
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఐదు శాసనమండలి స్థానాలకు సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీకి మరోసారి టీఆర్‌ఎస్ అధినేత అవకాశం కల్పించారు. రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పేర్లను సీఎం శుక్రవారం ప్రకటించారు.
మరోసీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా ముందుగా ఊహించినట్లుగానే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందుకు వారు కేసీఆర్‌ను ధన్యవాదులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment