చేనేతకు ఆర్థిక భద్రత | Financial security for handloom | Sakshi
Sakshi News home page

చేనేతకు ఆర్థిక భద్రత

Published Sun, Jun 25 2017 12:37 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

చేనేతకు ఆర్థిక భద్రత - Sakshi

చేనేతకు ఆర్థిక భద్రత

భూదాన్‌ పోచంపల్లిలో నేతన్నకు చేయూత పథకం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
భూదాన్‌ పోచంపల్లి: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించడానికి త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకాన్ని (పొదుపు నిధి) తెచ్చినట్లు ఐటీ, చేనేత జౌళిశాఖ మంత్రి కె.తారకరామారావు తెలి పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ‘నేతన్నకు చేయూత’ పేరిట త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకాన్ని మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్నతో కలసి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లా డుతూ సీఎం కేసీఆర్‌ చిన్నప్పటి నుంచి చేనేత కార్మి కుల బాధలను ప్రత్యక్షంగా చూశారని, వారి కన్నీళ్లు తుడవడానికే రూ.70కోట్లున్న బడ్జెట్‌ను రూ.1,283 కోట్లకు పెంచారన్నారు. 2002లో పోచంపల్లిలో చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు జరి గినప్పుడే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఇక్కడికి వచ్చి జోలపట్టి రూ.3.50లక్షలు విరాళాలు సేకరిం చి ఏడుగురు బాధిత కుటుంబాలకు అందించారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితో చేనేత కార్మికులకు మరింత భరోసా కల్పించడానికి సీఎం ఆదేశాల మేరకు పోచంపల్లిలో త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకాన్ని ప్రారంభించినట్లు కేటీఆర్‌ వివరించారు.

18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే...
ఈ పథకంలో చేరేందుకు 18 ఏళ్లు నిండి చేనేత వృత్తిపై ఆధారపడిన ప్రతి కార్మికుడు అర్హుడేనని కేటీఆర్‌ తెలిపారు. కార్మికుడు వేతనంలో 8 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 16శాతాన్ని మ్యాచింగ్‌ గ్రాంటుగా అతడి ఖాతాకు జమ చేస్తుందన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 30 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. అంతేకాక 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు, రసాయనాలు అందిస్తామన్నారు. నేత కార్మికులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కార్మికులు నేసిన బట్టను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకు ‘బై బ్యాక్‌’ పాలసీని తెస్తున్నామన్నారు.

కార్మికుడికి కనీసం రూ.15వేలకు తగ్గకుండా వేతనం అందిం చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను వరంగల్‌లో త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారం భించనున్నట్లు చెప్పారు. అలాగే రూ.30 కోట్లతో సిరిసిల్లలో అపెరల్‌ పార్క్, జమ్మికుంట, కమలా పూర్, దుబ్బాకల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయను న్నట్లు చెప్పారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ కేవలం 3.87 శాతం వస్త్రోత్పత్తులు చేస్తూ వెనుకబడి ఉన్నా మన్నారు. అదే పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ 10 శాతం, చైనా 30 శాతం వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తుందన్నారు.

చేనేత, టెక్స్‌టైల్‌ పరిశ్రమపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని గట్టిగా కోరామని, ప్రస్తుతం ఢిల్లీ పర్య టనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తారన్నారు. అనంతరం స్థానిక టూరిజం పార్క్‌లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ, చైతన్య భారతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత డిజిటల్‌ సాధికారత కేంద్రాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్, అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్‌ గొంగిడి çసునీత, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కె.ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్‌ పాల్గొన్నారు.

ఫ్లోరోసిస్‌ పాపం గత పాలకులదే...
‘‘జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 6, 7 ఫీట్ల పొడవున్నారు.. గతంలో మంత్రులుగా నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించారు.. కానీ ఏంలాభం.. తలాపునే కృష్ణానది పోతు న్నా, నాడు గుక్కెడు నీళ్లు అందించలేదు’’ అని కేటీఆర్‌ దుయ్యబట్టారు. జిల్లాలో రెండు లక్షల మంది ఫ్లోరోసిస్‌ బాధితులు ఉన్నారంటే ఆ పాపం గత పాలకులది కాదా అని ప్రశ్నించా రు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా కోసమే రూ.9వేల కోట్లు తీసుకెళ్తుంటే మంత్రివర్గంలో ఉండి సంతకాలు పెట్టింది వీరు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కింద తాగునీరు అందిస్తుంటే స్కామ్‌ భగీరథ అని వారు విమర్శిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement