సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకూ సంఖ్యా బలం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సంఖ్యా బలం లేకున్నా ఐదుగురిని నిలబెడుతామని సీఎం కేసీఆర్ ఎలా చెబుతా రని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. పార్టీ నేతలతో మాట్లాడి 3 రోజుల్లో తమ అభ్యర్థిని ఖరారు చేస్తామని భట్టి తెలిపారు. స్పీకర్ పోస్టుకు పోటీకి తమకు సరైన బలం లేదు కాబట్టే ఏకగ్రీవానికి సహకరించామన్నారు. బడ్జెట్ తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేనట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలను ఎక్కు వ రోజులు నిర్వహిస్తే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని, నిరుద్యోగ సమస్యపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో తమ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతారని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment