
పాస్ పుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : చేనేత రంగానికి ప్రభుత్వం అండగా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పుట్టపాకలో శ్రీభావనాబుుషి మిశ్రమ చేనేత సహకార సంఘంలో సబ్సిడీపై నూలును, పాస్ పుస్తకాలను గురవారం కార్మికలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక చేనేతపై ప్రత్యేక దృష్టి పెట్టిందిన్నారు. స్టాండ్ మగ్గములు ఇప్పించాలని ఎమ్మెల్యేకు కార్మికులు విన్నవించారు. కార్యక్రమంలో పద్మశ్రీ ఆవార్డు గ్రహీత గజం గోవర్ధన్, జెడ్పీటీసీ సభ్యుడు బోల్ల శివశంకర్, వీవర్ సర్వీస్ సెంటర్ ఏడీ హిమేజ్‌కుమార్, సర్పంచ్ నల్లగొండ కళమ్మ, వర్కాల చంద్రశేఖర్, సంఘం ఆధ్యక్షురాలు సామల విజయలక్ష్మీభాస్కర్, గజం సత్యనారాయణ, కత్తుల లక్ష్మయ్య, మిర్యాల శ్రీను, గురునాధం, పరదేశి, రమేష్, ఉమాశంకర్, సాంబయ్య, తదితరలున్నారు.