నామినేషన్ వేసిన మంత్రి నారాయణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందచేశారు. కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంది.
ఇక అసెంబ్లీలో టీడీపీ మెజారిటీ ఉండటంతో నారాయణ ఎన్నిక ఖాయం కానుంది. కాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణను తన మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉభయ సభల్లో వేటిలోనూ సభ్యుడు కారు. మంత్రిగా నియమితులైన వాళ్లు ఏదో ఒక సభలో ఆరు నెలల్లోగా సభ్యులు కావాలన్న నిబంధన ఉంది.