
న్యూయార్క్: మన సౌర కుటుంబం బయట ఉన్న సూపర్ ఎర్త్‌పై జీవం ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మనకు అతి దగ్గరగా ఉన్న రెండో నక్షత్ర వ్యవస్థ బార్నార్డ్‌లో ఈ గ్రహం ఉంది. దీని పేరు బార్నార్డ్ బీ (లేదా జీజే 699 బీ). ఇది భూమికి కనీసం 3.2 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ 233 రోజులకోసారి భ్రమణం పూర్తి చేస్తోంది. ఈ గ్రహంపై –170 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని భావిస్తున్నారు.
అయితే జియోథర్మల్ యాక్టివిటీ కారణంగా ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని విలనోవా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అంటార్కిటికాలో కనిపించిన భూగర్భ సరస్సులలోలాగే ఈ గ్రహంపై జరిగే జియోథర్మల్ ఉష్ణం కారణంగా ఉపరితలం కింద జీవం ఉండొచ్చని ఈ యూనివర్సిటీలోని ఆస్ట్రోఫిజిసిస్ట్ ఎడ్వర్డ్ గినన్ చెప్పారు. గురు గ్రహ చంద్రుడు యురోపాపై కూడా బార్నార్డ్ బీలాంటి ఉష్ణోగ్రతలే ఉన్నాయని గినన్ తెలిపారు. అమెరికన్ ఆస్ట్రోనామీ సొసైటీ 233వ సమావేశం సందర్భంగా తమ అధ్యయన ఫలితాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment