
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ పత్రాన్ని పోతుల సునీతకు గురువారం అందజేశారు. శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోతుల సునీత ఒక్కరే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించి, ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment