సాక్షి,విశాఖ : ఏపీకి కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఖరారు చేసింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్‌గా మార్చింది. 410 కిమీ ట్రాక్ పరిధి కేటాయించింది. అయితే కొత్త వలస - కిరండూల్ లైన్ లేకుండా దక్షిణ కోస్తా జోన్ పరిధిని మాత్రమే రైల్వే శాఖ నిర్ణయింది.
ఒక్క కేకే లైన్ లేని జోన్ వృధా అని మొదటి నుంచి ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అయినా జోన్‌ల విషయంలో రైల్వే శాఖ వెనక్కి తగ్గలేదు. తాజా విభజనతో రాయగడ డివిజన్‌కు కేకే లైన్ ఆదాయం వెళ్లనుంది. అయినా కేంద్రం ఇంతటి ద్రోహం చేస్తున్నా కూటమి ఎంపీలో నోరు మెదపక పోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment