ధర్మవరం టౌన్ (అనంతపురం): చేనేత కార్మికుల రుణాలను నెలలోపే మాఫీ చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నేత కార్మికులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.2.9 లక్షలు అందిస్తామని చెప్పారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించనున్నట్టు తెలిపారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిగ్గు లేకుండా అనంతపురం జిల్లాలో పర్యటించారని విమర్శించారు. రాష్ట్ర విభజన చేసి చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రి పరిహారం అందజేశారు.