సాక్షి,విజయవాడ : అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచేలా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 40 నుండి 50 శాతం వరకు విధించనుంది.
అయితే, అమరావతి విలువ పెరగలేదని నిర్ణయించుకున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు నుంచి అమరావతికి మినహాయింపు ఇచ్చింది.అన్ని చోట్ల పెంచి అమరావతికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గి, అమరావతిలో పెంచేందుకు ప్లాన్ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంచేయాలని తీసుకున్న నిర్ణయానికి జాయింట్ కలెక్టర్ల కమిటీలు ఆమోదం తెలిపారు.
దీంతో వచ్చే నెల ఒకటో తేదీ నుండే పెంచిన ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నివాస, అపార్ట్ మెంట్లు, వాణిజ్య భవనాల విలువ భారీగా పెరగనుంది. కాగా,ఎన్నికల ముందు భారం మోపమని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే జనంపై బాదుడుకు సిద్దమవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment