మాట.. ఈ మాటకు అర్థం బాబుకు తెలీదు. నేను మారిపోయాను అంటాడు. ఎందుకు మారాడో మాటమాత్రమైనా చెప్పడు. వ్యవసాయం దండగ అనేస్తాడు. ఎప్పుడన్నానో చెప్పమంటూ మాట మారుస్తాడు. ఉచిత కరెంటు ఇస్తామంటే తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ఇపుడు గంటలకు గంటలు ఫ్రీగా కరెంటు ఇస్తానంటున్నాడు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నాడు. ఇపుడు రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు. బీజేపీతో పొత్తుపెట్టుకోనంటాడు. కొన్నాళ్లకు జతకడతాడు. అధికారం పోయాక ఇదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. అంటాడు. మోడీ వల్ల లబ్ధి కలుగుతుందేమోనని.. ముసుగు తీసేసి మళ్లీ జతకట్టేశాడు. మాట మార్చడం బాబుకు అలవాటు. కాదు.. కాదు.. అది ఆయన నైజం! మాట మీద నిలబడటం ఎప్పుడు నేర్చుకుంటావు.. బాబూ! సారీ.. ఈ మాట అడగటం దండగ బాబూ!!