బాబు డైరీ: ఆసరా అంతంతే..
ఇదీ తేడా!
* మైనార్టీలకు కేవలం రూ.32కోట్ల బడ్జెట్ కేటాయించారు.
* మైనార్టీ విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనంతరం పై చదువుల కోసం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు అందించేవారు.
* దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీ
* వితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు 3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు.
* రోష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సీడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ
* మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికసాయం
కిరణ్ హయాం
* మైనార్టీల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచారు.
* మైనార్టీల బడ్జెట్‌ను రూ.1027 కోట్లకు పెంచారే కానీ 2014 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ 40 శాతం కూడా ఖర్చు చేయలేదు.
* ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ ఇవ్వలేదు.
* మాస్ మ్యారేజెస్ పథకాన్ని నీరుగార్చారు. సబ్సిడీ రుణాలదీ ఇదే స్థితి.
వైఎస్ హయాం
* బడ్జెట్ రూ. 350 కోట్ల వరకు పెంపుదల
* పేద ముస్లింలకు రుణ మాఫీ
* అర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు
* డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు
* నేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు
* స్కాలర్‌షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులవుతున్నారు.
* ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి.
* ముస్లిం పేద అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు.
* కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాల పంపిణీ
* దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
* రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపు.
* మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు.
* మదర్సాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు
* యువతకు ఐటీ,వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన.
నాకు పునర్జన్మ లభించింది
ఐస్‌ఫ్రూట్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అనుకోకుండా 2010 సంవత్సరంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గుండె శస్త్ర చికిత్స చేయాల్సిందేనని డాక్టర్‌లు చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన నా దగ్గర డబ్బులేని దుస్థితి. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉండడంతో వెంటనే మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేశారు. నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆస్పత్రిలో ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇంటికి వచ్చేందుకు బస్సు చార్జీలు సైతం ఇచ్చారు. మళ్లీ ఏడాది కాలం పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు..వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారానే నాకు పునర్జన్మ లభించింది..
- మహమ్మద్ ఫజలుద్దీన్, జిరాయత్‌నగర్,
ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా