
చేనేతకు చేయూత
భూదాన్‌పోచంపల్లి/ చౌటుప్పల్: చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తానని పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్ చెప్పా రు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును సందర్శించారు.మగ్గాలను పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ... పోచంపల్లి ఇక్కత్ వస్త్రా లకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ తగిన మార్కెటింగ్ లేక అవకాశాలను అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నెల 18న కేరళలో జరిగే దక్షిణ భారత ఫ్యాషన్ షోలో పోచంపల్లి గౌను ధరించి జడ్జిగా పాల్గొనబోతున్నానని, అలాగే ఓ హాలివుడ్ సినిమాలో సైతం పోచంపల్లి వస్త్రాలను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.