loan waivers
-
రుణమాఫీకి రూ.30వేల కోట్లు..
-
రైతు రుణమాఫీపై రగడ !
-
రైతు రుణమాఫీపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్‌కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే.. ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు. టోల్‌ప్రీ నంబర్లు ఏర్పాటు ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్లో 1950తో పాటు 90632 11298 టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్‌లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్‌ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైతు రుణ మాఫీ.. లెక్క తప్పిందా ?
-
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
-
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
► రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ ► రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని సూచన ► ఈ సమావేశాల్లోనే జీఎస్టీ ఆమోదం పొందాలన్న జైట్లీ న్యూఢిల్లీ: రైతు రుణమాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి నిధులిచ్చి మరో రాష్ట్రానికి మొండిచేయి చూపే విధానాన్ని ఆవలంబించబోమని పేర్కొన్నారు. ‘పలు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నాయి. అందుకు ఆయా రాష్ట్రాలే నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయంపై కేంద్రం ఓ విధానంతో ముందుకెళ్తోంది. రైతు రుణాల వడ్డీలో కొంత భరిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. రుణమాఫీ చేయాల్సిందేనని సంకల్పిస్తే దానికి ఆయా రాష్ట్రాలే నిధులు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. అక్కడి రైతులకు యోగి సర్కారు రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. 2006లో యూపీఏ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిందని ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా రుణమాఫీ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లేదంటే పరోక్షపన్ను కోల్పోతాం! ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని జైట్లీ రాజ్యసభలో చెప్పారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 15 తర్వాత కేంద్రం, రాష్ట్రాలు పరోక్షపన్నును నష్టపోతాయని ఆయన తెలిపారు. జీఎస్టీకి అనుబంధంగా ఉన్న నాలుగు బిల్లులను తర్వలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ ‘అక్రమ’ జాబితా తిరస్కరణ అమెరికాలో 271 మంది అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ ఆ దేశం ఇచ్చిన జాబితాను భారత్ తిరస్కరించింది. సరైన ధ్రువీకరణ జరిగేంతవరకు అమెరికా నుంచి భారతీయులను తరలించేది లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు సుష్మ సమాధానం ఇచ్చారు. ‘మేం ఆ జాబితాను అంగీకరించటం లేదు. అందుకే మరిన్ని వివరాలడిగాం. వాటిని ధ్రువీకరించుకున్నాకే వారిని తరలించేందుకు అత్యవసర సర్టిఫికెట్ జారీచేస్తాం’ అని సుష్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ పునియా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
జానా ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి ఛాంబర్లో సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీని స్తంభింప చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రతిపక్షాలు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. విపక్షాల వాయిదా తీర్మానంపై చర్చ జరిపారు. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. -
నెలలోపే రుణాలు మాఫీ: కొల్లు రవీంద్ర
ధర్మవరం టౌన్ (అనంతపురం): చేనేత కార్మికుల రుణాలను నెలలోపే మాఫీ చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నేత కార్మికులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.2.9 లక్షలు అందిస్తామని చెప్పారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించనున్నట్టు తెలిపారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిగ్గు లేకుండా అనంతపురం జిల్లాలో పర్యటించారని విమర్శించారు. రాష్ట్ర విభజన చేసి చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రి పరిహారం అందజేశారు. -
రెండో విడతపై మడత పేచీ
* రుణమాఫీ సొమ్ము విడుదలలో సర్కారు జాప్యం * సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్న వైనం * రైతులకు ఖరీఫ్ రుణాలిచ్చేందుకు బ్యాంకుల విముఖత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు తీరుతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రెండో విడత రుణమాఫీ సొమ్ములో సగం మాత్రమే విడుదల చేసి మిగిలిన సగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. రెండో విడత రూ.4,086 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా.. రూ.2,043 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన మొత్తం ఎప్పుడు విడుదల చేస్తారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులు రైతులకు పూర్తిస్థాయిలో కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రైవేటు అప్పులే దిక్కు.. తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తించింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లు రుణ మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో బ్యాంకులు ఇప్పటివరకు రూ.4,086.22 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండో విడతకు కొర్రీ పెట్టింది. మాఫీ సొమ్ము సగమే విడుదల చేసినందున రైతులందరికీ రుణాలివ్వలేమని బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. చేసేది లేక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. -
రుణమాఫీ రెండో ఏడాది నిధులు విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేసింది. తొలి ఏడాది రుణాల మాఫీ నిధులను ఒకేసారి బ్యాంకులకు విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి 2 విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా రూ. 2,043 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు రుణాలు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. మిగతా రూ. 2,207 కోట్లు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసింది. మొత్తం 35.56 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 25 శాతం చొప్పున వరుసగా నాలుగేళ్లలో రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేయనుంది. తొలి ఏడాది రూ.4,086 కోట్లను బ్యాంకులకు విడుదల చేసింది. -
రుణమాఫీ కోసం రైతుల పాట్లు
-
ఏపీ సచివాలయానికి రుణమాఫీ బాధితులు
-
ఏపీ సచివాలయానికి రుణమాఫీ బాధితులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద రుణమాఫీ బాధితులు సోమవారం వచ్చారు. అన్ని అర్హత పత్రాలు ఉన్నా రుణమాఫీ వర్తించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలిసేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పొగాకు రైతులకు రుణమాఫీ ఇవ్వటం లేదని వారు వాపోయారు. బ్యాంకు పుస్తకాలు, ఆధార్ కార్డులు ఉన్నా రుణమాఫీ జాబితాలో తమను చేర్చలేదని ఫిర్యాదు ఈ సందర్భంగా కుటుంబరావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోలు, బ్యాంకు అధికారులు సమాధానం చెప్పటం లేదని రైతులు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయలేదని రైతులు ఆవేదన చెందారు. కాగా రెండోవిడత రుణమాఫీ అమలు విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200మంది రైతులు సచివాలయానికి వచ్చారు. -
బాబు విధాన ప్రకటన అబద్ధాల పుట్ట: రఘువీరా
-
బాబు విధాన ప్రకటన అబద్ధాల పుట్ట: రఘువీరా
న్యూఢిల్లీ : రుణమాఫీ చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధాన ప్రకటనలో అబద్ధాలతో నిండి ఉందని ఏపీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫేస్టోలో కూడా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పడు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. రకరకాల కారణాలతో రైతులకు ద్రోహం చేస్తున్నారని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆరు అబద్ధాలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. -
5న రుణమాఫీ లబ్దిదారుల జాబితా ప్రకటన
-
5న రుణమాఫీ లబ్దిదారుల జాబితా ప్రకటన
హైదరాబాద్ : రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ఏపీ సర్కార్ నవంబర్ 5నప్రకటించనుంది. పదో తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనుంది. అయితే, రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లబ్దిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ పేరుతో భారీ కోత పెడుతోంది. ఆధార్ కార్డు లేదని 18 లక్షలమంది అకౌంట్లను ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఆధార్ కార్డుల సమర్పణకు శుక్రవారంతో బ్యాంకుల వద్ద గడువు ముగిసింది. దాంతో ఇకనుంచి గడువు పెంచలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రుణమాఫీ లబ్దిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి తొలివిడత చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. రుణమాఫీతో 30లక్షల కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది కలుగుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే, మొత్తం రుణాలున్న రైతుల్లో ఐదోవంతు మందికి మాత్రమే తొలి విడతలో రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. దానికితోడు కుటుంబంలో ఒక్కరికే, ఒక్క రుణమే మాఫీ చేస్తామనడంతో డ్వాక్రా రుణాలు, పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయం ఏమవుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజంపేట వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. రుణాలు మాఫీ కాకపోవటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు డీఫాల్టర్స్ అయ్యారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని, ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని మిథున్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధం అవుతున్నారని మిథన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 5వ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు. -
రుణమాఫీపై టిడిపి బురదజల్లుడు రాజకీయాలు
-
రీషెడ్యూల్‌పై వివరణ కోరిన RBI
-
ప్రతిపక్షమే లేకుండా చేసే పన్నాగమా: గడికోట
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలైన రుణాల మాఫీ, చౌకగా మినరల్ వాటర్ సరఫరా వంటి వాటిని నెరవే ర్చలేని చంద్రబాబు.. ఈ వైఫల్యాలను ప్రశ్నించడానికి వీల్లేకుండా అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మనం ఎక్కడికి పోతున్నాం..?’ అంటూ ప్రతిసారీ నీతులు వల్లించే చంద్రబాబు ఈ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. నేడు జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు ఫిర్యాదు: స్థానిక ఎన్నికల్లో అధికారపక్షం అరాచకాలపై ఫిర్యాదు చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమవారం రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
పాతవి చెల్లిస్తేనే కొత్తవి..
పరిగి: ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు గడుస్తున్నా.. రుణమాఫీ హామీపై ఎటూ తేలకపోవడంతో సంకట పరిస్థితి ఏర్పడింది. పాత రుణాలు చెల్లించండి.. లేదంటే రెన్యూవల్ చేసుకోండి.. అప్పుడే కొత్త రుణాలిస్తాం.. అంటూ బ్యాంకు అధికారులు రైతులకు తెగేసి చెబుతున్నారు. అటు ప్రభుత్వం స్పందించకపోవటం, ఇటు అప్పులిచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గంలో 60వేల పైచిలుకు రైతులు ఉండగా ఇప్పటికే ఆయా బ్యాంకుల ద్వారా రూ.350 కోట్ల రుణం పొంది ఉన్నారు. ఒక్క పరిగి (ఏడీబీ) ఎస్‌బీహెచ్‌లోనే రూ.90 కోట్ల దాకా రుణాలు తీసుకున్నారు. వీరంతా రుణమాఫీ ఎప్పుడవుతుందా.. కొత్త రుణాలు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నడ్డి విరుస్తున్న ‘ప్రైవేటు’ వడ్డీ.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావటంతో పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. బ్యాంకర్లు రుణాల్వికపోవడంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారును ఆశ్రయిస్తున్నారు. సాధారణ వడ్డీ వ్యాపారులు రూ.3 నుంచి రూ.5 వరకూ వడ్డీ వసూలు చేస్తుండగా, అడ్తీదారులు, ధాన్యం మిల్లర్లు, ఇతర ప్రైవేటు వ్యాపారులు షరతులు పెడు తూ అప్పులిస్తున్నారు. పండించే పంట లు తమకే అమ్మాలంటూ రూ.2 నుంచి రూ.3 వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నా రు. రైతులు చేసేది లేక వడ్డీ ఎంతైనా.. షరతులేవైనా అంగీకరిస్తున్నారు. అన్నీ సమస్యలే.. సమస్యలన్నీ ఒక్కసారిగా రైతులను చుట్టుముట్టాయి. అటు బ్యాంకర్లు కనికరించకపోవటం, ఇటు పిల్లల చదువులు, ఎరువులు, విత్తనాలకు ఇప్పుడే ఖర్చు చేయాల్సి రావటం వారిని కుంగదీస్తోంది. కొందరు అప్పు చేసి ఇప్పటికే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకువెళ్లగా అటు వరుణుడు సైతం కరుణించటంలేదు. దీంతో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా’ మారింది వారి పరిస్థితి. -
పొదుపు సొమ్ము.. రుణార్పణం!
గార: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ సర్కారు ఇప్పటికీ మహిళా సంఘాలను ఊరిస్తోంది. మరోవైపు దానిపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. బ్యాంకర్లు ఈ జాప్యాన్ని సహించలేకపోతున్నారు. స్వయంశక్తి సంఘాల పొదుపు ఖాతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు మళ్లించి రుణ బకాయిల కింద జమ చేస్తున్నారు. సర్కారు నిర్వాకం మహిళా సంఘాలు, బ్యాంకర్ల మధ్య వివాదాలకు దారి తీస్తోంది. గార మండలం లో తొమ్మిది సంఘాల మొత్తాలు ఇలా మళ్లిపోగా.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్న ట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ డ్వాక్రా రుణాల మాఫీ హామీని తెరపైకి తెచ్చింది. రుణ బకాయిలు చెల్లించవద్దని మహిళా సంఘాలకు సూచించింది. దాంతో గత మార్చి నుంచి జిల్లాతోపాటు రాష్ట్రమంతా డ్వాక్రా రుణ వాయిదాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన టీడీపీ అధికారం చేపట్టింది. ఇటు బ్యాంకులు.. అటు మహిళా సంఘాలు రుణమాఫీపై స్పష్టత కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. అయి తే రోజులు గడుస్తున్నా సర్కారు స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదు. రోజుకో రకమైన ప్రకటనతో కాలక్షేపం చేస్తోంది. సుమారు నాలుగు నెలలుగా రుణ బకాయిల వసూళ్లు నిలిచిపోవడంతో స్వయంశక్తి సంఘాల రుణ ఖాతాలు ఎన్పీఏ( నాన్ ఫెర్ఫార్మెన్స్ అసెట్స్)గా అంటే నిరర్ధక ఆస్తులుగా మారా యి. ఫలితంగా బ్యాంకులపై ఉన్నతాధికారుల నుం చి ఒత్తిళ్లు పెరిగాయి. వారి ఆదేశాల మేరకు డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల నుంచి నిధులు మళ్లించి రుణ ఖాతాలకు జమ చేయడం మొదలు పెట్టారు. సంఘాలకు చెప్పకుండానే.. ఈ ప్రక్రియను మహిళా సంఘాలకు చెప్పకుండనే చేపట్టడంతో వివాదం రేగుతోంది. దీనిపై సంఘాల సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. కళింగపట్నంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో తొమ్మిది సంఘాల రుణ ఖాతాలకు వారి పొదుపు ఖాతాల నుంచి కొంత మొత్తాలను కొద్ది రోజల క్రితం జమ చేశారు. ఈ విషయాన్ని భ్యాంకు సిబ్బంది ఆయా సంఘాలకు తెలియజేయలేదు. ఎప్పటిలాగే నెలవారీ సమావేశాలు నిర్వహించిన ఈ సంఘాల నిర్వాహకులు సభ్యుల నుంచి సేకరించిన పొదుపు మొత్తాలను బ్యాంకులో కట్టేందుకు వెళ్లినప్పుడు నిధులు మళ్లించిన విషయం తెలిసింది. దీంతో ఖంగుతిన్న నిర్వాహకులు మంగళవారం గ్రామ పెద్దలు, గ్రామైక్య సంఘాల దృష్టికి తీసుకె ళ్లారు. బ్యాంకు మేనేజర్ ఎన్వీ రామానందం, ఫీల్డ్ ఆఫీసర్ కె.ఆర్.ఎల్.రావులను నిలదీశారు. తమ పొదుపు సొమ్ము మళ్లించడం అన్యాయమని.. ప్రభుత్వం ఒక పక్క రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తుంటే.. బ్యాంకులు ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటివరకు రుణాలు చెల్లించనివారికే మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం నిబంధన పెడితే తమ పరిస్థితి ఏమిటని, తాము అన్యాయమైపోమా? అని ప్రశ్నిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఇక నుంచి పొదుపు సొమ్ము మళ్లించబోమని సర్పంచ్ పొట్నూరు కృష్ణమూర్తి, ఎంపీటీసీ గుంటు నాగమణి లక్ష్ముయ్యలకు బ్యాంకు అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు. -
బెల్టు తీస్తారా!
బెల్టు దుకాణాల రద్దుకు అడ్డంకులెన్నో - నాలుగు రోజుల్లో ఏడు కేసులతో సరి - ఎక్సైజ్ శాఖలో వాహనాల కొరత - అద్దె వాహనాలకు 16 నెలలుగా అందని బిల్లులు కర్నూలు: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రుణమాఫీపై మెలిక పెట్టి తన నైజాన్ని చాటుకున్నాడు. అదే రోజు బెల్టు దుకాణాల రద్దు ఫైల్‌పై సంతకం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యాపానాన్ని విధిస్తే..ఆయన దగ్గర నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు మద్యాపాన నిషేదాన్ని ఎత్తివేసి వీధివీధికి బెల్టు షాపు వెలిసేలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెల్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం జీవో జారీ చేసి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకు నందికొట్కూరులో 2, ఎమ్మిగనూరులో 2.. కర్నూలు, కోసిగి, కోడుమూరులో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే కేసులు నమోదయ్యాయి. వేధిస్తున్న వాహనాలు, సిబ్బంది కొరత.. ఎక్సైజ్‌శాఖలో వాహనాలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మద్యం అక్రమ వ్యాపారంపై నిఘాకు ఈ శాఖలో డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అత్యంత కీలకం. ఈ విభాగాలకు సంబంధించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేందుకు అవసరమైన సంఖ్యలో వాహనాలు లేకపోవడంతో వీరి పనితీరు నామమాత్రమవుతోంది. డీటీఎఫ్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌తో పాటు సీఐ, ఎస్ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏఈఎస్ పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉంది. ముగ్గురు ఎస్ఐలకు గాను ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉండగా.. ఒక్క వాహనమే గతి. కర్నూలు ఎక్సైజ్ పరిధిలో 13, నంద్యాల ఎక్సైజ్ పరిధిలో 10 అద్దె వాహనాలను అధికారులు వినియోగిస్తున్నారు. వీటికి నెలకు కనీసం రూ.6 లక్షలు చొప్పున 16 నెలలకు సంబంధించి ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలు బకాయి పడింది. ఈ కారణంగా అద్దె వాహనాల వినియోగానికి ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షల బడ్జెట్ విడుదలైనా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో నిధులు వెనక్కి మళ్లింది. బెల్టు దుకాణాల తనిఖీకి వెళ్లాలంటే రోజూ కనీసం రూ.2 వేలకు పైగా ఖర్చవుతుందని అధికారుల అంచనా. వాహనానికి డీజిల్, డ్రైవర్ బత్తా, వెంట వచ్చిన సిబ్బందికి భోజనం ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో అధికారులు తనిఖీలంటేనే జంకుతున్నారు. మారిన వేళలు.. ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వస్తారనే భయంతో జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న బెల్టు దుకాణాదారులు సమయపాలన మార్చుకున్నారు. గతంలో రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగ వ్యాపారం సాగింది. ప్రస్తుతం దాడులు ముమ్మరం చేయడంతో కర్నూలు చుట్టూ ఉన్న పడిదెంపాడు, మునగాలపాడు, భూపాల్‌నగర్, ఆర్.కొంతలపాడు, సుంకేసుల, ఎదురూరు, ఉల్చాల, దిగువపాడు, పూడూరు, గొందిపర్ల గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారా రాత్రి వేళల్లో బెల్టు షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. -
తక్షణమే రుణమాఫీ అమలుచేయాలి
పలాస : టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనట్లు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. పలాసలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పైల చంద్రమ్మ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వి.మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీని అమలు చేసి కొత్త రుణాలను అందజేయాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోందని, వ్యవసాయ పెట్టుబడులకు, పరికరాలకు రుణాలు అవసరమన్నారు. జిల్లా రైతాంగానికి 70 వేల క్వింటాళ్ల వరివిత్తనాలు అవసరమని, 49 వేల క్వింటాళ్లే అవసరమని అధికారులు ప్రకటించారన్నారు. రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను అందజేయాలని, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, రాపాక మాధవరావు, ఎస్.సోమేశ్వరరావు, ఎం.తాతారావు, కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
రైతన్నల్లో చిగురాశలు
- రుణమాఫీపై ఎదురుచూపులు - కొత్తసర్కారు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ పాలమూరు, న్యూస్‌లైన్: వాతావరణ ప్రతికూల పరిస్థితులు...దీనికి తోడు విద్యుత్ కోతలు...చేతికందిన దిగుబడికి సరైన ధరలు దక్కకపోవడం...ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ అప్పుల ఊబిలో కూరుకుపోయి కుదేలవుతున్న రైతన్నల్లో కొత్త సర్కారు నిర్ణయంపై చిగురాశలు మొలకెత్తాయి. రుణమాఫీతో తమ కష్టాలు గట్టెక్కుతాయని వారు ఎదురు చూస్తున్నారు. కొత్త రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ మొదటి సంతకం దీనిపైనే చేయనున్నారు. ఆ శుభఘడియ కోసం వారంతా నిరీక్షిస్తున్నారు. సంబంధిత లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉండటంతో అధికారులు సైతం మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రుణమాఫీ వల్ల జిల్లాలోని రైతాంగం అధిక శాతం లబ్ధి పొందారు. వడ్డీలతో కలిపి జిల్లాలో రూ.3 వేల కోట్ల పైబడి పంట రుణాల మాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఎనిమిది లక్షల మంది రైతులు 350 బ్యాంకుల ద్వారా రుణాలు పొందారు. నాలుగేళ్లుగా రకరకాల కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రూ.3వేల కోట్ల రుణాలు బకాయిలున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మాఫీ విధి విధానాలు ఎలా ఉంటాయోనన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రుణమాఫీపై మార్గదర్శకాలు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సక్రమంగా చెల్లించిన వారికే... జిల్లాలో సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈసారి రుణ మాఫీ వర్తింప చేయాలని మెజారిటీ రైతులు కోరుతున్నారు. మరోసారి ప్రభుత్వం మొండి బకాయిలు మాఫీ చేస్తే క్రమం తప్పకుండా చెల్లించిన వారు కూడా మొండిబకాయిదారులుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది పంట రుణప్రణాళికకు దెబ్బపడే అవకాశం ఉందంటున్నారు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో..? రుణమాఫీ ఏ తేదీ నుంచి అమలు చేస్తారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు అధికారులు వడ్డీలేని రుణాలకు ముందున్న బకాయిలను మాఫీ చేస్తారంటున్నారు. మరికొందరు కొత్త రాష్ట్రంలో రైతులకు ఎలాంటి రుణం లేకుండా చేసి, రుణ విముక్తిని చేస్తారని పేర్కొంటున్నారు. రబీ రుణాల వరకు పూర్తిగా మాఫీ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అధికారులు మాత్రం అన్ని రకాల రుణాల బకాయిదారుల జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.