aliance
-
ఏపీకి కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం
సాక్షి,విశాఖ : ఏపీకి కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఖరారు చేసింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్‌గా మార్చింది. 410 కిమీ ట్రాక్ పరిధి కేటాయించింది. అయితే కొత్త వలస - కిరండూల్ లైన్ లేకుండా దక్షిణ కోస్తా జోన్ పరిధిని మాత్రమే రైల్వే శాఖ నిర్ణయింది. ఒక్క కేకే లైన్ లేని జోన్ వృధా అని మొదటి నుంచి ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అయినా జోన్ల విషయంలో రైల్వే శాఖ వెనక్కి తగ్గలేదు. తాజా విభజనతో రాయగడ డివిజన్‌కు కేకే లైన్ ఆదాయం వెళ్లనుంది. అయినా కేంద్రం ఇంతటి ద్రోహం చేస్తున్నా కూటమి ఎంపీలో నోరు మెదపక పోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో భారీగా రిజిష్ట్రేషన్ ఛార్జీలు బాదుడుకు రంగం సిద్ధం
సాక్షి,విజయవాడ : అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచేలా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 40 నుండి 50 శాతం వరకు విధించనుంది. అయితే, అమరావతి విలువ పెరగలేదని నిర్ణయించుకున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు నుంచి అమరావతికి మినహాయింపు ఇచ్చింది.అన్ని చోట్ల పెంచి అమరావతికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గి, అమరావతిలో పెంచేందుకు ప్లాన్ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంచేయాలని తీసుకున్న నిర్ణయానికి జాయింట్ కలెక్టర్ల కమిటీలు ఆమోదం తెలిపారు.దీంతో వచ్చే నెల ఒకటో తేదీ నుండే పెంచిన ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నివాస, అపార్ట్ మెంట్లు, వాణిజ్య భవనాల విలువ భారీగా పెరగనుంది. కాగా,ఎన్నికల ముందు భారం మోపమని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే జనంపై బాదుడుకు సిద్దమవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
జమిలి ఎన్నికలంటూ.. దోచుకోవడానికి టీడీపీ సిద్ధమైందా?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి : కూటమి నేతల దారుణాల్ని చూసి తాము టీడీపీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.ఎక్స్ వేదికపై ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ‘టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..?జమిలి....జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2024 జమిలి.. జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..?కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మతిమరుపు వ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా ?అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికార యంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా? ’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం !
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విజయమని అభివర్ణించింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలనే ఆకాంక్షను నాట్స్ వ్యక్తం చేసింది.అమెరికాలో ఉండే తెలుగు ప్రజల తరఫున నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి) -
పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు
-
కాంగ్రెస్ కు ఈసారి టీడీపీ దరిద్రం లేనట్టే
-
బిగ్ క్వశ్చన్: పొత్తు లేకుండా పోటీచేసే దమ్ము బాబుకు లేదా..?
-
పొత్తుకోసం పొరుగు రాష్ట్రంలో భేటీ
-
పొలిటికల్ కామెంట్ : టీడీపీతో పొత్తుకోసం బీజేపీని బెదిరిస్తున్న పవన్
-
పొలిటికల్ కారిడార్ : టీడీపీతో పొత్తుపై మోదీ క్లారిటీ ..
-
బిగ్ క్వశ్చన్ : కథ ,స్క్రీన్ ప్లే , డైరెక్షన్ అంతా చంద్రబాబే ..!
-
బిగ్ క్వశ్చన్ : పాత మొగుడు .. కొత్త కాపురం
-
ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది
వాషింగ్టన్: అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం ఓ వింత వస్తువు ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. 12 అడుగుల పొడవున్న ఈ లోహపు దిమ్మె నర సంచారం లేని ఆ ఎడారిలోకి ఎలా వచ్చేందనే విషయం ఇంకా మిస్టరీగానే ఉండగా... తాజాగా మరో వింత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కనిపించకుండా పోయింది. దాంతో తప్పకుండా ఇది ఏలియన్స్ పనే అంటున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో ల్యాండ్ మేనేజ్మెంట్ బ్యూరో అధికారులు ‘ఒక్కరు లేదా కొందరు వ్యక్తులు కలిసి ఈ దిమ్మెను శుక్రవారం రాత్రి తొలిగించినట్లు మాకు తెలిసింది’ అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. ‘లోహపు దిమ్మెను తొలగించారు. బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాతిన లోహపు దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని దానిలో పేర్కొన్నారు. ఈ నిర్మణాన్ని తొలగించినట్లు ఉటా హైవే పాట్రోల్ సీపీఎల్ అధికారి ఒకరు ఆదివారం వాషింగ్టన్ పోస్ట్‌కు తెలియజేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. (చదవండి: ఏముంది.. అక్కడే పడుకో: భార్య) ‘అసలు ఆ దిమ్మెను ఎడారిలో ఎవరు నిలబెట్టారు.. ఇప్పుడు ఎవరు తొలగించారు. అంతా మాయాలా ఉంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం దీని గురించి ఇంటర్నెట్లో తెగ చర్చ నడుస్తోంది. ‘ఏలియన్స్ వచ్చి దాన్ని తీసుకెళ్లాయి’.. ‘ఇప్పుడు ఆ దిమ్మె మరో చోట ప్రత్యక్షం అవుతుందేమో’.. ‘ఆ దిమ్మె ఏలియన్స్‌కు సంబంధించిన వస్తువు. అందుకే అధికారుల సీక్రేట్‌గా దాన్ని తొలగించారు.. దాని ఏం మాట్లాడటం లేదు’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఈ నెల 18న కొందరు కార్మికులు ఈ నిర్మణాన్ని గమనించారు. రెడ్ రాక్ రిమోట్ ఏరియాలో దిమ్మె ప్రత్యక్షం అయ్యిందని తెలిపారు. నాటి నుంచి ఈ దిమ్మె తెగ వైరలయ్యింది. ఇక ఈ దిమ్మె ఎక్కడ ఉంది అనే దాని గురించి ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. -
ఆప్‌తో పొత్తు ఉండదు : షీలా దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు ఉండదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో మంగళవారం సమావేశమైన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఈ విషయం వెల్లడించారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఢిల్లీ పార్టీ చీఫ్ షీలా దీక్షిత్ ప్రకటనతో తెరపడింది. ఢిల్లీలో బీజేపీ క్వీన్‌స్వీప్ చేయకుండా నిరోధించేందుకు ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అవసరమని కేజ్రీవాల్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌లు పరస్పరం ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న క్రమంలో ఆప్‌తో పొత్తు పొసగదని సీనియర్ నేత షీలా దీక్షిత్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీచేస్తే దేశరాజధానిలో బీజేపీకి మేలు చేకూరుతుందని ఆప్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బార్నార్డ్ బీపై ఏలియన్స్!
న్యూయార్క్: మన సౌర కుటుంబం బయట ఉన్న సూపర్ ఎర్త్‌పై జీవం ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మనకు అతి దగ్గరగా ఉన్న రెండో నక్షత్ర వ్యవస్థ బార్నార్డ్లో ఈ గ్రహం ఉంది. దీని పేరు బార్నార్డ్ బీ (లేదా జీజే 699 బీ). ఇది భూమికి కనీసం 3.2 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ 233 రోజులకోసారి భ్రమణం పూర్తి చేస్తోంది. ఈ గ్రహంపై –170 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే జియోథర్మల్ యాక్టివిటీ కారణంగా ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని విలనోవా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అంటార్కిటికాలో కనిపించిన భూగర్భ సరస్సులలోలాగే ఈ గ్రహంపై జరిగే జియోథర్మల్ ఉష్ణం కారణంగా ఉపరితలం కింద జీవం ఉండొచ్చని ఈ యూనివర్సిటీలోని ఆస్ట్రోఫిజిసిస్ట్ ఎడ్వర్డ్ గినన్ చెప్పారు. గురు గ్రహ చంద్రుడు యురోపాపై కూడా బార్నార్డ్ బీలాంటి ఉష్ణోగ్రతలే ఉన్నాయని గినన్ తెలిపారు. అమెరికన్ ఆస్ట్రోనామీ సొసైటీ 233వ సమావేశం సందర్భంగా తమ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. -
పొత్తుల కోసం కమల్ అన్వేషణ
చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీ్టలతో జట్టు కట్టాలని సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ నిర్ణయించింది. భావ సారూప్యాలున్న పార్టీని వెతికి, పొత్తు కుదుర్చుకునే బాధ్యతను పార్టీ అధినేత కమల్ హాసన్‌కే అప్పగించింది. శనివారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్, పాలనా కమిటీల చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. కూటమి కోసం తాము చేస్తున్న యత్నాలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించగా..ఇప్పుడే వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పొత్తు కుదుర్చుకునే పార్టీ సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నా, ఆలోచనా విధానం తమిళనాడుకు అనుకూలంగా ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాగా లోక్‌సభ బరిలో దిగుతామని చెప్పారు. తమిళనాడు డీఎన్ఏను మార్చే పార్టీతో కలసి పనిచేయమని తెలపడం ద్వారా బీజేపీతో పొత్తు ఉండదని పరోక్షంగా చెప్పారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకుంటే, డీఎంకేతో పొత్తుకు సిద్ధమేనని కమల్ ప్రకటించగా డీఎంకే తోసిపుచ్చిన విషయం తెలిసిందే. -
యూపీఏలో చేరుతున్న టీడీపీకి స్వాగతం!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మున్ముందు కాంగ్రెస్‌తో అంటకాగుతారని బాహాటంగా వెల్లడైంది. యూపీఏలో చేరుతున్న టీడీపీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడం సంతోషమని, కేవలం తెలంగాణాలోనే కాకుండా టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని పీటీఐ ఇంటర్వ్యూలో మొయిలీ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం మంచి సంకేతమని, తెలుగుదేశం పార్టీతో మాకు మంచి అవగాహన ఉందని మొయిలీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు దిగడంపై తెలుగు రాష్ట్రాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులుకలపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీతో తమ పార్టీ పొత్తు భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని వీరప్ప మొయిలీ బాహాటంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు పొత్తుకు పాకులాడటం సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
‘కూటమితో బీజేపీని ఓడించగలం’
లక్నో : రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ కూటమి చాలా అవసరమని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఆదివారం మీడియాతో ముచ్చటించిన అఖిలేష్ పలు అంశాలను ప్రస్తావించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై మాట్లాడుతూ...‘ప్రస్తుత పరిస్థితిలో కూటమి అవసరం చాలా ఉంది. నేను కూటమిని నడిపించగలనని విశ్వసిస్తున్నా. బీఎస్పీతో కలిసి పనిచేయడానికి నేను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇద్దరిలో ఎవరు సీనియర్, జూనియర్ అనేది ముఖ్యంకాదని, ఇద్దరి లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టంచేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధుల గెలుపునకు మాయావతి కీలకంగా వ్యవహరించారని, మాయావతి సహకరించడంతోనే యోగి సొంత నియోజకవర్గంలో గెలుపు సాధ్యమైందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూటమిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌కు 100 సీట్లు ఇస్తే వారు మాకు మిగిలిన 300 స్థానాల్లో మద్దతు తెలిపారని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభావం, మిత్ర పక్షాల సహాయంతో 325 సీట్లతో విజయం సాధించి యోగి సీఎం కాగలిగారని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ మా కూటమి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. బీఎస్పీ అభ్యర్థిని గెలిపించడానికి మాయావతి తీవ్రంగా శ్రమించారని, ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా.. బీజేపీ అధికారం బలంతో మోకాలోడ్డిందని విమర్శించారు. ఎస్పీ అభ్యర్థి జయా బచ్చన్ ఓటమి చెందినా... బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించాలని ఆమె తనని కోరారని దానికి తాను అంగీకరించలేదని అఖిలేష్ తెలిపారు. మరో నెల రోజుల్లో మండలిలో తన పదవి కాలం ముగుస్తుండటంతో తిరిగి పోటిచేయట్లేదని ప్రకటించారు. కాగా మండలిలో ఏప్రిల్ 26న 13 మంది సభ్యులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీఎస్పీకి అవకాశం ఇస్తూందా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని అఖిలేష్ తెలిపారు. -
వైస్సార్సీపీలో స్పష్టత
– టీడీపీలో కొనసాగుతున్న సందిగ్ధత – బీజేపీతో తెగని పంచాయతీ – టీడీపీ మెట్టుదిగుతున్నా వెనక్కి తగ్గని బీజేపీ నేతలు – చివరికీ ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు అంగీకారం – 12 ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న బీజేపీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో స్పష్టత వచ్చేసింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అన్ని డివిజన్లలోనూ బరిలోకి దిగుతోంది. టీడీపీలో ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీ, బీజేపీ పొత్తు పంచాయతీ తెగలేదు. నిన్నటి వరకు మూడు డివిజన్లు ఇస్తామని చెప్పుకొచ్చిన టీడీపీ ఎనిమిది డివిజన్లు కేటాయించేందుకు ముందుకొచ్చింది. కానీ 12 కావాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో వ్యవహారం అదిష్టానం వద్దకు వెళ్లింది. గురువారం నామినేషన్లు భారీ ఎత్తున పడ్డాయి. ఈ ఒక్కరోజే 381 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు అభ్యర్థుల తాకిడితో కిటకిటలాడాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన కార్యకర్తల కోలహలంతో నగర వీధులు సందడితో రద్దీగా కనిపించాయి. ఎక్కడ చూసినా రాజకీయ పక్షాల హడావుడి కనిపించింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా పోటీపడి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యర్ధి పార్టీల నుంచి ఎవరేస్తున్నారో చూసుకుని అప్పటికప్పుడు ధీటైన అభ్యర్థులు దాఖలు చేసిన సందర్భాలు బయటపడ్డాయి. మొత్తంగా చూస్తే కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకుగాను 493 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తర్జనభర్జన టీడీపీలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. కొన్ని డివిజన్లకు సరైన అభ్యర్థులు దొరకకపోవడంతో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించడంతో డివిజన్‌కు ముగ్గురు చొప్పున పేర్లు రాసి పంపించినట్టు తెలిసింది. ఒక డివిజన్కైతే ఒక్కరిపేరే ప్రస్తావించగా ఏమిటీ పరిస్థితని నేతలను చంద్రబాబు గట్టిగా ఆరాతీసినట్టు సమాచారం. ముఖ్యంగా కాకినాడ 14వ డివిజన్లో అధికార పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా కరువయ్యాడు. దీంతో మరో 10 నిమిషాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుందనుకున్న సమయంలో చివరి క్షణంలో ఎమ్మెల్యే అన్న కొడుకు వనమాడి ఉమాశంకర్, మరో అభ్యర్థి చేత నామినేషన్ వేయించారు. మెట్టు దిగినా పట్టువదలని బీజేపీ టీడీపీతో బీజేపీ ఒక ఆట ఆడుకుంటోంది. అధికార పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం, మిత్రపక్షాన్ని వదులుకునే ధైర్యం చేయలేక బీజేపీ ఏమి చెబితే అదే చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆ పార్టీ బలం కన్నా ఎక్కువ సీట్లు అడుగుతుండగా, ఇవ్వకపోతే ఇబ్బంది అన్నట్టుగా టీడీపీ సాగిలా పడిపోతోంది. బీజేపీ తొలుత 20 సీట్లు అడగ్గా కేవలం రెండే ఇస్తామని టీడీపీ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించింది. ఆ తరువాత బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి గట్టిగా హెచ్చరించడంమే కాకుండా అమీతుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేయడంతో టీడీపీ వెనక్కి తగ్గింది. ఐదిస్తామని బేరం పెట్టింది. కానీ బీజేపీ ససేమిరా అనడంతో తాజాగా ఎనిమిది ఇచ్చేందుకు అధికార పార్టీ అంగీకరించింది. దానికి బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు. 12 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినా సీట్ల పంపకాల పంచాయతీ కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులు 20 డివిజన్లకుగాను 35మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ టీడీపీ దారికి రాకపోతే బరిలో ఉండిపోదామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలన్న దానిపై అదిష్టానానికి వదిలేశారు. బీజేపీ అడుగుతున్న డివిజన్ల వివరాలను, కేటాయిస్తామన్న డివిజన్ల వివరాలను అదిష్టానానికి పంపించారు. ఇప్పుడక్కడే నిర్ణయం తీసుకోవల్సి ఉంది. -
లెఫ్ట్ రెడీ... ఇక ఉద్యమించండి
ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో వివిధ సామాజిక ఉద్యమాలు, ఆందోళనలు జోరుగా సాగుతున్నాయి. బీసీ సబ్‌ప్లాన్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, మైనార్టీల రిజర్వేషన్లు... తాజాగా మద్యం పాలసీ, చీప్లిక్కర్లపై వివిధ దశల్లో నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సీపీఎం నేతలు చేపట్టారు. వీటి వెనక బలమైన కారణంతోపాటూ ఒక రహస్యం కూడా ఉందని ఇతర వామపక్షాల నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. పార్టీ అవసరాలు, కార్యక్రమాలకు పనికి వస్తుందని సీపీఎం ఒక బస్సును సిద్ధంగా ఉంచుకుంది. ఆయా ముఖ్యమైన సమస్యలు, అంశాలపై ఆందోళనలు లేదా జిల్లా పర్యటనలు చేపట్టేందుకే బస్సును అందుబాటులో పెట్టుకున్నామని సీపీఎం నాయకులు చెబుతున్నారు. తమ పార్టీ పరంగానే కాకుండా ఏదైనా సంయుక్త కార్యాచరణ లేదా ఉమ్మడి ఆందోళనలు నిర్వహించేందుకు ఇతర వామపక్షాల అఖిలపక్షం ఈ బస్సును ఉపయోగించుకోవచ్చునని ఇతర పార్టీలకు ఆఫర్ కూడా ఇచ్చారట... సీపీఎం బస్సు రెడీ... ఉద్యమించడమే తరువాయి. -
టిడిపి-బిజెపిలో పొత్తుల చిచ్చు
-
కాంగ్రెస్ 'చేతి'కే సుత్తి కొడవలి..?