు డైరీ (ఎలక్షన్ సెల్): కరువు గజ్జె కట్టి నాట్యమాడుతుంటే .. కళ్లు తెరిచి చూసేందుకూ ఇష్టపడని రోజులు పంటల్లేక, పనుల్లేక జనం వలస వెళ్తుంటే.. పలకరించడానికీ మనసొప్పని రోజులు అప్పులపాలై అన్నదాత అసువులు బాస్తుంటే.. ‘అయ్యో పాపం’ అని కూడా అనని రోజులు పరిహారమడిగితే అజీర్తి మరణాలంటూ.. పరిహాసమాడిన రోజులు పసిబిడ్డలకు ఒక్కపూటైనా ఆకలి తీర్చమంటే.. ఆ ఒక్కటీ అడగొద్దంటూ తెగేసి చెప్పిన రోజులు ప్రాణాలు పోతున్నాయన్నా.. ప్రపంచ బ్యాంకు జపం వీడని రోజులు కన్నబిడ్డలు కడపాత్రం వెళుతుంటే.. కన్నీటి పర్యంతమైన రోజులు కడుపు మాడ్చుకోలేక, క‘న్నీటి’ని తాగలేక... దాతలిచ్చిన గంజినీళ్లతో ప్రాణాలు నిలుపుకున్న రోజులు ‘కంటి పాపల’ కడుపు నింపలేక.. కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు .. ఆ రోజులు మాకొద్దు అంటున్నారు పల్లెప్రజలు. ఆ..కలి కాలం మళ్లీ వద్దంటున్నారు అన్నదాతలు. -
..ఏమంటారు?
బాబు డైరీ: ఎలక్షన్ సెల్: సాయం చేసిన చేతిని కసిగా కాటేసేవాడిని నమ్మించి నట్టేట ముంచినవాడిని కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకునేవాడిని మనసులో విషం పెట్టుకుని మాటల్లో అమృతం కురిపించేవాడిని ఒళ్లంతా కుళ్లు పెట్టుకుని తుళ్లుతూ మాట్లాడేవాడిని ఆదరించిన గుండెల్లో చిచ్చుపెట్టినవాడిని ..ఏమంటారు? అధికారం కోసం అల్పమైన పనులు చేసేవాడిని కుట్రలు పన్ని కుహనా రాజకీయాలు చేసేవాడిని ప్రజలు వేసిన ఓటును పరిహసించినవాడిని జనం విశ్వసించిన ఆశయాలకు తూట్లు పొడిచినవాడిని వారు మెచ్చిన ఆదర్శాలకు తిలోదకాలు ఇచ్చినవాడిని డబ్బిచ్చి ముఠాకట్టి దళారీని తలపించేవాడిని ..ఏమంటారు? ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్యచేసినవాడిని అవకాశవాదంతో అధినేతనే గద్దె దించినవాడిని రాజుల పాలనను తలపించే అరాచక శిఖామణిని పేరు ఉచ్ఛరించడానికే అనర్హుడైనవాడిని అందలాలు ఎక్కిస్తే అధఃపాతాళానికి తొక్కినవాడిని చేరదీసినవాడికే వెన్నుపోటు పొడిచినవాడిని దేవుడు కూడా క్షమించలేని ఘాతుకానికి పాల్పడినవాడిని తెలుగుజాతికి ద్రోహం చేసినవాడిని ..ఏమంటారు? దుర్మార్గుడు... మేకవన్నె పులి... తేనెపూసిన కత్తి....గాడ్సేనే మించిన వాడు. అభినవ ఔరంగజేబు... గూడుపుఠాణీకి గురువు...కుట్రకు కొలువు. మోసానికి మూలస్తంభం... వెన్నుపోటుదారుడు ఇది ‘అన్న’ మాట. ఎన్టీఆర్ నోట పలికిన మాట!! మరి.. మీరేమంటారు? -
మేత మరిగిన నేత
ఎలక్షన్ సెల్: మూతపడిన అర్బన్ బ్యాంకులు మండిపడుతూనే ఉన్నారు డిపాజిటర్లు ప్రభుత్వ సంస్థల అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులతో సంబరాలు టూరిజానికి ఇచ్చిన స్థలాలు బదులుగా వచ్చిన ముడుపులు మద్యం అక్రమాలు ముద్దుగా నజరానాలు సోమశిల భూములు బడాబాబులే బకాసురులు ఏలేరు స్కాములు.. ఏలినవారే పాములు మాదాపూర్‌లో రహేజా మీరే అక్రమాలకు రాజా విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీ విజయవంతంగా తగిలింది లాటరీ టైమర్ల..తో నొక్కుళ్లు టైఅప్‌లతో వసూళ్లు స్కాలర్ షిప్పుల్లో అవినీతి సర్కారు సాగిందా రీతి వాటర్ షెడ్ పథకం.. వాటాలే ప్రథమం పనికి ఆహారం.. తమ్ముళ్లకు ఫలహారం నకిలీ స్టాంపుల కుంభకోణం నేటికీ నవ్వుతున్నారు జనం నెలకో స్కాం.. రోజుకో అక్రమం మీ హయాం.. అక్రమాల మయం మీ జమానా.. అవినీతి ఖజానా హరిగర్జన.. అచ్చేసింది అక్రమార్జన బీజేపీ చార్జిషీటు.. బయటేసింది కేస్షీటు మేత మరిగిన నేతా మీరు మాట్లాడేదే నీతా బురదలో గురివిందా బరితెగించి పరనిందా నీతిబూర ఊదుతున్న నేతబీరా నవవికాస పురుషుడు మీరా.. అని ప్రశ్నిస్తోంది.. తెలుగుప్రజ! బాబు డైరీ: బీజేపీ చార్జిషీట్ విశాఖ పోర్టు భూముల కుంభకోణం విశాఖపట్నం పోర్టు ట్రస్టు సేకరించిన భూములకు చెల్లించిన నష్ట పరిహారం విషయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చాయి. భూ పరిమితి చట్టం కింద మిగులు భూమికి కూడా పరిహారం చెల్లించారని ఆరోపణ. విచారణ ఎంతకాలం నడుస్తుందో ఎవరికీ తెలియదు. పారదర్శకత లేని విద్యుత్ ఒప్పందాలు 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1603 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ఒప్పదం చేస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు అది అవినీతి ఒప్పందమని, రూ.250 కోట్లు చేతులు మారాయని నానా రభస చేసి తాము అధికారంలోకి రాగానే అదే కంపెనీతో రూ.2,384 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే 50 శాతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. రూ.1603 కోట్ల ఒప్పం దంలో రూ.250 కోట్లు చేతులు మారితే..రూ.2,384 కోట్ల ఒప్పందంలో ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటాయో. ఎల్అండ్టీ ఇన్ఫోసిస్ ఒప్పందం హైదరాబాద్ సమీపంలోని మాదాపూర్‌లో ఇన్ఫోసిటీ నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అతి చౌకగా భూమిని కేటాయించడంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫోసిటీ నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండానే ఎల్ అండ్‌టి సంస్థకు నిబంధనలను తుంగలో తొక్కి కట్టబెట్టడంపై విచారణకు డిమాండ్ చేసినా ప్రభుత్వం సంసిద్ధం కాలేదు. గ్లోబల్ టెక్నోయాడ్స్ సంస్థ ఒక చదరపు అడుగు అభివృద్ధి చేయడానికి రూ.2000లకు ముందుకు వస్తే, కాదని రూ. 2,700లకు ఎల్‌అండ్‌టి సంస్థకు ఇచ్చారు. చదరపు అడుగుకు రూ.500 ఎక్కువ కొటేషన్ వేసిన ఎల్‌అండ్‌టికి భవన నిర్మాణాన్ని అప్పగించారు. -
మందు.. బాబును మరిచినారా..?
ఎలక్షన్ సెల్: మద్యలక్ష్మి స్వాగతానికి వాడిన ‘మంగళ’వాద్యాలను.. రాజగురువుతో కలిసి పాడిన ‘సీసా’పద్యాలను.. అన్నకే కాదు.. ఆశయానికీ పొడిచిన వెన్నుపోటును.. మరిచినారా..? కన్నీటి కాసారాలైన సంసారాలను.. కూలిపోయిన కుటుంబాలను.. ఛిద్రమైన జీవితాలను.. శిథిలమైన బతుకులను.. మరిచినారా..? చేతకాకే ఎత్తేశామన్న చేవలేని మాటలను.. బాధతో తీసుకున్న నిర్ణయమంటూ మభ్యపెట్టే ప్రకటనలను.. అక్రమార్కులకు కళ్లెం వేయడం కోసమన్న కపటనాటకాన్ని.. మంది కోసమే మందు అన్న మార్గదర్శి మాటలను.. రాష్ట్రాన్ని ‘మద్య’ప్రదేశ్‌గా మార్చిన మందు‘బాబుల’ను.. మరిచినారా..? లిక్కర్‌తో చేసిన చీప్ ట్రిక్కులను.. బార్లా తెరుచుకున్న బార్లను.. గేట్లు తెంపుకొన్న సారాకొట్లను.. వళ్లు గుల్ల చేసిన కల్తీకల్లు అంగళ్లను.. ఇల్లు కొల్లగొట్టిన గొలుసు దుకాణాలను.. అడ్డగోలు అమ్మకాలకు పెట్టిన టార్గెట్లను.. మరిచినారా..? బాటిళ్లు వదిలి ఇంటింటికి చేరిన సారా భూతాలను.. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టిన ‘పచ్చ’ప్యాకెట్లను.. తడి, పొడి వ్యాపారాల తెలుగుతమ్ముళ్లను.. నడమంత్రపు సిరితో నెత్తినెక్కిన ‘నిషా’చరులను.. ఖజానాను కొల్లగొట్టిన దేశం కా‘మందు’లను.. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకున్న మద్యం మాఫియాను.. బడుగు బతుకుల్లో పెట్టిన ‘మందు’ పాతరను..మరిచినారా..? పేదింటి కాపురాలు నిలువునా కూల్చి.. ప్రభుత్వ ఖజానా నింపుకోవాలా? రాష్ట్రాన్ని నిషా మైకంలో ముంచి.. వ్యసన మహాభూతాన్ని ఊరూరా వదిలిపెట్టి.. జేబులు కొల్లగొట్టడం మినహా మద్యానికి మరో విధానమంటూ లేకుండా చేసి.. నిరుపేదల నట్టిళ్లలో బాటిళ్లతో నిప్పు రగిలించి.. కుటుంబాలను సర్వనాశనం చేసిన ఈ పాపం ఎవరిది? ‘నారా’సురుడు రాజేసింది కాదా.. ఈ మద్య మహా దావానలం? అయినా... మహాపాపం చేసి మరెవరి మీదో ఎందుకు నెపం? నిషేధానికి తూట్లు పొడిచిన బాబు గ్రామంలో సారాయి అమ్మకాలు జరపకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాం. మా ఉద్యమ స్ఫూర్తితో ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్టు దుకాణాలను ప్రోత్సహించారు. - గణేశం రవణమ్మ, తూర్పు దూబగుంట (నెల్లూరు జిల్లా) ఏరులై పారిన సారా చంద్రబాబు పాలనలో గ్రామాలు ఎడారులుగా మారాయి. సారా ఏరులై పారడంతో అనేకమంది రోగాల బారిన పడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సారా తయారీ తగ్గింది. సకాలంలో వర్షాలు కురవడంతో వారంతా వ్యవసాయ పనులు చేసుకున్నారు. - పూరేటి వెంకటరత్నం, చినకంచర్ల (గుంటూరు జిల్లా) తాగుబోతులను తయారు చేసిందే..బాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మద్యనిషేధానికి తూట్లు పొడిచాడు. చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడమే గాక.. పల్లెల్లో వైన్స్‌లకు అనుమతులు ఇచ్చి.. ప్రజలను తాగుబోతులుగా తయారు చేశాడు. - వేనేపల్లి పాండురంగారావు, మట్టిమనుషుల వేదిక కన్వీనర్, మిర్యాలగూడ (నల్లగొండ జిల్లా) మద్యాన్ని ఏరులై పారించాడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం అనేది లేకుండె...అప్పట్లో దొంగచాటున అమ్మేవారిని కూడా రామారావు ప్రభుత్వం అరికట్టింది. రామారావు మరణించిన తరువాత చంద్రబాబు పాలనలో మద్యాన్ని ఏరులై పారించాడు. ఆయన హయాంలో రాష్ర్ట పాలన భ్రష్టుపట్టింది. - మల్లయ్య , ద్వారకా నగర్, నిజామాబాద్ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన మద్యపాన నిషేధానికి బాబు తూట్లు పొడిచారు. దీంతో వేలాది కుటుంబాలు వీధినపడ్డాయి. గ్రావూల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించాడు. అధికారంలోకి వస్తే మద్యంపై ఆంక్షలు విధిస్తామని బాబు చెబుతున్న మాటలు నమ్మటానికి వీల్లేదు. - మందడి సులోచన, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా సెక్రటరీ, (నల్లగొండ జిల్లా) బాబు ఊరికో బెల్టుషాపు తెరిపించారు ఎన్టీఆర్ హయాంలో మేం పోరాడి సాధించుకున్న మద్య నిషేధానికి చంద్రబాబు ఒక్కసారిగా తూట్లు పొడిచారు. గ్రామానికో బెల్టుషాపు తెరిపించారు. అప్పట్నుంచి పల్లెల్లో ప్రశాంతత కరువైంది. శాంతభద్రతలు అదుపు తప్పాయి. - చల్ల శాంతకుమారి, బాపూజీ మహిళా ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, బాడంగి (విజయనగరం జిల్లా) ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నా... చంద్రబాబు హయాంలో ఊరూరా బెల్టుషాపులు పెట్టారు. మగవారు తమ కూలి డబ్బుల్లో మూడొంతులు మద్యానికే తగలబెట్టేవారు. మద్యం కారణంగా మా పల్లెలోని చాలా కుటుం బాల్లో వెలుగులు ఆరిపోయాయి. నా ఇద్దరు కుమారులు కూడా మద్యం మహ మ్మారికి బలైపోవడంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. - అచ్చమ్మ, దర్శి (ప్రకాశం జిల్లా) బాబు పాపమే నాకు శాపం నా భర్త పేరు వసంతప్ప. ఇద్దరు ఆడబిడ్డలు. ఇద్దరం కూలి చేసి పిల్లలను పెంచుకునేవాళ్లం. మా ఆయన తాగుడుకు అలవాటు పడ్డాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు సారా అంగళ్లన్నీ మూయించేస్తే నాకు చాలా సంతోషమైంది. చంద్రబాబు వచ్చాక మళ్లీ తెరిచారు. మా ఆయన కూలీ డబ్బులన్నీ తాగుడుకే పెట్టేవాడు. చివరికి దానికే బలయ్యాడు. ఆడపిల్లలను ఎలా పెంచాలో అర్థం కాలేదు. చివరికి పాచి పనిచేసి వారికి పెళ్లిళ్లు చేశా. చంద్రబాబు చేసిన పాపమే నాకు శాపమైంది. - తాయమ్మ, ఆలూరు(కర్నూలు జిల్లా) చంద్రబాబు తమ్ముడిపైనే సారా కేసుంది చంద్రబాబు హయాంలో ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సారా వ్యాపారం చేస్తున్నాడని కేసు నమోదైంది. బాబు ఊళ్లోనే సారా వ్యాపారం జరుగుతోందని రైడ్ చేయించారు. మద్యం ముసుగులో కోట్లు దండుకున్నది బాబే. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా నిషేధాన్ని తొలగించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేశాడు. బాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. - సుబ్రమణ్యం యాదవ్, మాజీ సర్పంచ్, రెడ్డి వారిపల్లె(చిత్తూరు జిల్లా) -
బాబు పాలనలో ఉద్యోగులపై వేధింపులు
ప్రభుత్వోద్యోగులపై చంద్రబాబు సాగించిన జులుంకు పరాకాష్టగా చెప్పదగ్గ ఉదంతమిది. ఫొటోలోని మృతుడు అప్పటి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కె.అప్పారావు. మరికొద్ది నెలల్లో రిటైర్ కావాల్సిన ఆయనను, తోటి అధికారుల ముందు బాబు చేసిన అవమానం పొట్టన పెట్టుకుంది. టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా బాబు తీవ్ర పదజాలంతో మందలించడంతో అప్పారావు బాగా చిన్నబుచ్చుకున్నారు. అది టీవీ చానెళ్లలో కూడా ప్రముఖంగా రావడం, బంధుమిత్రులు, తెలిసిన వారు ఫోన్లు చేసి ఏం జరిగిందంటూ ఆరా తీయడంతో అయిన వారందరిలోనూ నవ్వులపాలయ్యానన్న భావనతో కుంగి పోయారు. దాంతో సన్నిహిత మిత్రుడు రాత్రి భోజనానికి పిలిచినా వెళ్లలేదు. మర్నాడు ఉదయం ఆఫీసుకు బయలు దేరుతూ, గుండెపోటుతో కారు వద్దే కుప్పకూలి మరణించారు. ఎలక్షన్ సెల్: ప్రజల వద్దకు పాలన.. నీరు-మీరు.. శ్రమదానం.. క్లీన్ అండ్ గ్రీన్.. పథకాల పేర్లు ఏవైనా.. మాకే వేదన! యాతన!! రు..బాబు ఉన్నట్టుండి ఊడిపడతాడు ఉరుకులు పెట్టించి దడ పుట్టిస్తాడు నడిబజారులో నిలబెడతాడు హీనాతిహీనంగా చూస్తాడు పిచ్చ పిచ్చగా ఉందా అంటాడు కక్ష గట్టినట్టు పచ్చిగా తిడతాడు లంచగొండులని ముద్ర వేస్తాడు అడుగడుగునా అవమానిస్తాడు అందరిముందూ అవహేళన చేస్తాడు ఆత్మగౌరవం దెబ్బ తీస్తాడు వెనకాముందూ చూసుకోడు సస్పెన్షన్, టేక్ యాక్షన్ అంటాడు ప్రజలను ఉసిగొల్పుతాడు కట్టేసి కొట్టమంటాడు బాధ్యతాయుతమైనవారిని బానిసల్లా చూస్తాడు ఎవరైనా నోరు తెరిస్తే నాకు నచ్చదంటాడు నా అంతటివాడు లేడంటాడు నియంతలా నిప్పులు కక్కుతాడు గుండెల్లో నిద్రపోతా అంటాడు మనశ్శాంతి లేకుండా చేస్తాడు మానవత్వం మరుస్తాడు ఉసురూ పోసుకుంటాడు పబ్లిక్ సర్వెంట్లను.. పబ్లిగ్గా సర్వెంట్లలా చూస్తాడు.. .. అంటున్నారు నారా సర్కార్‌లో నరకం అనుభవించిన ఉద్యోగులు. ఆ రోజులు మాకొద్దు అంటున్నారు. తీవ్ర ఒత్తిళ్లతో రోగాలొచ్చాయి చంద్రబాబు ఉన్నప్పుడు ఉద్యోగానికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేది. గంట సవుయుమిచ్చి వంద పేజీల రిపోర్టు ఇవ్వమనేవారు. చిన్న పొరపాట్లు ఉన్నా హీనంగా తిట్టేవారు. ఎండాకాలంలో ఊళ్లలో నీళ్లు దొరక్కపోరుునా అధికారులను బాధ్యులు చేసేవారు. పని ఒత్తిడి, నిత్యం భయంతో విధులు నిర్వర్తిం చడం వల్ల అనేకమందికి బీపీ, షుగర్ వంటి రోగాలొచ్చాయి. - లింగయ్య, ఆర్‌డబ్ల్యుఎస్( రిటైర్డ్) ఎస్ఈ, హన్మకొండ ఉద్యోగులను అవమానించారు ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు దండగనే ధోరణిలో చంద్రబాబు ఉండేవారు. అందుకే ఆయన పాలనలో ఉద్యోగులకు వేధింపులు ఎక్కువగా ఉండేవి. అందరి ముందు అవమానకరంగా మాట్లాడటంతో కొందరు ఉద్యోగులు మనోవేదనకు గురై మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. - వేముల ప్రభావతి, విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి, రాజమండ్రి ప్రత్యక్ష నరకం చూపారు తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగులు, పెన్షనర్లకు చుక్కలు చూపించారు. ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు డీఏ ఇవ్వడం సర్వసాధారణం. కానీ చంద్రబాబు ఐదు విడతల డీఏ ఇవ్వలేదు. ఉద్యోగ విరమణ చేసిన మీకు డీఏ దండగంటూ అవమానపరిచారు. దీన్ని ఎన్నటికీ మరచిపోలేం. ఉద్యోగులను లంచగొండులు, దొంగలుగా చూసిందీ ఆయనే. ఇప్పుడు అధికారం కోసం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు నమ్మితే అధోగతే. - పెద్దారెడ్డి, పెన్షనర్ల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు మనోవేదనకు గురి చేశారు చంద్రబాబు అప్పట్లో ఉద్యోగులపై ఎంతో ఒత్తిడి పెంచారు. జన్మభూమి లాంటి కార్యక్రమాల పేరిట పరుగులు పెట్టించడం తప్ప ఆయన చేసిన అభివృద్ధేమీ లేదు. పెన్షనర్లకు డీఏ ఇవ్వలేదు. - కేశవులు, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, చిత్తూరు శ్రమ దోపిడీ చేశారు చంద్రబాబు హయాంలో ప్రతి రెండో శనివారం ‘పచ్చదనం-పరిశుభ్రత’ అంటూ ఉద్యోగుల సెలవులను హరించారు. శ్రమను దోచుకున్నారు. అభివృద్ధి పెద్దగా చేయకపోయినా నివేదికలు ఇవ్వాలంటూ పరుగులు పెట్టించారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగులకు, పెన్షనర్లకు రాయితీలు ఇస్తాననడం శోచనీయం. ఇంతకుముందు పదో పీఆర్సీలో చేర్చిన డిమాండ్లను చంద్రబాబు తన మేనిఫెస్టోలో చూపించటం విడ్డూరంగా ఉంది. తాను మారానని ఆయన చెబుతున్నా... ఉద్యోగులెవరూ నమ్మే పరిస్థితి లేదు. - జి .ఆనందరావు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు, ఏలూరు వెట్టిచాకిరీ చేయించారు చంద్రబాబు ఉద్యోగులను హీనంగా చూశారు. టీడీపీ ప్రభుత్వ నీచమైన పనులకు ఉద్యోగులను బాధ్యులను చేసేవారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం అప్రెంటీస్ విధానం పెట్టి ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయించారు. - కొత్తపల్లి గురుప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఖమ్మం కార్మికులను జైలుకు పంపించారు టీడీపీ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు. సమ్మె చేస్తే నాయకులతో పాటు కార్మికులను జైలుకు పంపించిన ఘనత చంద్రబాబుది. 9.5 శాతం మాత్రమే వేతనం పెంచారు. అదే వైఎస్ వచ్చాక 24 శాతం పెంచారు. - మధుసూదన్, ఎన్ఎంయూ రాష్ట్రకార్యదర్శి, కర్నూలు బానిసలుగా చూసేవారు అప్పట్లో ఉద్యోగులను చంద్రబాబు బెదిరించేవారు. తీవ్రఒత్తిడికి లోనై చాలామంది అనారోగ్యం బారిన పడిన సందర్భాలున్నాయి. సీసీఏ రూల్స్‌ను అడ్డం పెట్టుకుని కర్ర పెత్తనం చేశారు. బానిసలుగా చూశారు. - పీవీ పద్మనాభం, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, విజయనగరం ఇంట్లో పనివారిగా, వేతన కూలీల్లా చూశారు చంద్రబాబు తన పాలనలో ఉద్యోగులను ఏనాడు ఉద్యోగులుగా చూడలేదు. ఇంట్లో పనివారుగా, వేతన కూలీలుగానే చూశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు. బానిసలుగా చూశారు. నీ సంగతి ఏంటి.. తమాషా చేస్తున్నావా అంటూ హేళన చేస్తూ, మీరే శిక్షించడంటూ తిట్టేవారు. ఉద్యోగి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. కానీ అవమానాల పాలు చేశారు. వాటిని భరించలేక పలువురు ఉద్యోగం వదిలి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. టీచర్ల అప్రెంటిస్ రెండేళ్లు వద్దని ఉపాధ్యాయులు మొత్తుకుంటే దానిని నాలుగేళ్లకు పెంచారు. ఉపాధ్యాయులు ఆందోళనలు చేయడంతో వెనక్కి తగ్గారు. - పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి డీఏ ఎగ్గొట్టారు చంద్రబాబు ఎగ్గొట్టిన ఎన్నో విడతల డీఏను 2004లో అధికారంలోకి రాగానే వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. చంద్రబాబు తన పాలనా కాలంలో పెన్షనర్ల పట్ల అవమానకర రీతిలో వ్యవహరించి... మానసిక వేదనకు గురి చేశారు. ఉద్యోగులందరూ అవినీతిపరులేనని ముద్ర వేశారు. చాలామందిని అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఉద్యోగులను ఎన్నో విధాలుగా వేధించిన చంద్రబాబు వారికి ఇప్పుడు మద్దతుగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన మాటలు నమ్మితే ప్రమాదమే. - సి.శివరామిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, కర్నూలు బాబు వల్ల ఎన్నో బాధలు పడ్డాం చంద్రబాబు వేధింపులు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి, ఇంకుడు గుంతలు, పరిసరాల పరిశుభ్రత, గ్రామసభలంటూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో ైఫైళ్లు పెండింగ్ పడితే మెమోలిచ్చారు. ఆయన వల్ల చాలా నష్టపోయాం. -తోటపల్లి సోమశేఖర్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ , ఒంగోలు -
బాబు హయాంలో అన్నదాతకు అష్టకష్టాలే
రైతుల ఉసురు పోసుకున్న చంద్రబాబు బాబు డైరీ: కాల్చుకుతిన్నాడు * బాబు హయాంలో అన్నదాతకు అష్టకష్టాలే * విత్తనాలడిగితే తూటాలతో తూట్లు పొడిచారు * చార్జీలు తగ్గించమంటే లాఠీచార్జీలు చేయించారు * బిల్లులు కట్టలేమంటే నిలువు దోపిడీ చేయించారు * తలుపు చెక్కలు కూడా ఊడబెరికించిన ఘనుడు * అవమానాలు భరించలేక అన్నదాతల ఆత్మహత్యలు * ఆద్యంతం రైతు రక్తంతో తడిసిన బాబు హయాం * నాటి కష్టాలను నేటికీ మర్చిపోలేకపోతున్న రైతులు ఎలక్షన్ సెల్: ప్రపంచబ్యాంకు దూత.. కర్షకుడిపై విరుచుకుపడ్డాడు వ్యవసాయం దండగన్నాడు కళ్లు తిరిగేలా కరెంటు బిల్లులిచ్చాడు కోతలకు రైతులే కారణమన్నాడు చర్రున తిరిగే చైనా మీటర్లు తెచ్చాడు మోటార్లకు మీటర్లు బిగించాడు హార్స్పవర్ రేటును పెంచేశాడు రకరకాల చార్జిలతో పిప్పిచేశాడు నీటి తీరువానూ పెంచాడు నిస్సహాయులను దొంగల్లా చూశాడు వేలాది కేసులు పెట్టించాడు కనెక్షన్లు తొలగించాడు ప్రభుత్వానికి సరెండర్ చేయమన్నాడు తుపానొస్తేనే కరువు తీరుతుందన్నాడు పంట ఎండిపోతే బుద్ధి వస్తుందన్నాడు. పరిహారం ఫ్యాషనవుతుందన్నాడు. పేదబతుకులను పరిహాసం చేశాడు. బషీర్‌బాగ్, కాల్దరి, చినగంజాం.. ఊరేదైనా ఉద్యమంపై ఉక్కుపాదం మోపాడు బక్కరైతు గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎండిన డొక్కలపై తన్నాడు. ఎముకల గూళ్లనూ ఎండేలా చేశాడు. కర్షకులను ‘కాల్చుకు’తిన్నాడు. ఇలా చేసిన పాలకుడు ఆయనొక్కడే అనిపించుకున్నాడు! అన్నదాత.. నేలతల్లిని నిత్యం కొలుస్తాడు. ఆరుగాలం మట్టితో మమేకమవుతాడు. అవనికి ఆకుపచ్చని చీర కడతాడు. జాతికి అన్నప్రాసన చేస్తాడు. దేశానికి విస్తరి వేస్తాడు. తొమ్మిదేళ్ల వ్యథ.. ప్రకృతి పగబట్టింది చినుకు రాలడం గగనమైంది భూమి బీటలు వారింది కరువు కరాళనృత్యం చేసింది అన్నపూర్ణ ఆకలికేకలు పెట్టింది గుండెకోత.. రైతన్న అల్లాడిపోయాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు కాళ్లు కడుపులో పెట్టుకు పడుకున్నాడు పిడికెడు మెతుకులకు తపస్సు చేశాడు ఫలితం లేక.. కిడ్నీలూ అమ్ముకున్నాడు ఆకలిచావులకు గురయ్యాడు ఆశ వదిలి ఆచేతనుడయ్యాడు ఇంటి చూరులో ఉరికొయ్యను చూశాడు పురుగులమందును తులసితీర్థంలా సేవించాడు ప్రభుత్వం ఆదుకోలేదు నా భర్త మరణించి 14 ఏళ్లు దాటి ంది. ఆయనను పొట్టనబెట్టుకున్నాక కుటుంబ భారమంతా నా మీదే పడింది. నలుగురు కూతుర్ల ఆలనా పాలనా, పిల్లాడి చదువు భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోదామనిపిస్తోంది. అప్పటి ప్రభుత్వం సాయం అందించి ఉంటే బాగుండేటోళ్లం. - వెంకటశేషమ్మ, చినగంజాం మృతుడు పుల్లారెడ్డి భార్య పెద్దదిక్కును కోల్పోయాం రైతు ఉద్యమంలో పాల్గొన్న మా వారిని అప్పటి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. నాకు ఇద్దరమ్మారుులు. ఒక అబ్బారుు. ఇంటాయన పోవ డంతో మేం పడిన కష్టాలు ఆ భగవంతుడికే తెలియూలి. నేటికీ ఆ బాధను మర్చిపోలేకపోతున్నాం. - తులసీరత్నం, కాల్దరి మృతుడు కృష్ణారావు భార్య రక్తం రుచి మరిగిన పులి, కేవలం వయసుడిగినంత మాత్రాన శాకాహారిగా మారిపోతుందా? మారదు గాక మారదు. స్వర్ణ కంకణాన్ని ఎరగా వేసైనా సరే, నర మాంసంతోనే ఆకలి తీర్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చంద్రబాబూ చేస్తున్నదీ అదే. లెక్కలేనన్ని సార్లు రైతుల రక్తం కళ్లజూసిన, వారిని పిట్టల్లా కాల్పించి పొట్టన పెట్టుకున్న ఈ రక్తచరితుడు... వరుసగా రెండుసార్లు తనకు దూరమైన అధికారాన్ని ఈసారి ఎలాగైనా అందిపుచ్చుకునేందుకు నానా గిమ్మిక్కులూ చేస్తున్నారు. ఆ క్రమంలో... ‘నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను’ అంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు. అచ్చం ఆ ‘శాకాహారి’ ముసలి పులినే గుర్తుకు తెస్తున్నారు. సాగు దండగన్న నోటితోనే రైతు జపం చేస్తున్నారు. వారి గురించి పోరాడి తీరతానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తనను నమ్మి మరోసారి అధికారం అప్పగిస్తే ఏకంగా రుణాలనే మాఫీ చేసేస్తానంటూ వాగ్దానాలు గుమ్మరిస్తున్నారు. కానీ బాబు ఏం చెప్పినా సరే, ఆయన పేరు వింటేనే తెలుగు రైతులు ఇప్పటికీ భయంతో ఉలిక్కిపడుతున్నారు. ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది మరి! బాబు పాలనా కాల మంతా రైతు రక్తంతో నిలువెల్లా తడిసి ఎర్రబడిందే. జీవితం నాశనమైపోయింది ఊరెళదామని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. జనం గుంపుగా ఉంటే ఆసక్తిగా చూస్తున్నా. ఇంతలోనే పోలీసులు విరుచుకుపడ్డారు. వెంటనే వెనుతిరిగి వస్తుంటే రైల్వేట్రాక్‌లో పడి చెప్పు తెగింది. కిందకు వంగి సరిచేసుకుంటుండగా పోలీసులు కాల్చిన బుల్లెట్ వచ్చి తలకు తగిలింది. ఆ దెబ్బకు కోలుకోలేకపోయాను. తర్వాత శరీరం చచ్చుబడిపోయింది. చేతులకు పక్షవాతం వచ్చేసింది. ఉత్తిపుణ్యాన జీవితం నాశనమైపోయింది. - ముళ్లపూడి సత్యనారాయణ, కాల్దరి బాధితుడు అన్యాయంగా కాల్చారు రెండ్రోజులు ఊరెళ్లి ఆ రోజు ఇంటికొచ్చా. మా రైస్‌మిల్లు వద్ద కూలీలకు డబ్బులిస్తుండగా.. పక్కన పొగ రావడం చూసి ఏంటని చూశా. జనం బస్సు తగులబెట్టారు. రైలు ఆపుతున్నారంటే స్టేషన్‌కు వెళ్లా. జనాన్ని పోలీసులు చెదరగొట్టారు. కాల్పులు జరిపారు. నా కాలికి బుల్లెట్ తగిలింది. కిందపడ్డాను. సీఐ నేరుగా వచ్చి కాలర్ పట్టుకుని తలపై పిస్టల్‌తో కాల్చాడు. స్పృహ తప్పి పడిపోయాను. మా నాన్న రామకృష్ణకు కూడా కాలర్‌బోన్ వద్ద బుల్లెట్ గాయమైంది. ప్రభుత్వం ఏమిచ్చినా నష్టాన్ని పూడ్చలేదు. నా జీవితం అవిటిదైపోయింది. -కాకర్ల వీరవెంకట సత్యనారాయణ, కాల్దరి కరెంటు చార్జీలను, నీటి తీరువాను తగ్గించమన్నందుకు 1996లో కాల్దరి రైతులను తూటాలతో తూట్లు పొడిచిన తీరును... కార్పొరేట్ కంపెనీని నెత్తిన పెట్టుకుని మా పొట్ట కొడతారా అని నిలదీసిన పాపానికి 2000 ఫిబ్రవరిలో చినగంజాం రైతులనూ పిట్టల మాదిరిగా కాల్పించిన వైనాన్ని... కరెంటు చార్జీల పెంపును నిరసించినందుకు 2000 ఆగస్టులో సాక్షాత్తూ రాజధాని నడిబొడ్డున, పట్టపగలు అన్నదాతలపైకి తుపాకీలు ఎక్కుపెట్టించి వారిని పొట్టన పెట్టుకున్న పాశవికత్వాన్ని... విత్తనాలివ్వండని అడిగినందుకు 2003 జూలైలో చేవెళ్లలో బడుగు రైతును బులెట్లకు బలి చేసిన బరితెగింపును... న్యాయం కోసం అన్నదాత రోడ్డెక్కినప్పుల్లా లాఠీలు విరగ్గొట్టించి, గుర్రాలతో తొక్కించి అణగదొక్కిన తీరును... దేన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా. రైతులను దొంగల్లా చూసిన తీరు. కరెంటు చార్జీలు కట్టలేమన్నందుకు వారి ఇళ్లపై పడి చేసిన దౌర్జన్యం. తలుపు చెక్కలతో సహా ఊడబెరుక్కుని లాక్కెళ్లిన వైనం. ఇలాంటి అవమానాలను భరిస్తూబతకలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డ దైన్యం... ఇలా బాబు పాలన సమస్తం రైతుల పాలిటి పీడకలే. ఆ గతం చెరిపేస్తే చెరిగేది కాదు. గత రెండు ఎన్నికల్లో బాబు భవిష్యత్తును నిర్దేశించింది ఆ గతమే. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే పునరావృతం కానుంది. -
బాబు పాలనలో చీకటి రోజులు ఎలా మరిచిపోగలం..?
బాబు డైరీ (ఎలక్షన్ సెల్): నరమాంసం రుచి మరిగిన పులి తాను శాకాహారిగా మారానని చెప్పుకుంటే అనుమానించాలా? నమ్మి దగ్గరకు వెళ్లాలా? వ్యవసాయూనికి రోజూ పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా సరఫరా చేస్తానంటున్న చంద్రబాబు హామీలను చూసి అందరికీ వస్తున్న సందేహమిది.. ఆయన పాలన నాటి చీకటి రోజులు గుర్తుకొచ్చి వణికి పోతున్న సందర్భమిది.. ఎలా మర్చిపోగలం.. నెత్తుటి జ్ఞాపకాలను అంటున్నది సామాన్యుడి మది!! - వైఎస్ ఉచిత కరెంటిస్తానంటే అది సాధ్యం కాదని, అందుకు ప్రపంచ బ్యాంకు నిధులివ్వదన్న కేకలను.. ఉచిత కరెంటిస్తే ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతుందని, తీగలు బట్టలారేసుకోవడానికేనన్న వెక్కిరింతను.. వ్యవసాయ విద్యుత్తుపై ఎన్టీఆర్ హెచ్‌పీకి రూ.50 వసూలు చేస్తే, దానిని రూ.600 చేసిన వెన్నుపోట్లను.. - మోటార్లకు మీటర్లు బిగించి, మళ్లీ యూనిట్‌కు ఇంతచొప్పున చార్జీలు పెంచాలనే ప్రయత్నాలను.. అన్నదాతలను దొంగలుగా చూసి బేడీలు వేసి జైళ్లలోకి తోసిన రోజులను.. - గిర్రున తిరుగుతూ వినియోగదారుల పర్సులు ఖాళీ చేసే చైనా మీటర్లను బిగించిన క్షణాలను.. - అధిక చార్జీలు, సర్‌చార్జీలు, పెనాల్టీ చార్జీలు.. లాంటి పేర్లతో పీల్చిపిప్పిచేసిన జ్ఞాపకాలను.. - కరెంటు సంస్థలను ముక్కలు చేసి ప్రైవేటు సంస్థలకు తెగనమ్మాలని రచించిన ప్రణాళికలను.. - విద్యుదుత్పత్తి ప్లాంట్లు స్థాపించకుండా, జెన్కోకు డబ్బివ్వకుండా దివాలా తీయించే యత్నాలను... - వ్యవసాయూనికి అధిక కరెంటు ఇస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ‘మనసులో మాట’ను.. మరీ ముఖ్యంగా.. - చార్జీలు తగ్గించాలని ఉద్యమించినవారిని కాల్చిచంపిన ‘పచ్చ పులిని’.. - ఇప్పుడు కరెంటు ఉచితం అంటున్న హామీలను.. బాబు ‘పవర్’లో ఉన్నపుడు.. - కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్.. పొలాల్లో పోలీసుల కవాతులు - అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లల్లో ఏకంగా 8 సార్లు కరెంటు చార్జీలను పెంచారు. - రైతులపై దాడులు.. కేసుల నమోదు.. రైతుల కోసం ప్రత్యేకంగా జైళ్ల ఏర్పాటు - పొలం మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు. అధికారం కోసం మళ్లీ.. - 2009 ఎన్నికల ముందు వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీనిచ్చి... ఇపుడు దానిని కూడా తగ్గించి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అంటున్నారు. గంటకో మాట...గడియకో హామీ ఇచ్చే బాబును ఎలా నమ్మేదని రైతులు నిలదీస్తున్నారు. మళ్లీ ఆయన వస్తే మాకు జైలే గతి అని వాపోతున్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక.. - వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 78 వేల కేసులను ఎత్తివేశారు. సుమారు 2 లక్షల మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు. - రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. - రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేశారు. చంద్రబాబుకు మా ఉసురు తగులుద్ది కరెంటు చార్జీలు తగ్గించాలని అడిగినందుకు చంద్రబాబు బషీర్‌బాగ్‌లో పోలీసోళ్లను ఉసిగొల్పి నా భర్త రామకృష్ణను కాల్చి చంపించాడు. నా భర్తను పొట్టనబెట్టుకున్న చంద్రబాబుకు మా కుటుంబం ఉసురు తగిలింది. అందుకే రెండుసార్లు ఓడిపోయిండు. మళ్లీ ఓడిపోతాడు. రామకృష్ణ చనిపోయేనాటికి నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. బతుకుపై మా కుటుంబమంతా ఆందోళన చెందాం. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాకు అండగా నిలిచాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఆయన మేలును మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు. - సత్తెనపల్లి మంగ, రామకృష్ణ భార్య -
బీజేపీపై చంద్రబాబు రెండు నాల్కలు ధోరణి
మాట.. ఈ మాటకు అర్థం బాబుకు తెలీదు. నేను మారిపోయాను అంటాడు. ఎందుకు మారాడో మాటమాత్రమైనా చెప్పడు. వ్యవసాయం దండగ అనేస్తాడు. ఎప్పుడన్నానో చెప్పమంటూ మాట మారుస్తాడు. ఉచిత కరెంటు ఇస్తామంటే తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ఇపుడు గంటలకు గంటలు ఫ్రీగా కరెంటు ఇస్తానంటున్నాడు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నాడు. ఇపుడు రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు. బీజేపీతో పొత్తుపెట్టుకోనంటాడు. కొన్నాళ్లకు జతకడతాడు. అధికారం పోయాక ఇదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. అంటాడు. మోడీ వల్ల లబ్ధి కలుగుతుందేమోనని.. ముసుగు తీసేసి మళ్లీ జతకట్టేశాడు. మాట మార్చడం బాబుకు అలవాటు. కాదు.. కాదు.. అది ఆయన నైజం! మాట మీద నిలబడటం ఎప్పుడు నేర్చుకుంటావు.. బాబూ! సారీ.. ఈ మాట అడగటం దండగ బాబూ!! -
అగమ్య గోచరం
బాబు డైరీ: దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను పక్కన పెట్టడంతో కృష్ణా నదిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వరద జలాలను ఆధారం చేసుకుని నిర్మిస్తున్న మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండ జిల్లాలోని ఏఎమ్మార్పీతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడే హంద్రీ-నీవా, గాలేరు- నగరి, వెలుగొండ వంటి ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరమైంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో వీటికి నీటి సరఫరా ఉండదు. పైగా ట్రిబ్యునల్ కొత్త తీర్పు వల్ల రాష్ట్రానికి వచ్చే నీటి వాటా భారీగా తగ్గనుంది. దుమ్ముగూడెం ప్రాజెక్టును నిర్మిస్తే.. పైన పేర్కొన్న ప్రాజెక్టులకు నీరు లభించే అవకాశం ఉంది. -
కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం..
ఆందోళనలపై ఉక్కుపాదం.. ‘పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే కార్మిక సంఘా లనే రద్దు చేస్తా... ఐదారు వేల మందిని తీసుకొచ్చి ప్రదర్శన చేసినంత మాత్రాన భయపడేవాణ్ని కాదు...’ తమ సమ స్యలను నివేదించుకునేందుకు వచ్చిన విద్యా వలం టీర్ల మీద చంద్రబాబు విరుచుకు పడిన తీరిది. ఉత్తుత్తి హామీలు రాష్ట్రంలో 2000 సంవత్సరం నాటికి లక్ష కోట్ల రూపాయలు పారిశ్రామిక పెట్టుబడి లక్ష్యాన్ని సాధిస్తాం - ముఖ్యమంత్రి ప్రకటన (19.10.96) గత ఏడాది 3203 కోట్లతో 52 మంది పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఈ ఏడాది 1003 కోట్లతో 26 కొత్త ప్రతిపాదనలు మాత్రమే అందాయి. (18.7.97న పత్రికావార్త) -
బాబు డైరీ: ఆసరా అంతంతే..
