
చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలి
నగరి : చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలను ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అన్నమైనా మానేస్తాను రాట్నంపై నూలు వడకడం మానను అని చెప్పి మహా త్మాగాంధీ మాటలను ప్రతి నాయకు డు గుర్తుంచుకుని చేనేత కార్మికులపై వ్యవహరించాలన్నారు.
బడ్జెట్ సమావేశంలో గాంధీ పేరు చెప్పడమే గానీ చేనేత కార్మికులకు ఇచ్చిన రుణమాఫీ గుర్తించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరం అన్నారు. వ్యవసాయం తరువాత ప్రాధాన్యత సంతరించుకున్న రంగం చేనేత రంగమే అన్నారు. నేతన్న ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడుకునే బాధ్యత ప్ర భుత్వంపై ఉందన్నారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా చేనేత కార్మికులు అన్ని సదుపాయాలు అందాల న్నారు.
రూ.వెయ్యి కోట్లతో చేనేత కార్మికులకు ఏర్పాటు చేస్తానన్న నిధి వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వెయ్యి ఫించన్లు ప్రతి నెలా మంజూరు చేయాలన్నారు. 20 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులకు కావలసిన వస్తువులను అందజేయాలన్నారు.