ప్రతిపక్షమే లేకుండా చేసే పన్నాగమా: గడికోట | TDP trying to make without opposition in Andhra pradesh, says Gadikota srikanth reddy | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షమే లేకుండా చేసే పన్నాగమా: గడికోట

Published Mon, Jul 7 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

ప్రతిపక్షమే లేకుండా చేసే పన్నాగమా: గడికోట

ప్రతిపక్షమే లేకుండా చేసే పన్నాగమా: గడికోట

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలైన రుణాల మాఫీ, చౌకగా మినరల్ వాటర్ సరఫరా వంటి వాటిని నెరవే ర్చలేని చంద్రబాబు.. ఈ వైఫల్యాలను ప్రశ్నించడానికి వీల్లేకుండా అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మనం ఎక్కడికి పోతున్నాం..?’ అంటూ ప్రతిసారీ నీతులు వల్లించే చంద్రబాబు ఈ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని దుయ్యబట్టారు.
 
 నేడు జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు ఫిర్యాదు: స్థానిక ఎన్నికల్లో అధికారపక్షం అరాచకాలపై ఫిర్యాదు చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement