రాష్ట్రం విడిపోతే చేనేతకు గడ్డుకాలం | Movement is the head of state of conservation YSRCP | Sakshi
Sakshi News home page

రాష్ట్రం విడిపోతే చేనేతకు గడ్డుకాలం

Published Thu, Oct 24 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

Movement is the head of state of conservation YSRCP

ఉరవకొండ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు తరలిరావాలని ఆల్ ఇండియూ హ్యాండ్‌లూమ్ డెరైక్టర్ చందావెంకటస్వామి పిలుపు నిచ్చారు. స్థానిక చౌడేశ్వరీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయుంలో బుధవారం జిల్లా చేనేత పారిశ్రామిక  నాయుకుల సవూవేశం నిర్వహించారు.

 ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు తరలివెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం విలేకరులతో చందావెంకటస్వామి వూట్లాడారు.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి ఆశయు సాధన కోసం పాటు పడుతున్నారన్నారు. చేనేత కార్మికుల సవుస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. ధర్మవరంలో ఆవురణ దీక్షతోపాటు, సిరిసిల్లలో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయువ్ము ఆవురణదీక్ష చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించారన్నారు.
 
 విభజన అంశంపై ఇతర రాజకీయు పార్టీలు  రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుండగా, వైఎస్సార్‌సీపీ వూత్రం  స్పష్టమైన సమైక్య నినాదంతో పోరాడుతోందన్నారు.  ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దలకు సమైక్య సెగ తగిలేలా హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement