బాబు పాలనలో ఉద్యోగులపై వేధింపులు | Government employees harassed in Chandrababu Naidu rule | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో ఉద్యోగులపై వేధింపులు

Published Sat, Apr 26 2014 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బాబు పాలనలో ఉద్యోగులపై వేధింపులు - Sakshi

బాబు పాలనలో ఉద్యోగులపై వేధింపులు

ప్రభుత్వోద్యోగులపై చంద్రబాబు సాగించిన జులుంకు పరాకాష్టగా చెప్పదగ్గ ఉదంతమిది. ఫొటోలోని మృతుడు అప్పటి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కె.అప్పారావు. మరికొద్ది నెలల్లో రిటైర్ కావాల్సిన ఆయనను, తోటి అధికారుల ముందు బాబు చేసిన అవమానం పొట్టన పెట్టుకుంది. టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా బాబు తీవ్ర పదజాలంతో మందలించడంతో అప్పారావు బాగా చిన్నబుచ్చుకున్నారు. అది టీవీ చానెళ్లలో కూడా ప్రముఖంగా రావడం, బంధుమిత్రులు, తెలిసిన వారు ఫోన్లు చేసి ఏం జరిగిందంటూ ఆరా తీయడంతో అయిన వారందరిలోనూ నవ్వులపాలయ్యానన్న భావనతో కుంగి పోయారు. దాంతో సన్నిహిత మిత్రుడు రాత్రి భోజనానికి పిలిచినా వెళ్లలేదు. మర్నాడు ఉదయం ఆఫీసుకు బయలు దేరుతూ, గుండెపోటుతో కారు వద్దే కుప్పకూలి మరణించారు.
 
 ఎలక్షన్ సెల్: ప్రజల వద్దకు పాలన..
 నీరు-మీరు..  శ్రమదానం.. క్లీన్ అండ్ గ్రీన్.. పథకాల పేర్లు ఏవైనా..  మాకే వేదన! యాతన!!
 రు..బాబు  ఉన్నట్టుండి ఊడిపడతాడు
 ఉరుకులు పెట్టించి దడ పుట్టిస్తాడు
 నడిబజారులో నిలబెడతాడు
 హీనాతిహీనంగా చూస్తాడు
 పిచ్చ పిచ్చగా ఉందా అంటాడు
 కక్ష గట్టినట్టు పచ్చిగా తిడతాడు
 లంచగొండులని ముద్ర వేస్తాడు
 అడుగడుగునా అవమానిస్తాడు
 అందరిముందూ అవహేళన చేస్తాడు
 ఆత్మగౌరవం దెబ్బ తీస్తాడు
 వెనకాముందూ చూసుకోడు
 సస్పెన్షన్, టేక్ యాక్షన్ అంటాడు
  ప్రజలను ఉసిగొల్పుతాడు
 కట్టేసి కొట్టమంటాడు
 బాధ్యతాయుతమైనవారిని బానిసల్లా చూస్తాడు
ఎవరైనా నోరు తెరిస్తే నాకు నచ్చదంటాడు
నా అంతటివాడు లేడంటాడు
నియంతలా నిప్పులు కక్కుతాడు
గుండెల్లో నిద్రపోతా అంటాడు
మనశ్శాంతి లేకుండా చేస్తాడు
మానవత్వం మరుస్తాడు
ఉసురూ పోసుకుంటాడు
 పబ్లిక్ సర్వెంట్లను..  పబ్లిగ్గా సర్వెంట్లలా చూస్తాడు..
 .. అంటున్నారు నారా సర్కార్‌లో నరకం అనుభవించిన ఉద్యోగులు.
 ఆ రోజులు మాకొద్దు  అంటున్నారు.  


 
 తీవ్ర ఒత్తిళ్లతో రోగాలొచ్చాయి
 చంద్రబాబు ఉన్నప్పుడు ఉద్యోగానికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేది.  గంట సవుయుమిచ్చి వంద పేజీల రిపోర్టు ఇవ్వమనేవారు. చిన్న పొరపాట్లు ఉన్నా హీనంగా తిట్టేవారు. ఎండాకాలంలో ఊళ్లలో నీళ్లు దొరక్కపోరుునా అధికారులను బాధ్యులు చేసేవారు.  పని ఒత్తిడి, నిత్యం భయంతో విధులు నిర్వర్తిం చడం వల్ల అనేకమందికి బీపీ, షుగర్ వంటి రోగాలొచ్చాయి.
-  లింగయ్య, ఆర్‌డబ్ల్యుఎస్( రిటైర్డ్) ఎస్‌ఈ, హన్మకొండ
 
 ఉద్యోగులను అవమానించారు
 ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు దండగనే  ధోరణిలో చంద్రబాబు ఉండేవారు. అందుకే ఆయన పాలనలో ఉద్యోగులకు వేధింపులు ఎక్కువగా ఉండేవి. అందరి ముందు అవమానకరంగా మాట్లాడటంతో కొందరు ఉద్యోగులు మనోవేదనకు గురై మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి.
- వేముల ప్రభావతి, విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి, రాజమండ్రి
 
 ప్రత్యక్ష నరకం చూపారు
 తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగులు, పెన్షనర్లకు చుక్కలు చూపించారు. ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు డీఏ ఇవ్వడం సర్వసాధారణం. కానీ చంద్రబాబు  ఐదు విడతల  డీఏ ఇవ్వలేదు. ఉద్యోగ విరమణ చేసిన మీకు డీఏ దండగంటూ అవమానపరిచారు. దీన్ని ఎన్నటికీ మరచిపోలేం. ఉద్యోగులను లంచగొండులు, దొంగలుగా చూసిందీ ఆయనే. ఇప్పుడు అధికారం కోసం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు నమ్మితే అధోగతే.
 - పెద్దారెడ్డి,  పెన్షనర్ల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు
 
 మనోవేదనకు గురి చేశారు
 చంద్రబాబు అప్పట్లో ఉద్యోగులపై ఎంతో ఒత్తిడి పెంచారు. జన్మభూమి లాంటి కార్యక్రమాల పేరిట పరుగులు పెట్టించడం తప్ప ఆయన చేసిన అభివృద్ధేమీ లేదు. పెన్షనర్లకు డీఏ ఇవ్వలేదు.  
 - కేశవులు, జిల్లా విశ్రాంత  ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, చిత్తూరు
 
 శ్రమ దోపిడీ చేశారు
 చంద్రబాబు హయాంలో ప్రతి రెండో శనివారం ‘పచ్చదనం-పరిశుభ్రత’ అంటూ ఉద్యోగుల సెలవులను హరించారు. శ్రమను దోచుకున్నారు. అభివృద్ధి పెద్దగా చేయకపోయినా నివేదికలు ఇవ్వాలంటూ పరుగులు పెట్టించారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగులకు, పెన్షనర్లకు రాయితీలు ఇస్తాననడం శోచనీయం. ఇంతకుముందు పదో పీఆర్‌సీలో  చేర్చిన డిమాండ్లను చంద్రబాబు తన మేనిఫెస్టోలో చూపించటం విడ్డూరంగా ఉంది. తాను మారానని ఆయన చెబుతున్నా... ఉద్యోగులెవరూ నమ్మే పరిస్థితి లేదు.
 - జి .ఆనందరావు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు, ఏలూరు

వెట్టిచాకిరీ చేయించారు
 చంద్రబాబు ఉద్యోగులను హీనంగా చూశారు. టీడీపీ ప్రభుత్వ నీచమైన పనులకు ఉద్యోగులను బాధ్యులను చేసేవారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం అప్రెంటీస్ విధానం పెట్టి ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయించారు.
 - కొత్తపల్లి గురుప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఖమ్మం

కార్మికులను జైలుకు పంపించారు
 టీడీపీ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు. సమ్మె చేస్తే నాయకులతో పాటు కార్మికులను జైలుకు పంపించిన ఘనత చంద్రబాబుది.  9.5 శాతం మాత్రమే వేతనం పెంచారు. అదే వైఎస్ వచ్చాక 24 శాతం పెంచారు.      
 - మధుసూదన్,
 ఎన్‌ఎంయూ రాష్ట్రకార్యదర్శి, కర్నూలు

 
  బానిసలుగా చూసేవారు
 అప్పట్లో ఉద్యోగులను చంద్రబాబు బెదిరించేవారు. తీవ్రఒత్తిడికి లోనై చాలామంది అనారోగ్యం బారిన పడిన సందర్భాలున్నాయి. సీసీఏ రూల్స్‌ను అడ్డం పెట్టుకుని  కర్ర పెత్తనం చేశారు. బానిసలుగా చూశారు.
- పీవీ పద్మనాభం, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, విజయనగరం
 
 ఇంట్లో పనివారిగా, వేతన కూలీల్లా చూశారు

 చంద్రబాబు తన పాలనలో ఉద్యోగులను ఏనాడు ఉద్యోగులుగా చూడలేదు. ఇంట్లో పనివారుగా, వేతన కూలీలుగానే చూశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు. బానిసలుగా చూశారు. నీ సంగతి ఏంటి.. తమాషా చేస్తున్నావా అంటూ హేళన చేస్తూ, మీరే శిక్షించడంటూ తిట్టేవారు. ఉద్యోగి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. కానీ అవమానాల పాలు చేశారు. వాటిని భరించలేక పలువురు ఉద్యోగం వదిలి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. టీచర్ల అప్రెంటిస్ రెండేళ్లు వద్దని ఉపాధ్యాయులు మొత్తుకుంటే దానిని నాలుగేళ్లకు పెంచారు. ఉపాధ్యాయులు ఆందోళనలు చేయడంతో వెనక్కి తగ్గారు.
 - పీఆర్‌టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి
 
 డీఏ ఎగ్గొట్టారు

 చంద్రబాబు ఎగ్గొట్టిన ఎన్నో విడతల డీఏను 2004లో అధికారంలోకి  రాగానే వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. చంద్రబాబు తన పాలనా కాలంలో పెన్షనర్ల పట్ల అవమానకర రీతిలో వ్యవహరించి... మానసిక వేదనకు గురి చేశారు. ఉద్యోగులందరూ అవినీతిపరులేనని ముద్ర వేశారు. చాలామందిని అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఉద్యోగులను ఎన్నో విధాలుగా వేధించిన చంద్రబాబు వారికి ఇప్పుడు మద్దతుగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన మాటలు నమ్మితే ప్రమాదమే.
 - సి.శివరామిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, కర్నూలు
 
 బాబు వల్ల ఎన్నో బాధలు పడ్డాం
 చంద్రబాబు వేధింపులు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి, ఇంకుడు గుంతలు, పరిసరాల పరిశుభ్రత, గ్రామసభలంటూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో ైఫైళ్లు పెండింగ్ పడితే మెమోలిచ్చారు. ఆయన వల్ల చాలా నష్టపోయాం.
 -తోటపల్లి సోమశేఖర్,  స్త్రీ,శిశు సంక్షేమ శాఖ
 రిటైర్డ్ సూపరింటెండెంట్ , ఒంగోలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement