
ధర్మవరం: కళాత్మక మైన చేనేత రంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ధర్మవరం పట్టుచీరలకు గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత సదస్సు నిర్వహించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ మాట్లాడుతూ దేశానికి నాగరికతను నేర్పిన చేనేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గిట్టుబాటు ధర లేక ఈ మూడేళ్ల లో పదుల సంఖ్యలో చేనేతలు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సు ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే వరదాపురం సూరిని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment