కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న నాయకులు | jac leaders stops minister ktr convey over sircilla district demand | Sakshi
Sakshi News home page

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న నాయకులు

Published Sun, Sep 25 2016 8:20 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

jac leaders stops minister ktr convey over sircilla district demand

గంభీర్‌రావుపేట : కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. గంభీర్‌రావుపేట మండలం మల్లుపల్లె వద్ద ఆదివారం సాయంత్రం సిరిసిల్ల సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 
సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను రహదారిపై తొలగించి మంత్రి కాన్వాయ్ను పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement