జమిలి ఎన్నికలంటూ.. దోచుకోవడానికి టీడీపీ సిద్ధమైందా?: ఎంపీ విజయసాయిరెడ్డి | Mp Vijaya Sai Reddy Satire On Chandrababu Over Jamili Elections | Sakshi
Sakshi News home page

జమిలి ఎన్నికలంటూ.. దోచుకోవడానికి టీడీపీ సిద్ధమైందా?: ఎంపీ విజయసాయిరెడ్డి

Published Mon, Nov 4 2024 1:17 PM | Last Updated on Mon, Nov 4 2024 3:49 PM

Mp Vijaya Sai Reddy Satire On Chandrababu Over Jamili Elections

సాక్షి,తాడేపల్లి : కూటమి నేతల దారుణాల్ని చూసి తాము టీడీపీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఎక్స్ వేదికపై ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ‘టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..?

 

 

జమిలి.. జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు  వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..?

కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత  నేపథ్యంలో మతిమరుపు వ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా ?

అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికార యంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా? ’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement