సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ ‘జల’గల రాజకీయం చేస్తుంది. విజయనగరం జిల్లా ఎల్ కోట కళ్లెంపూడిలో బీజేపీ నేత కోన మోహనరావు నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక తమ నామినేషన్ స్వీకరించాలని డీఈ శ్రీచరణ్ కాళ్లు పట్టుకున్నారు. కాళ్లు పట్టుకున్నా నామినేషన్‌ను డీఈ శ్రీచరణ్ అనుమతించలేదు. టీడీపీ నేతలు చెప్పినట్టు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు.
శనివారం విజయ నగరం జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు గందరగోళంగా సాగాయి. వైఎస్సార్‌సీపీ మద్దతు రైతులకు చివరి నిమిషం వరకూ నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో.. సాగునీటి సంఘాల ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది.
కొన్ని చోట్ల కూటమి పక్షాలే ఎన్నికల్లో బాహాబాహీకి దిగాయి. జనసేన,బీజేపీ నాయకులు ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడం ఉద్రక్తితకు దారి తీసింది.
ఇలా ఒక్క విజయ నగరం జిల్లా మాత్రమే కాకుండా సాగు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ప్రతి చోట టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తమ వాళ్లు తప్ప ఇతరులెవరూ పోటీ చేయకూడదని హుకుం జారీ చేస్తున్నారు. తాము చెప్పిన వాళ్లే ఎన్నికయ్యేలా చూడాలని అధికారులకు సూచిస్తున్నారు. దీంతో కూటమి నేతలు హుకుం జారీ చేయడంతో అధికారులు వారి ఆదేశాల్ని పాటిస్తున్నారు.
బలవంతపు ఏకగ్రీవం చేస్తున్నారు. దీంతో కూటమి నేతలే ఎన్నికైనట్లు ప్రకటనలు చేస్తున్నారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా పోటీ చేస్తున్న రైతుల్ని వేధింపులకు గురి చేయడమే కాదు, నామినేషన్ పత్రాల్ని సైతం చించేస్తున్నారు. ఓటర్లను లోపలికి అనుమతించకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసుల ప్రతాపం చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment