సాక్షి, హైదరాబాద్: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు’ ఇంకా తుది రూపం దాల్చలేదు. రూ.1,150.47 కోట్ల అంచనాతో ఐదు దశల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా రూపొందించిన ప్రణాళిక ముందుకు సాగట్లేదు. భూమిని చదును చేయడం, రోడ్లు, వరద నీటి కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, సీఈటీపీ, విద్యు త్, సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలిదశలో రూ.439.50 కోట్లతో పను లు చేపట్టాలని నిర్ణయించగా, గీసుకొండ మండ లం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లిలో 1,190 ఎకరాల భూమిని రూ.110 కోట్లతో సేకరించారు. ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే కన్సల్టెన్సీకి అప్పగించి, ఇప్పటివరకు రూ.50 కోట్లతో పార్కు కాంపౌండ్ వాల్, కొన్ని అంతర్గత రోడ్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా పార్కు అవసరాల కోసం ప్రత్యేకమైన తాగునీటి పైపులైను నిర్మాణం కొనసాగుతోంది. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మరో రూ. 50 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు టీఎస్‌ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. తొలిదశ పనుల పూర్తికి మరో రూ.230 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం ఆచితూచి నిధులు ఖర్చు చేస్తోంది.
భూ వివాదాల కొలిక్కి యత్నాలు..
టెక్స్‌టైల్ పార్కును ఐదు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసి, పర్యావర ణ అనుమతులూ సాధించా రు. కాలుష్య శుద్ధీకరణకు కా మన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెం ట్ ప్లాంటు (సీఈటీపీ) ఏర్పాటుకు ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్‌మెంట్ స్కీం (ఐపీడీఎస్) కింద ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఇటు పార్కు అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ స్కీం (ఐటీపీఎస్) కింద ఆర్థిక సా యం చేయాలని రాష్ట్ర ప్రభు త్వం కోరుతోంది. అయితే, పార్కుకు దారితీసే గంగదేవిపల్లి అప్రోచ్‌రోడ్డు పనులు భూ వివాదాల కారణంగా కో ర్టు కేసులో చిక్కుకుని అర్ధంతరంగా నిలిచిపోయాయి. రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలె క్టర్ ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. పార్కు అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 3 ఎంఎల్‌డీలు సరఫ రా చేసేలా పనులు కొనసాగుతుండగా, భవిష్యత్తులో చలివాగు నుంచి ప్రత్యేక నీటి పైపులైను నిర్మించాలని ప్రతిపాదించారు. మరోవైపు పార్కుకు వెళ్లే మార్గంలో రైల్వే లైను అడ్డుగా ఉండటంతో.. రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. ఇటు 132/ 11 కేవీ సామర్థ్యమున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ను భవిష్యత్తు అవసరా ల కోసం నిర్మించాలని టీఎస్‌ఐ ఐసీ ప్రతిపాదించింది. అయితే అభివృద్ధి పనులు సకాలంలో జ రగకపోవడంతో పరిహారం పెం చాలంటూ భూములు అప్పగించి న రైతులు అక్కడక్కడా తిరిగి సా గు చేసేందుకు ప్రయత్నిస్తుండ టం వివాదాలు సృష్టిస్తోంది.
యూనిట్ల స్థాపనేది?
టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన సందర్భంగా వస్త్రోత్పత్తిలో పే రొందిన 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆస క్తి చూపుతూ ప్రభుత్వంతో ఎంఓ యూ కుదుర్చుకున్నాయి. రెండే ళ్లు కావస్తున్నా మౌలిక వసతులు అందుబాటులోకి రాకపోవడం తో యూనిట్ల స్థాపనకు ముందు కు రావట్లేదు. ఎంఓయూ కుదుర్చుకున్న సంస్థల్లో ఏడింటికి ఆన్‌లైన్ విధానంలో 50 ఎకరాలు కే టాయించినా పనులు ప్రారంభించలేదు. నూలు ఉత్పత్తిలో పేరొందిన కరంజీ, ప్లాస్టిక్ వ్యర్థాల నుం చి యార్న్ తయారు చేసే గణేశ ఎకోస్పియర్ వంటి కంపెనీలు త్వరలో పనులు ప్రారంభించే అ వకాశముందని సమాచారం. మె గా టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల స్థాపన వేగవంతంగా జరగకపో వడంతో షోలాపూర్, సూరత్, భివండీ ప్రాంతాల్లో వస్త్రోత్పత్తి యూనిట్లు నడుపుతున్న తెలంగాణ వారితో టీఎస్‌ఎండీసీ తర చూ భేటీ అవుతోంది. కొరియాకు చెందిన యాం గ్‌వాన్ అంతర్జాతీయ వస్త్రోత్పత్తి సంస్థ రూ.700 కోట్లతో ‘యార్న్ టు ఫ్యాబ్రిక్’(నూలు నుంచి వస్త్రం వరకు) పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతుండటంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ టెక్స్‌టైల్ పార్కు ముఖ చిత్రాన్ని మారుస్తుందని టీఎస్‌ఐఐసీ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా ఏర్పాటయ్యే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా పది వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా.
వలస కార్మికులకు ఉపాధి కల్పించాలి..
తెలంగాణ చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే భివండీ, షోలాపూర్ ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమ సంక్షో భాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చి ఉపాధి పొందుదామని అనుకున్నా రెండేళ్లుగా టెక్స్‌టైల్ పార్కు పనులు ముందుకు సాగడం లేదు. ఎంఓయూ కుదుర్చుకున్న పరిశ్రమలు తక్షణం యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాలి. – దాసు సురేశ్, నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment