కార్మికులకు సొంతంగా బీమా చెల్లించిన కేటీఆర్
సిరిసిల్ల : చేనేత, పవర్ లూమ్ కార్మికులకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు బీమా కానుక ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని 25 వేల మంది కార్మికులకు ప్రమాద బీమా ప్రీమియంను మంత్రి సొంతంగా చెల్లించారు. కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల శాశ్వత అంగవైకల్య బీమాను కేటీఆర్ కానుకగా ఇచ్చారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఈ బీమా విషయంపై హర్షం వ్యక్తం చేశారు.