gadi kota srikanth reddy
-
పదవి కోసమే ఆదినారాయణరెడ్డి ఆరోపణలు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమే.. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం తగదు. స్వప్రయోజనాల కోసం సంస్కారం మరిచిపోవద్దు అని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత. కేంద్రంలో అధికారం ఉన్నామన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితం అయ్యింది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి బీజేపీది’’ అని విమర్శించారు. ‘‘బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. ప్రత్యేక హోదా, దుర్గరాజపట్నం, స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తాం. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు’’ అని తెలిపారు. ‘‘సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తాం. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. సోమశిల విషయంలో పెండింగ్‌లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్ చేశాం అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ‘‘మా ప్రభుత్వంపై చంద్రబాబు కావాలని బురద జల్లుతున్నారు. చంద్రబాబు లాగా.. మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రజాబలం ఉన్నప్పుడు మాకు ఇంకో బలం అవసరంలేదు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారు.. ఏదోరకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటున్నారు.. చంద్రబాబు గురించి అందరికి తెలుసు’’ అన్నారు. చదవండి: ఏపీలో చంద్రబాబు కొత్తగా బూతు రాజకీయాలు తెచ్చారు: ఎంపీ భరత్ -
మహానేతకు నివాళి - శ్రీకాంత్ రెడ్డి
-
పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం సిగ్గుచేటు
-
దళారులను నమ్మి మోసపోవద్దు: చీఫ్ విప్
సాక్షి, వైయస్సార్: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, అయితే దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్మీట్లో పేర్కొన్నారు. అంతేకాక రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందుకుగాను అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. డీఎస్సీ రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల పేరిట దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తనకు లేదా జిల్లా ఎస్పీకి లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగాల ఎంపికలో దళారులను నమ్మి మోసపోవద్దని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ చీఫ్ విప్ సలహా ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి నిర్ములనకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆదేశించారు. లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాక పట్టాదారు పాస్ బుక్, రేషన్, పెన్షన్, భవనాల అప్రూవల్స్ తదితర విషయాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచాలకు పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. -
అవినీతి అంతా బయటకు తీస్తాం: చీఫ్ విప్
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్‌ని అవినీతి రహిత రాష్ట్రంగా రూపుదిద్దడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని.. వాటిన్నింటినీ ప్రక్షాణళ చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని టీడీపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వంలో కావాల్సినంత సమయం ఇస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అంతా త్వరలోనే బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లలో రాష్ట్రం అవినీతి మయంగా మారింది. రూ.2.7 వేల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారు. లక్ష కోట్ల వరకు పనులు పెండింగ్‌లో పెట్టారు. వ్యవస్థలను క్రమబద్దీకరించే బాధ్యత సీఎం వైఎస్ జగన్‌పై పడింది. క్రింది స్థాయి నుంచి రెవిన్యూ, పోలీసు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టు వంటి వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తాం, అవినీతి నిర్మూలన కోసం మీడియా సహకారం ఎంతో అవసరం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయుటకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం. ఎప్పుడు లేని విధంగా వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ప్రైవేటు స్కూల్స్ దోపిడిని నివారించేందుకు ఫీజు రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 20 బిల్లులు ప్రవేశపెట్టాం. ఇంటింటికి కుళాయి ఇవ్వడానికి రివర్స్ టెండరింగ్ వేస్తున్నాం. ఉగాదికి లోపల 25 లక్షల మంది నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేస్తాం. 130 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో సీపీ రోడ్లు మంజూరుచేశాం’’ అని అన్నారు. -
చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు
-
రాష్ట్ర శ్రేయస్సు కన్నా బాబుకు కమీషన్లే ముఖ్యం
-
నియంతలా చంద్రబాబు పరిపాలన
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట మండిపాటు హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలను రెచ్చగొడుతూ ఓ నియంతలా పాలిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఛైర్మన్ పదవుల ఎన్నికల తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతలైన అంబటి రాంబాబు, ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే ముస్తఫాలపై దౌర్జన్యం చేయడం... ఎంపీటీసీల కిడ్నాప్.. ప్రకాశం జడ్పీ ఎన్నిక కొద్దిసేపట్లో జరుగుతుందనగా ఒక జడ్పీటీసీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం లాంటి సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. గడికోట ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జడ్పీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నా అక్రమంగా చేజిక్కించుకున్న టీడీపీ, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తమ పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీని పోలీసులతో అరెస్టు చేయించి ఓటింగ్‌కు రానీయకుండా చే శారని గడికోట పేర్కొన్నారు. నెల్లూరులో కూడా పోలీసుల సహకారంతో పెంచలమ్మ అనే వైఎస్సార్సీపీ జెడ్పీటీసీని తీసుకె ళ్లారన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు స్థానిక సంస్థలను అక్రమంగా, అప్రజాస్వామికంగా చేజిక్కించుకోవడానికి దౌర్జన్యాలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గూండాయిజం, రౌడీయిజంతో టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి హింసాత్మక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. -
ప్రతిపక్షమే లేకుండా చేసే పన్నాగమా: గడికోట
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలైన రుణాల మాఫీ, చౌకగా మినరల్ వాటర్ సరఫరా వంటి వాటిని నెరవే ర్చలేని చంద్రబాబు.. ఈ వైఫల్యాలను ప్రశ్నించడానికి వీల్లేకుండా అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మనం ఎక్కడికి పోతున్నాం..?’ అంటూ ప్రతిసారీ నీతులు వల్లించే చంద్రబాబు ఈ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. నేడు జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు ఫిర్యాదు: స్థానిక ఎన్నికల్లో అధికారపక్షం అరాచకాలపై ఫిర్యాదు చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమవారం రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
ఓవైపు చందాలడుగుతూ... మరోవైపు ఆర్భాటమా!
గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఓవైపు చందాలడుగుతూ మరోవైపు ఇంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం చేయడం సబబేనా? అని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే... సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిలాంటి పెద్దలు రెచ్చిపోయి మాట్లాడిన తీరు, వాడిన భాష గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం తప్పవుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విభజనకులోనై కష్టాల్లో ఉన్నపుడు ఇంత ఆర్భాటం ఎందుకని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారా? అని టీడీపీ నేతలను నిలదీశారు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోకుండా ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదన్న బాధతో సోమిరెడ్డి ఉన్నారని, అలాంటి రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇలాంటి విమర్శలు చేసినట్లుగా ఉందని విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే... 1. చంద్రబాబు అనేకసార్లు ఫోన్లు చేసినా జగన్ స్పందించలేదని ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రిలో గత మూడు రోజులుగా ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున ఐదు గంటల వరకూ పార్టీ సమీక్షా సమావేశాల్లో జగన్ తలమునకలుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వద్ద ఫోన్ ఉండదు. చంద్రబాబు ఫోన్ చేయగానే జగన్ శుభాకాంక్షలు చెప్పారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ వాళ్లు మాత్రం పనిగట్టుకుని జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారు. 2. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రమాణం కోసం పేదల గుడిసెలను సైతం కూల్చేసి అక్కడినుంచి వారిని పంపేశారు. తాను కనుక హాజరైతే వాటన్నింటింకీ ఆమోదం తెలిపినట్లవుతుందనే ఉద్దేశంతో జగన్ వెళ్లదల్చుకోలేదు. వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయగలరా? 1. తానేదో నిజాయితీపరుడనని చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేయలేదని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసి చెప్పగలరా? 2. జగన్ అవినీతిపరుడైతే, కోట్లాది రూపాయల డబ్బు అయన వద్ద ఉండి ఖర్చు చేసి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారు. జగన్‌పై సీబీఐ అక్రమంగా కేసులు మోపి 16 నెలలు జైల్లో ఉంచిన తరువాత కూడా అంతిమంగా చార్జిషీట్లు వేసేటపుడు ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. చంద్రబాబు తనపై విచారణ జరక్కుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకోకపోయి ఉంటే ఆయన బండారం ఏమిటో బయటపడే -
కుమ్మక్కు రాజకీయాలు చేయం
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్: కుమ్మక్కు రాజకీయాలకు దూరంగా ఉంటూ నిజమైన ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని, సమస్యలొచ్చినపుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన తరువాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై రాజకీయాలు చేశాయని, తాము అలా వ్యవహరించబోమని అన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి ప్రారంభమైన తమ బలం ఉప ఎన్నికల తరువాత ఇద్దరు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలకు పెరిగింద ని, అదిపుడు 70 మంది ఎమ్మెల్యేలకు పెరిగిందని, ఈ సంఖ్యతో ఒక బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని అన్నారు. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఓటమికి కారణం స్థానిక అంశాల ప్రభావమే తప్ప మరొకటి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, కొత్త రాష్ట్రం పునర్నిర్మాణానికి ఏ రకంగా సహకరించాలో ఆ విధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ మరణంతో ఆగినఅభివృద్ధి : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
మహానేత వైఎస్ మరణంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడికోట మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం రూపకర్త కూడావైఎస్సే అన్నారు. వైఎస్ ఫొటో వేదికపై లేకపోవడం బాధాకరమన్నారు. రాయచోటి ప్రజల సౌకర్యార్థం 50 పడకల ఏరియా ప్రభుత్వాసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. రింగురోడ్డును నాలుగులైన్ల రహదారిగా తీర్చిదిద్దాలన్నారు. నియోజక వర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, మహిళా ఉర్దూ డిగ్రీకళా శాల, ప్రభుత్వ ఐటి ఐ, ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.