
సాక్షి, అమరావతి: లోకేష్ అహంకారం, అహంభావంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని.. లేకపోతే లోకేష్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ స్వార్థ రాజకీయాలు కారణంగానే శాసనమండలి రద్దు కాబోతుందని ఆమె పేర్కొన్నారు.
(చదవండి: బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్)