చేనేతను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి | Cada Venkata Reddy said ts govt take adopt handloom sector | Sakshi
Sakshi News home page

చేనేతను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి

Published Sat, Mar 4 2017 2:56 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

చేనేతను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి - Sakshi

చేనేతను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దత్తతకు తీసుకుని కార్మికుల సంక్షేమానికి నిర్దిష్ట విధానాన్ని రూపొందిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. చేనేత రంగంపై సీఎం కేసీఆర్‌ ఇటీవల సమీక్ష నిర్వహించినా.. క్షేత్రస్థాయి నుంచి ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహనకు వచ్చినట్లు కనిపించడంలేదన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం మగ్దూంభవన్‌లో చేనేత కార్మికుల సమస్యలపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో చాడ మాట్లాడుతూ రెండేళ్ల కిందట నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత చేతివృత్తుల వారికి న్యాయం జరుగుతుందని ఆశించగా, ప్రభుత్వం మాత్రం పెద్దగా ఆలోచించకపోవడం శోచనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement