Kakatiya mega textile park
-
కైటెక్స్ వాస్తు కోసం భూ సర్వే
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు. పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు. ‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’ కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు. -
టార్గెట్ మిత్రా.. ప్లేస్ కొట్టుడు పక్కా
MITRA SCHEME - Kakatiya Mega Textile Park: చేనేత పరిశ్రమలను భారీ ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్రం మిత్రా పేరుతో సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్ట్టు ప్రకటించింది. ఈ మిత్రా పథకంలో చోటు దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. మిత్రా అంటే ? మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ అపారెల్ (మిత్రా) పేరుతో కేంద్రం సరికొత్త పథకాన్ని అక్టోబరు మొదటి వారంలో ప్రకటించింది. దేశం మొత్తం మీద ఏడు ప్రాంతాల్లో మెగా టెక్స్టైల్స్ పార్కును కేంద్రం నెలకొల్పుతుంది. అందులో భాగంగా ఈ పథకం ప్రకారం కనీసం వెయ్యి ఎకరాల్లో ఏర్పాటయ్యే టెక్స్టైల్స్ పార్క్‌కి నిధులు సమకూరుస్తుంది. ఎందుకీ మిత్ర పొరుగున్న ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకలు మనకంటే వస్త్రాల పరిశ్రమ విషయంలో ఎంతో ముందున్నాయి. ఆ రెండు దేశాల్లో తయారైన దుస్తులు విదేశాలతో ఎగుమతి అవడంతో పాటు ఇండియా కంపెనీలు సైతం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి, దీంతో వస్త్రాల తయారీకి సంబంధించి స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఎగుమతులు చేయడం లక్ష్యంగా ఈ మిత్రాను కేంద్రం తెర మీదకు తెచ్చింది. సౌకర్యాలు ఇలా మిత్రా పథకంలో దేశంలో నెలకొల్పే ఏడు మెగా టెక్స్టైల్స్ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో వస్త్ర పరిశ్రమలు మొదలయ్యేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పిస్తుంది. ఇందులో రోడ్లు, విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్లు, రవాణా సౌకర్యాలు, కార్మికులు ఉండేందుకు వీలుగా క్వార్టర్లు, హస్టళ్లు తదితర అన్ని రకాల మౌలిక సదుపాయలు కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. భూసేకరణ నిధులు సైతం కేంద్రం మంజూరు చేస్తుంది. పోటీలో పలు రాష్ట్రాలు మిత్రా పథకం దక్కించుకునేందుకు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, ఓడిషా, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మిత్ర పథకం కోసం పోటీ పడే రాష్ట్రాలు మూడు నెలల్లోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపివ్వాల్సి ఉంటుంది. కాకతీయ మెగా పార్క్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా నూలు నుంచి షర్ట్ వరకు అన్ని వస్తువులు ఒకే చోట తయారయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుని వరంగల్ నగరానికి మంజూరు చేసింది. 2017లో ఈ పార్కు పనులు మొదలయ్యాయి. దీని కోసం ఇప్పటికే 1200 ఎకరాల స్థల సేకరణ జరిగింది. మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వెల్స్పన్, కైటెక్స్, దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌గూన్ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అయితే నిధుల లేమి కారణంగా ఈ పార్కు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పార్కు పనులకు నిధులు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి తెలంగాణ సర్కారు విజ్ఙప్తి చేసింది. అనుకూల అంశాలు మిత్ర పథకం కింద పార్కు మంజూరు కావాలంటే వెయ్యికి పైగా ఎకరాలు రెడీ చేయాలి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యింది. వరంగల్ చుట్టు పక్కల జిల్లాలో పత్తి అధికంగా పండుతుంది. దీనికి తోడు ఇప్పటికే రైలు, రోడ్డు మార్గాలకు ఇబ్బంది లేదు. త్వరలో వాయు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో వరంగల్‌కు మిత్ర పథకం మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయనే ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒత్తిడి తప్పదు గతంలో తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ పార్కుని కేంద్రం రద్దు చేసింది. మరోవైపు విభజన చట్టంలో పేర్కొన్న కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అటక మీదకు నెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంపై నలువైపులా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈసారి మిత్రాకి అన్ని అర్హతలు ఉన్నా కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనవాయితే అనే అభిప్రాయం నెలకొంది. అయితే కేంద్రం ఆమోద ముద్ర వేసే వరకు ఒత్తిడి తేవాలనే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది. - సాక్షి , వెబ్ ప్రత్యేకం చదవండి :తెలంగాణపై ఫ్రెంచ్ ఫోకస్.. మరో అద్భుత అవకాశం -
‘టెక్స్టైల్ పార్క్’ ఇంకెప్పుడు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఇంకా తుది రూపం దాల్చలేదు. రూ.1,150.47 కోట్ల అంచనాతో ఐదు దశల్లో మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా రూపొందించిన ప్రణాళిక ముందుకు సాగట్లేదు. భూమిని చదును చేయడం, రోడ్లు, వరద నీటి కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, సీఈటీపీ, విద్యు త్, సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలిదశలో రూ.439.50 కోట్లతో పను లు చేపట్టాలని నిర్ణయించగా, గీసుకొండ మండ లం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లిలో 1,190 ఎకరాల భూమిని రూ.110 కోట్లతో సేకరించారు. ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఐఎల్ఎఫ్ఎస్ అనే కన్సల్టెన్సీకి అప్పగించి, ఇప్పటివరకు రూ.50 కోట్లతో పార్కు కాంపౌండ్ వాల్, కొన్ని అంతర్గత రోడ్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా పార్కు అవసరాల కోసం ప్రత్యేకమైన తాగునీటి పైపులైను నిర్మాణం కొనసాగుతోంది. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మరో రూ. 50 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. తొలిదశ పనుల పూర్తికి మరో రూ.230 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం ఆచితూచి నిధులు ఖర్చు చేస్తోంది. భూ వివాదాల కొలిక్కి యత్నాలు.. టెక్స్టైల్ పార్కును ఐదు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసి, పర్యావర ణ అనుమతులూ సాధించా రు. కాలుష్య శుద్ధీకరణకు కా మన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెం ట్ ప్లాంటు (సీఈటీపీ) ఏర్పాటుకు ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీం (ఐపీడీఎస్) కింద ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఇటు పార్కు అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ స్కీం (ఐటీపీఎస్) కింద ఆర్థిక సా యం చేయాలని రాష్ట్ర ప్రభు త్వం కోరుతోంది. అయితే, పార్కుకు దారితీసే గంగదేవిపల్లి అప్రోచ్‌రోడ్డు పనులు భూ వివాదాల కారణంగా కో ర్టు కేసులో చిక్కుకుని అర్ధంతరంగా నిలిచిపోయాయి. రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలె క్టర్ ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. పార్కు అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 3 ఎంఎల్డీలు సరఫ రా చేసేలా పనులు కొనసాగుతుండగా, భవిష్యత్తులో చలివాగు నుంచి ప్రత్యేక నీటి పైపులైను నిర్మించాలని ప్రతిపాదించారు. మరోవైపు పార్కుకు వెళ్లే మార్గంలో రైల్వే లైను అడ్డుగా ఉండటంతో.. రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. ఇటు 132/ 11 కేవీ సామర్థ్యమున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ను భవిష్యత్తు అవసరా ల కోసం నిర్మించాలని టీఎస్ఐ ఐసీ ప్రతిపాదించింది. అయితే అభివృద్ధి పనులు సకాలంలో జ రగకపోవడంతో పరిహారం పెం చాలంటూ భూములు అప్పగించి న రైతులు అక్కడక్కడా తిరిగి సా గు చేసేందుకు ప్రయత్నిస్తుండ టం వివాదాలు సృష్టిస్తోంది. యూనిట్ల స్థాపనేది? టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన సందర్భంగా వస్త్రోత్పత్తిలో పే రొందిన 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆస క్తి చూపుతూ ప్రభుత్వంతో ఎంఓ యూ కుదుర్చుకున్నాయి. రెండే ళ్లు కావస్తున్నా మౌలిక వసతులు అందుబాటులోకి రాకపోవడం తో యూనిట్ల స్థాపనకు ముందు కు రావట్లేదు. ఎంఓయూ కుదుర్చుకున్న సంస్థల్లో ఏడింటికి ఆన్లైన్ విధానంలో 50 ఎకరాలు కే టాయించినా పనులు ప్రారంభించలేదు. నూలు ఉత్పత్తిలో పేరొందిన కరంజీ, ప్లాస్టిక్ వ్యర్థాల నుం చి యార్న్ తయారు చేసే గణేశ ఎకోస్పియర్ వంటి కంపెనీలు త్వరలో పనులు ప్రారంభించే అ వకాశముందని సమాచారం. మె గా టెక్స్టైల్ పార్కులో యూనిట్ల స్థాపన వేగవంతంగా జరగకపో వడంతో షోలాపూర్, సూరత్, భివండీ ప్రాంతాల్లో వస్త్రోత్పత్తి యూనిట్లు నడుపుతున్న తెలంగాణ వారితో టీఎస్ఎండీసీ తర చూ భేటీ అవుతోంది. కొరియాకు