ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం ! | Greetings From NATS About the Victory Of NDA Alliance In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై నాట్స్ హర్షం !

Published Thu, Jun 6 2024 10:12 AM | Last Updated on Thu, Jun 6 2024 12:03 PM

Greetings From NATS About the Victory Of NDA Alliance In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విజయమని అభివర్ణించింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలనే ఆకాంక్షను నాట్స్ వ్యక్తం చేసింది.

అమెరికాలో ఉండే తెలుగు ప్రజల తరఫున నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు ప్రత్యేక అభినందనలు  తెలిపారు.

(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement