సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సీఎం జగన్ నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘చేనేతల కష్టాలను నా 3648 కిలో మీటర్ల సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులకు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండగా ఉంటున్నాం. నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇక్కడ చదవండి: జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్’
చేనేతల కష్టాలను నా 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులకు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండగా ఉంటున్నాం. నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.#NationalHandloomDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2021
Comments
Please login to add a commentAdd a comment