చెందిన యాం గ్వాన్ అంతర్జాతీయ వస్త్రోత్పత్తి సంస్థ రూ.700 కోట్లతో ‘యార్న్ టు ఫ్యాబ్రిక్’(నూలు నుంచి వస్త్రం వరకు) పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతుండటంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ టెక్స్టైల్ పార్కు ముఖ చిత్రాన్ని మారుస్తుందని టీఎస్ఐఐసీ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా ఏర్పాటయ్యే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా పది వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. వలస కార్మికులకు ఉపాధి కల్పించాలి.. తెలంగాణ చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే భివండీ, షోలాపూర్ ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమ సంక్షో భాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చి ఉపాధి పొందుదామని అనుకున్నా రెండేళ్లుగా టెక్స్టైల్ పార్కు పనులు ముందుకు సాగడం లేదు. ఎంఓయూ కుదుర్చుకున్న పరిశ్రమలు తక్షణం యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాలి. – దాసు సురేశ్, నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ -
పరాయి రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేయండి
-
పరాయి రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేయండి : కేసీఆర్
సాక్షి, శాయంపేట : వృత్తినైపుణ్యం ఉండి, పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికులు తిరిగి సొంతగడ్డ తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు ఆయన ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకోనున్నఈ టెక్స్టైల్ పార్కు ద్వారా లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ఇకపై నేతన్నలు వలసలు పోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. చీరలు, బనీన్లు, చెడ్డీలు అన్నీ ఇక్కడే : శాయంపేటలో నెలకొల్పిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అన్నిరకాల దుస్తులూ తయారవుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘గుజరాత్‌లోని సూరత్ చీరలకు ప్రసిద్ధి, తమిళనాడులోని సిర్పూరులో బనీన్లు, చెడ్డీలు ఎక్కువగా తయారవుతాయి. అదే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రజాయీలు, దుప్పట్లు తయారవుతాయి. వీటన్నింటి కలబోతగా కాకతీయ పార్కు తయారు కానుంది. చీరల దగ్గర్నుంచి, బనీన్లు, చెడ్డీలు, దుప్పట్లు సర్వం ఇక్కడే తయారుతాయి. పత్తిని వడికించడం మొదలు, తయారైన దుస్తులను దేశదేశాలకు ఎగుమతి చేసేదాకా అన్ని హంగులూ ఇక్కడ ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. శంకుస్థాపన రోజే రూ.3,900 కోట్ల పెట్టుబడులు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన రోజే రూ.3,900 కోట్ల విలువైన 22 ఒప్పందాలు కుదిరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో దేశీయ, విదేశీ సంస్థలు కూడా ఉన్నాయన్నారు. తక్కువ సమయంలోనే కాకతీయ టెక్స్టైల్ పార్కుకు పెట్టుబడులు సాధించించిపెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను, ఆ శాఖ ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. బంగారు వరంగల్.. ఆతర్వాతే బంగారు తెలంగాణ : శాయంపేటలో మెగా టెక్స్‌దీంతో పాటు కాజీపేట ఆర్వోబీ, వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2 పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా అంటే తనకు ప్రాణమని, ఇక్కడిరైతులు వద్దనేదాకా కాళేశ్వరం నీళ్లు ఇస్తామని, ముందుగా బంగారు వరంగల్‌ను తయారుచేసిన తర్వాతే బంగారు తెలంగాణను తయారుచేస్తామని కేసీఆర్ అన్నారు. -
టెక్స్టైల్ ప్రోమోకు ఆదరణ
ఇప్పటి వరకు 5,530 మంది వీక్షణ సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రోమోకు మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన ఈ ప్రోమోను ఇప్పటి వరకు 5,530 మంది వీక్షించారు. జిల్లాలోని గీసుకొండ, సంగెం మండ లాల పరిధిలోని 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టెలా దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన వీడియోను జూలై1న విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ, చేనేత జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రోమోను ట్వీటర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 50 లక్షల పత్తి బేళ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నారు.