ఇదీ తేడా! * మైనార్టీలకు కేవలం రూ.32కోట్ల బడ్జెట్ కేటాయించారు. * మైనార్టీ విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనంతరం పై చదువుల కోసం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు అందించేవారు. * దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీ * వితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు 3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు. * రోష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సీడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ * మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికసాయం కిరణ్ హయాం * మైనార్టీల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచారు. * మైనార్టీల బడ్జెట్‌ను రూ.1027 కోట్లకు పెంచారే కానీ 2014 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. * ఫీజు రీయింబర్స్మెంట్, ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ ఇవ్వలేదు. * మాస్ మ్యారేజెస్ పథకాన్ని నీరుగార్చారు. సబ్సిడీ రుణాలదీ ఇదే స్థితి. వైఎస్ హయాం * బడ్జెట్ రూ. 350 కోట్ల వరకు పెంపుదల * పేద ముస్లింలకు రుణ మాఫీ * అర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు * డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు * నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు * స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులవుతున్నారు. * ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి. * ముస్లిం పేద అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు. * కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాల పంపిణీ * దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు * రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపు. * మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు. * మదర్సాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు * యువతకు ఐటీ,వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన. నాకు పునర్జన్మ లభించింది ఐస్‌ఫ్రూట్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అనుకోకుండా 2010 సంవత్సరంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గుండె శస్త్ర చికిత్స చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన నా దగ్గర డబ్బులేని దుస్థితి. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉండడంతో వెంటనే మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేశారు. నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆస్పత్రిలో ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇంటికి వచ్చేందుకు బస్సు చార్జీలు సైతం ఇచ్చారు. మళ్లీ ఏడాది కాలం పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు..వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారానే నాకు పునర్జన్మ లభించింది.. - మహమ్మద్ ఫజలుద్దీన్, జిరాయత్‌నగర్, ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా -
బాబు పాలనలో వృద్ధుల ఆకలి కేకలు
ముదిమి వయుసులో రూ.75 పింఛన్ కోసం చంద్రబాబు ప్రభుత్వంలో నరకం చూడాల్సి వచ్చేది. ఒక లబ్ధిదారుడు చనిపోతే తప్ప మరొకరికి పింఛన్ ఇవ్వలేని దుస్థితి. 2002లో జరిగిన ఒక ఘటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. నెల్లూరుకు చెందిన 68 ఏళ్ల చింతల పుల్లవ్ము పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సర్కారు కరుణించలేదు. ఓ ‘తెలుగు తవుు్మడు’ చెబితే అప్పు చేసి మరీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చింది పుల్లమ్మ. పడిగాపులే తప్ప చంద్రబాబును కలిసి గోడు చెప్పుకొనే భాగ్యం కలగలేదు. వారం పాటు నిరీక్షించాక ఆకలి భరించలేక పుల్లవ్ము భిక్షాటన చేయూల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన వ్యూచింగ్ గ్రాంటునే సగానికి కోతవేసి రూ.75 చొప్పున విదిల్చిన ఘనుడు చంద్రబాబు. -
బాబు పాలనలో చేనేతల కష్టాలు
బాబు పరిహాసం.. ‘పరిహారమిస్తే ఆత్మహత్యలు పెరుగుతాయి ’బాబు డైరీ: నేతన్న నిండుగా దుస్తులు ధరించలేని దుస్థితి చంద్రబాబు జమానా. కడుపు నిండా ఒక్కపూటైనా ఇంటిల్లిపాదికి అన్నం పెట్టలేని దా‘రుణాలు’. ఏడాదికిపైగా వస్త్ర ఖరీదు సొమ్ము ప్రాథమిక చేనేత సంఘాలకు బాబు సర్కార్ చెల్లించనేలేదు. దాంతో 1994-95 కాలంలో రూ.126 కోట్ల ఆప్కో వ్యాపారం 1998-99 కాలానికి రూ.280 కోట్లకు పెగకపోగా, రూ.60 కోట్లకు పడిపోయింది. పైగా, తాను కేంద్రంలో చక్రం తిప్పడం వల్లే బీజేపీ సర్కార్ ఏర్పడిందని గొప్పలు చెప్పుకున్న బాబు చేనేత వస్త్రాలపై 20 శాతం సబ్సిడీ కొనసాగింపులో ఘోర వైఫల్యం చెందారు. ఫలితంగా చేనేత వస్త్రాలు గుట్టలుగా పేరుకుపోయి.. పనులు లేక నేతన్నలు అల్లాడారు. ఎవరైనా ధైర్యం చేసి అప్పు చేసి వస్త్రాల్ని నేస్తే.. వాటి అమ్మకాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రోత్సాహం శూన్యమైంది. దాంతో చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకు దారి తీసింది. * నేత కార్మికుల సంక్షేమం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పెపైచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు. * 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సృష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. అప్పటి చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు. * బాబు హయాంలో 1999-2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు. * నేత కార్మికులకు పింఛను ఇవ్వాలని బాబు ఏనాడూ ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు. * చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలను వంద వరకు మూసేశారు. * ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు. * బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భీవండి, సూరత్ వలసపోయారు. -
చదువుపై చంద్రుడి నిర్లక్ష్య మంత్రం..
తొమ్మిదేళ్ల పాలనలో విద్యార్థులపై చిన్నచూపే. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, మేనేజ్మెంటు సీటు కొనుక్కోవాలన్నా లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్పులు మాత్రమే యథాతథంగా కొనసాగేవి. ఇక బీసీ పోస్టు మెట్రిక్ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన ఇచ్చే స్కాలర్‌షిప్పులే గతి. వీటివల్ల ఆ పదేళ్ల కాలంలో లబ్ధిపొందిన విద్యార్థుల సంఖ్య అత్యల్పం. 2002-03లో మాత్రం 3.3 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.78.37 కోట్ల మేర స్కాలర్షిప్పులు అందాయి. అదే ఆయన పాలనలో అత్యధిక బడ్జెట్ కేటాయింపు. 2000-01లో కేవలం 18,792 మంది బీసీ విద్యార్థులకు రూ.2.99 కోట్లు మాత్రమే కేటాయించారు. స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు పెంచాలని ఎన్ని ఉద్యమాలు జరిగినా, వాటిని అణిచివేయడమే తప్ప రూపాయి కూడా అదనంగా ఇచ్చింది లేదు. మెరిట్ ప్రాతిపదికన కాకుండా బీసీలందరికీ స్కాలర్షిప్పులు ఇవ్వాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఉత్తుత్తి హామీలే... ఏప్రిల్‌లోగా 50 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగార్థులకు ఫీజు రద్దు, ఇంటర్వ్యూలకు ఉచిత బస్ సౌకర్యం, 25 రూపాయల దినసరి భత్యం చెల్లింపు - చంద్రబాబునాయుడు (ముఖ్యమంత్రి (22-2-1996) యువతకు నూతన సంవత్సర కానుక.నెలకు వంద రూ పాయల నిరుద్యోగ భృతి- ముఖ్యమంత్రి(19-12- 1995) జరిగిందిదీ.. ఖాళీ పోస్టుల భర్తీపై నిషేధం -ముఖ్యమంత్రి (25-7-1996) యువతకు అంధకారమే... చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడిపోయారు. ప్రతి పౌరుడికీ ఉపాధి కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై అనధికారిక నిషేధం కొనసాగించింది. టీచర్, పోలీసు ఉద్యోగాలు తప్ప మరే ఉద్యోగాలూ ఇవ్వలేదు. కేవలం 2,500 ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగులతో చెలగాటమాడింది. బాబు విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థి లోకం ఉద్యమించింది. ఎన్నికలకు ముందు భారీగా నియామకాలు చేపడతామని చెప్పి, 1996లో అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఉండవని బాబు చేతులెత్తేశారు.