సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నాడంటూ ఏపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు స్కిల్ స్కామ్ అవినీతిలో కూరుకుపోయారు. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో యువతను చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చేయలేదని సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు అని అన్నారామె.
ఇక ఇవాళ్టి సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా?. కక్ష సాధింపుగానే చేయాలంటే.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడో చంద్రబాబును అరెస్ట్ అయ్యేవాళ్లు కదా. మీ నాన్నను(దివంగత ఎన్టీఆర్) చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు నీ పౌరుషం ఏమైంది?.. మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ బాలకృష్ణకు చురకలంటించారామె.
టీడీపీ నేతలకు దమ్ముంటే..
టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారు. టీడీపీ నేతలు చర్చకు మాత్రమే సభకు రావాలి కానీ..రచ్చ కోసం మాత్రం వద్దు. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నాం. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చ ఉంది. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలి. సభలో ఈరోజు బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు
:::ప్రభుత్వ విప్,కాపు రామచంద్రారెడ్డి
కోటంరెడ్డి ఓవరాక్షన్
సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడు. చంద్రబాబు ప్రజాధనం ఏవిధంగా లూటీ చేశారో కోర్టుకు అందించాం. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బాలకృష్ణ తొడలు కొడుతూ,మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నారు.
సభలో ప్రజల హక్కులను కాలరాసేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా ..తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదు. చర్చించేందుకు టీడీపీ నేతల దగ్గర విషయం లేదు. అందుకే సభలో అల్లరి చేస్ బయటికి పోవాలనే గందరగోళం సృష్టించారు. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరం.
:::మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment