రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు | ysrcp mp Mithun Reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు

Published Fri, Oct 24 2014 1:52 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు - Sakshi

రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు

తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజంపేట వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. రుణాలు మాఫీ కాకపోవటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు డీఫాల్టర్స్ అయ్యారని ఆయన అన్నారు.

డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని, ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని మిథున్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధం అవుతున్నారని మిథన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 5వ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement