వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం చేనేత కార్మికులు కలిశారు.
తమ సమస్యలను ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని వినతిపత్రం అందజేశారు. దీంతో చేనేతన్నలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు.