
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు మీడియాతో మాట్లాడొద్దంటూ షరతులు విధించారు. ఇందులో భాగంగా షరతులతో కూడిన సర్క్యులర్ మెమోను స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం జారీ చేసింది.
తాజా,స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తాము చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.యాజమాన్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేస్తున్నారు.
కాగా,ఆదివారం స్టీల్‌ప్లాంట్ కార్మికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అనంతరం యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment